MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • CM Vijay: లంచ్ బాక్స్‌తో సెక్రటేరియట్ కు సీఎం విజయ్.. అధికారులకు అదిరిపోయే షాక్ ఇచ్చిన దళపతి

CM Vijay: లంచ్ బాక్స్‌తో సెక్రటేరియట్ కు సీఎం విజయ్.. అధికారులకు అదిరిపోయే షాక్ ఇచ్చిన దళపతి

పాలనలో తన మార్క్ చూపిస్తున్నాడు తమిళనాడు సీఎం విజయ్ దళపతి. అధికారులకు కూడా ఆశ్చర్య కలిగించేలా విజయ్ ప్రవర్తిస్తున్నారు. సచివాలయంలో ఆయన చేసే పనులు తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 16 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంచలనం సృష్టించిన విజయ్ దళపతి
Image Credit : X

సంచలనం సృష్టించిన విజయ్ దళపతి

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సౌత్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ .. తన మార్క్ పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టైమ్ కు ఆఫీస్ లో ఉండాల్సిందే..
Image Credit : Asianet News

టైమ్ కు ఆఫీస్ లో ఉండాల్సిందే..

మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ ఆఫీస్ సమయానికి పావుగంట ముందే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో ఉన్న సచివాలయానికి వచ్చేస్తున్నాడు. సాధారణంగా రాజకీయ నాయకుల పని విధానానికి డిఫరెంట్ గా విజయ్ వ్యవహరిస్తుండటంతో అధికారులను ఈ తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

35
సాధారణ ఉద్యోగిలా విజయ్ దళపతి తీరు..
Image Credit : Asianet News

సాధారణ ఉద్యోగిలా విజయ్ దళపతి తీరు..

అంతే కాదు విజయ్ దళపతి సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఇంటి నుంచి స్వయంగా లంచ్ బాక్స్ తీసుకువస్తున్నారు. లంచ్ టైమ్ లో కూడా ఆయన తన ఛాంబర్‌కే పరిమితమవుతూ, భోజనం పూర్తయ్యిన వెంటనే తిరిగి విధుల్లో నిమగ్నమవుతున్నట్లు సమాచారం. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత క్రమశిక్షణతో పని చేయడం అధికార వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.

45
ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపిస్తోన్న దళపతి..
Image Credit : ANI

ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపిస్తోన్న దళపతి..

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఎన్నికల సమయంలో తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ఇచ్చిన హామీలను అమలు చేయడమే విజయ్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమీకరించాలనే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.ఇందులో భాగంగా వివిధ శాఖల కీలక ఫైళ్లను స్వయంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఉన్నతాధికారులతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలో వేగం తీసుకురావడమే కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే దృఢ సంకల్పంతో విజయ్ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.

55
సీఎం గా విజయ్ సంచలన నిర్ణయాలు..
Image Credit : ANI

సీఎం గా విజయ్ సంచలన నిర్ణయాలు..

సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన పనితీరుతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ టైమ్ సెన్స్, వర్క్ డెడికేషన్, నిర్ణయాలు తమిళనాడులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. అధికారంలోకి రాగానే గుడి, బడికి దగ్గరలో ఉన్న వైన్ షాపులను ఆయన మూయించేశారు. ప్రస్తతం ఈ విషయం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved