- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: లాస్యను ఇంటి నుంచి వెళ్ళిపోమన్న దివ్య.. కోపంతో రగిలిపోతున్న నందు!
Intinti Gruhalakshmi: లాస్యను ఇంటి నుంచి వెళ్ళిపోమన్న దివ్య.. కోపంతో రగిలిపోతున్న నందు!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

తులసి (Tulasi).. మీ అమ్మానాన్నలు నీతో రావడానికి ఒప్పుకున్నారని నందుతో చెబుతుంది. దాంతో నందు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు. ఇక లాస్య (Lasya) మాత్రం వాళ్ళు అంత త్వరగా ఒప్పుకోవడానికి కారణం ఏమిటి? అని అనేక రకాలుగా నెగిటివ్ గా ఆలోచిస్తుంది. ఇక తులసి అత్తయ్య మామయ్య లను ఎలాంటి లోటు లేకుండా గౌరవంగా చూసుకోవాలి అని అంటుంది.
మరో వైపు శృతి (Sruthi) నువ్వు ఇంత వరకు నా కెరీర్ గురించి ఆలోచించావు.. నా గురించి కష్ట పడ్డావు. కానీ ఇప్పుడు నీ కెరియర్ గురించి ఆలోచించి.. నీ కెరీర్ గురించి కష్టపడు అని ప్రేమ్ (Prem) ను ప్రోత్సహిస్తుంది. అదే క్రమంలో శృతి నేను ఆంటీ ని తప్పు పట్టడం లేదు ఆంటీ మాటలను తప్పుపడుతున్నాను అని అంటుంది.
ఆ క్రమంలో శృతి (Sruthi).. నీ విలువ ఏంటో మీ అమ్మకు తెలిసేలా చేయాలి అని అంటుంది. ఆ తర్వాత దివ్య వాళ్ళు.. నాన్నమ్మ తాతయ్యలు ఇంటి నుంచి వెళ్లి పోతున్నందుకు వాళ్ళ అమ్మ ను నీలాదీసినట్టుగా మాట్లాడుతారు. ఇక తులసి (Tulasi) దేవుడు నాకు పెట్టిన దురదృష్టం కోసం వాళ్ళు వాళ్ళ కొడుకు తో ఉండకపోవడం తప్పు కదా అని పిల్లలకు సర్ది చెబుతుంది.
ఇక నందు (Nandhu) వాళ్ళు వెళుతుండగా దివ్య.. వాళ్ల నాన్న ను బాధపడుతూ హాగ్ చేసుకుంటుంది. అంతేకాకుండా మీరు లాస్య ఆంటీ వల్లనే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు అని అంటుంది. ఇక మా డాడీని మీరు ఇక్కడినుంచి వదిలేసి వెళ్ళండి పువ్వుల్లో లో పెట్టి చూసుకుంటాను అని దివ్య (Divya) లాస్య తో కొట్టి పారేసినట్టుగా మాట్లాడుతుంది.
ఇక ఎవరికీ తెలియకుండా అనసూయ (Anasuya) పరందామయ్య లు నందుతో వెళ్ళడం ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాము అమ్మ తులసి అని లెటర్ రాస్తారు. ఇక నందు (Nandhu) లెటర్ చదివి కోపంతో రగిలిపోతాడు. అంతేకాకుండా ఇదంతా నీ నాటకమే అని తులసిను అంటాడు.
ఇక లాస్య (Lasya) కూడా నువ్వు అత్తమామలను మాతో పంపించడం ఇష్టం లేక ఎక్కడో దాచావని నింద వేస్తుంది. వెంటనే తులసి వాళ్లను వెతకడానికి బయటకు వెళ్ళగా పరందామయ్య దంపతులు తులసి (Tulasi)ని చూసి దక్కుంటారు. తరువాయి భాగంలో తులసి వాళ్ళను చేరుకుంటుందో లేదో చూడాలి.