అకిరాతో పంజా 2, ఛాన్స్ వస్తే వదలను.. ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేల్చిన డైరెక్టర్
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పై ఫ్యాన్స్ లో రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల అకిరా సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నాడు. మీడియాకి కూడా కనిపిస్తున్నాడు.

Pawan Kalyan
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పై ఫ్యాన్స్ లో రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల అకిరా సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నాడు. మీడియాకి కూడా కనిపిస్తున్నాడు. త్వరలో అకిరా ఎంట్రీ ఖాయం అన్నట్లుగా హంగామా జరుగుతోంది. దీనితో అకిరాకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ మధ్యన ఎస్ జె సూర్య మాట్లాడుతూ.. అకిరాతో ఖుషి 2 చేస్తానని సరదాగా అన్నారు. అది వైరల్ అయింది. తాను ఇకపై దర్శకత్వం చేయనని క్లారిటీ ఇచ్చిన ఎస్ జె సూర్య.. అకిరాతో మాత్రం అవకాశం ఉంటే ఖుషి 2 చేస్తానని ఫన్నీగా అన్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ అకిరాతో పవన్ కళ్యాణ్ సినిమా సీక్వెల్ ప్రపోజల్ తో వచ్చారు.
పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ విష్ణువర్ధన్ దాదాపు 14 ఏళ్ళ క్రితం పంజా అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో బిల్లా చిత్రాన్ని రూపొందిన స్టైలిష్ డైరెక్టర్ ఆయన. కానీ పంజా చిత్రం ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా చూపించడంలో విష్ణువర్ధన్ సక్సెస్ అయ్యారు.
రీసెంట్ గా విష్ణువర్థన్ అకిరా గురించి క్రేజీ కామెంట్స్ చేశారు. అకిరాతో పంజా 2 చేస్తానని విష్ణువర్థన్ చెబుతున్నారు. అకిరా చాలా బావుంటాడు. చిన్నప్పుడు చూశా. చార్మింగ్ బాయ్. అకిరాతో పంజా 2 చేస్తే అదిరిపోతుంది. ఇది నా ఆలోచన. అయితే నేను ప్లాన్ చేయడం కంటే టైం వచ్చినప్పుడు జరిగితేనే బావుంటుంది. పంజా చిత్రాన్ని నేను ప్లాన్ చేయలేదు. అనుకోకుండా అవకాశం వచ్చింది. అకిరాతో కూడా పంజా 2 చిత్రానికి ఛాన్స్ వస్తే వదిలిపెట్టను.
పంజా చిత్రం వల్ల పవన్ కళ్యాణ్ గారితో దగ్గరగా ట్రావెల్ అయ్యే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సూటిగా మాట్లాడతారు. అది ఆయనలో నాకు నచ్చే అంశం. ఆయన చుట్టూ ఏదో పవర్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. చాలా జెన్యూన్ గా స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి. పంజా చిత్రం తర్వాత విష్ణువర్ధన్ కి తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయట. కానీ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయానని అంటున్నారు. ఎప్పుడు మంచి ఛాన్స్ వచ్చినా తెలుగులో చేస్తానని తెలిపారు. మొత్తంగా అకిరా తో పంజా 2 చేస్తానని డైరెక్టర్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేల్చినట్లు అయింది. పంజా డిజాస్టర్ మూవీ. అలాంటప్పుడు పంజా చిత్రానికి సీక్వెల్ అవసారమా అని ప్రశ్నిస్తున్నారు.