MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాస్ డైరెక్టర్ ని దించుతున్న జగన్..వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ పోటీ ?

మాస్ డైరెక్టర్ ని దించుతున్న జగన్..వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ పోటీ ?

డైరెక్టర్ వివి వినాయక్ గురించి పరిచయం అవసరం లేదు. మాస్ పల్స్ తెలిసిన వినాయక్ చాలా మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు సైతం ఇష్టపడే దర్శకుడాయన.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 06 2024, 06:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డైరెక్టర్ వివి వినాయక్ గురించి పరిచయం అవసరం లేదు. మాస్ పల్స్ తెలిసిన వినాయక్ చాలా మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు సైతం ఇష్టపడే దర్శకుడాయన. కొన్నేళ్లుగా వినాయక్ హవా తగ్గినప్పటికీ ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. 

26

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఒకరిని మించేలా మరొకరు ఆయా పార్టీల అధినేతలు ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. సినిమా నేపథ్యం ఉన్న నాయకులు అన్ని ప్రధాన పార్టీల్లో ఉన్నారు. 

36

ఈ క్రమంలో వినాయక్ గురించి ఒక క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. ఆ రూమర్ కి బలాన్ని చేకూర్చేలా నెటిజన్లు ఈ వార్తని వైరల్ చేస్తున్నారు. అదేంటంటే వినాయక్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారట. వినాయక్ బంధువులు, సన్నిహితులు కొందరు వైసీపీలో ఆల్రెడీ ఉండడంతో ఈ రూమర్ కి బలం చేకూరింది. 

46

వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ వైసీపీ తరుపున బరిలో దిగితే ఆ క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. వినాయక్ సోదరుడు ఒకరు వైసిపిలో ఉన్నారు. అదే విధంగా కొడాలినాని లాంటి వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. అయితే వినాయక్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వాస్తున్న రూమర్స్ పై ఆయన సోదరుడు ఒకరు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

56

ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అవన్నీ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన గాలి రూమర్స్ అని కొట్టిపారేశారు. తమ సోదరుడు వైసీపీలో ఉన్న మాట వాస్తవమే కానీ వినాయక్ గారికి రాజకీయాలు పట్టవు అని అన్నారట. ఇటీవల వివి వినాయక్ ఒక పెళ్ళికి హాజరయ్యేందుకు కాకినాడ వెళ్లారట. సీఎం జగన్ కూడా అక్కడకి వచ్చారు. 

66

ఇది ఎన్నికల సమయం కావడంతో.. సీఎం వచ్చిన పెళ్ళికి వినాయక్ గారు కూడా వెళ్లడంతో రూమర్స్ అల్లేశారు. కానీ వాస్తవానికి ఆ పెళ్ళిలో వినాయక్ సీఎం జగన్ ని అసలు కలవలేదట. ఆయన పని ఆయన చూసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినాయక్ ఫోకస్ మొత్తం తదుపరి చిత్రం పైనే ఉందని.. అద్భుతమైన కథ రెడీ చేస్తున్నారని అన్నారు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక అనౌన్స్ మెంట్ ఉంటుంది. ఇక రాజకీయాలకు టైం ఎక్కడ ఉంటుంది ?

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun Favorite Movie: అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? రౌడీ అల్లుడు కాదు.. ప్రతిసారి కొత్త ఫీలింగ్‌
Recommended image2
AI Photos: 80ల నాటి హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మతిపోతుంది
Recommended image3
Expensive Indian Films: వారణాసి, రామాయణ మాత్రమే కాదు.. అత్యంత ఖరీదైన 5 సినిమాలు ఇవే, 17 ధురంధర్ 2లతో సమానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved