- Home
- Entertainment
- Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
నిర్మాత టి. శివ కుమార్తె వివాహ రిసెప్షన్లో దళపతి విజయ్: నిర్మాత శివ కుమార్తె వివాహ వేడుకలో దళపతి విజయ్ పట్టు పంచె ధరించి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

దళపతి విజయ్
దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది. ఇదే ఆయన చివరి సినిమా. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇకపై నటించనని చెప్పారు. అందుకే 'జన నాయగన్' ఆయన చివరి సినిమాగా భావిస్తున్నారు. ఈనెల 27న మలేషియాలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది.
జన నాయగన్ మూవీ
ఈ కార్యక్రమాన్ని విజయ్ ఫేర్‌వెల్ పార్టీగా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ ఆడియో వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరవుతారని సమాచారం. ఇప్పటికే విడుదలైన 'దళపతి కచేరి' పాటకు మంచి స్పందన వచ్చింది. రెండో సింగిల్ అప్‌డేట్ త్వరలో రానుంది.
నిర్మాత టి. శివ కుమార్తె డాక్టర్ దక్షిణ వివాహ వేడుక
ఈ క్రమంలోనే విజయ్, నిర్మాత టి. శివ కుమార్తె డాక్టర్ దక్షిణ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివ 'సొల్వదెల్లమ్ ఉన్మై', 'సరోజ', 'పార్టీ', 'చార్లీ చాప్లిన్ 2' లాంటి ఎన్నో చిత్రాలు నిర్మించారు.
నిర్మాత టి శివ నటుడిగా
అంతేకాదు 'పాయుమ్ పులి', 'లత్తి', 'అనీది', 'ది గోట్' లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన కుమార్తె డాక్టర్ దక్షిణ , డాక్టర్ సందీప్ ప్రభాకరన్‌ల వివాహం నవంబర్ 27న తంజావూరులో ఘనంగా జరిగింది.
పట్టు పంచెలో విజయ్
దీని తర్వాత చెన్నై ఎగ్మోర్‌లోని రాణి మెయ్యమ్మై హాల్‌లో రిసెప్షన్ జరిగింది. నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు దళపతి విజయ్ హాజరయ్యారు. పట్టు పంచెలో వచ్చివధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఆయన కాళ్లపై పడి ఆశీస్సులు తీసుకున్నారు.

