- Home
- Entertainment
- నయనతార బట్టలపై తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు.. చూడడానికి అసహ్యంగా, బోల్డ్ స్టేట్మెంట్ వైరల్
నయనతార బట్టలపై తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు.. చూడడానికి అసహ్యంగా, బోల్డ్ స్టేట్మెంట్ వైరల్
తెలుగు నటి, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన డిస్కో శాంతి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో డిస్కో శాంతి పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మెరిసింది.

తెలుగు నటి, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన డిస్కో శాంతి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో డిస్కో శాంతి పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మెరిసింది. అనంతరం హీరో శ్రీహరిని వివాహం చేసుకుంది. 2013లో శ్రీహరి అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డిస్కో శాంతి ఫ్యామిలీ, పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి హీరోయిన్స్ ధరించే డ్రెస్సులపై బోల్డ్ కామెంట్స్ చేశారు. సినిమాకి తగ్గట్లుగా ఏ హీరోయిన్ అయినా గ్లామర్ గా కనిపించడం అవసరం అని అన్నారు. కానీ ఎలాంటి డ్రెస్సులు ఎంపిక చేసుకుంటున్నాం అనేదే ముఖ్యం.
డిస్కో శాంతి మాట్లాడుతూ.. గ్లామర్ కాస్ట్యూమ్స్ ధరించినంత మాత్రాన ఏ హీరోయిన్ పై నెగిటివ్ ఇమేజ్ పడదు. కానీ ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరిస్తున్నాం.. ఏవిధంగా ధరిస్తున్నాం.. మనకి అవి సూట్ అవుతున్నాయా లేదా అనే అంశాలే కీలకంగా ఉంటాయి. ఉదాహరణకి నయనతారని తీసుకుందాం. నయనతార ఎలాంటి కాస్ట్యూమ్స్ లో కనిపించినా అందంగా ఉంటుంది. ఆమె ఎంపిక అంత అద్భుతంగా ఉంటుంది అని డిస్కోశాంతి ప్రశంసించారు.
అలాగే అన్నిరకాల కాస్ట్యూమ్స్ నయన్ కి బాగా సూట్ అవుతాయి. అజిత్ సరసన నటించిన బిల్లా చిత్రంలో బికినీలో మెరిసింది. ఆ బికినిలో నయనతార చాలా అందంగా, స్టైల్ గా ఉంది.. వల్గర్ గా, అసభ్యంగా ఎక్కడా కనిపించలేదు. ఏ బట్టలు ధరించాం అనేది కాదు.. ఎలా కనిపించాం అనేదే ముఖ్యం అని డిస్కో శాంతి అన్నారు.
కొంతమంది ఒంటి నిండా బట్టలు ధరిస్తారు. కానీ బిగుతుగా శరీరానికి అతుక్కునట్లు ఉండే కాస్ట్యూమ్స్ చాలా అగ్లీగా, వల్గర్ గా ఉంటాయి. బికినీ ధరించిన వారంతా అసభ్యంగా కనిపిస్తారు అని.. ఒంటినిండా బట్టలు కప్పుకున్న వారంతా అందంగా ఉంటారని అనుకోవడం తప్పు అని డిస్కో శాంతి అన్నారు.
డిస్కో శాంతి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు డిస్కో శాంతి కామెంట్స్ తో ఏకీభవిస్తున్నారు. నయనతార డ్రెస్సింగ్ స్టైల్ డిస్కో శాంతికి బాగా నచ్చేసినట్లు ఉంది.