MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు అమ్మాయిలకు అది తక్కువ, అందుకే సక్సెస్ కాలేకపోతున్నారు... డైరెక్టర్ తేజ కామెంట్స్ 

తెలుగు అమ్మాయిలకు అది తక్కువ, అందుకే సక్సెస్ కాలేకపోతున్నారు... డైరెక్టర్ తేజ కామెంట్స్ 

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ రావనే ఓ వాదన ఉంది. ఈ ఆరోపణపై దర్శకుడు టతేజ స్పందించారు. ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 02 2023, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


దర్శకుడు తేజ లేటెస్ట్ మూవీ అహింస. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నేడు ఈ మూవీ విడుదలైంది. అహింస చిత్ర ప్రమోషన్స్ దర్శకుడు తేజ గట్టిగా చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాల మీద స్పందించారు. 
 

27

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆదరణ దక్కదనే ఓ వాదన ఉంది. దీని గురించి మాట్లాడుతూ... తెలుగు అమ్మాయిలకు సహనం తక్కువ. నేను నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలను హీరోయిన్ గా నటింపచేయాలని ప్రయత్నం చేశాను. కుదర్లేదు. ఒక ఆరు నెలల తర్వాత సినిమా ఉంటుంది అంటే అప్పటి వరకు ఆగలేరు. ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వలనో, సొసైటీకి భయపడో... ఎక్కడో మూలన నిల్చుకునే క్యారెక్టర్ చేస్తారు కానీ హీరోయిన్ ఆఫర్ కోసం ఓపికగా ఎదురుచూడరని ఆయన అన్నారు. 
 

37

దర్శకుడు తేజ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి వంటి తెలుగు హీరోయిన్స్ కోలీవుడ్ లో సత్తా చాటారు. వారికి తెలుగులో ఆదరణ దక్కలేదు. అలాగే చాలా మంది తెలుగు హీరోయిన్స్ కి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆదరణ లభించడం లేదు. 
 

47

సహనంగా ఎదురుచూసి మంచి అవకాశాలు అందిపుచ్చుకున్న వేళ సక్సెస్ అవుతారని తేజ చెప్పకనే చెప్పారు. కొత్త వాళ్లతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన చరిత్ర తేజ సొంతం. ఆయన పరిచయం చేసిన హీరోలు, కమెడియన్స్, హీరోయిన్స్ బుల్లితెరపై సత్తాచాటారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్లో ఇంకా అనేక విషయాల మీద తేజ మాట్లాడారు. 
 

57

  దగ్గుబాటి రామానాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం అభిరామ్ ని హీరోగా పరిచయం చేశాను. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చే నటులకు పోలికలు ఎదురవుతాయి. ఇప్పటికే స్టార్స్ అయిన రానా, వెంకటేష్ లతో అభిరామ్ ని పోల్చకూడదు. 

 

 

67

  అభిరామ్ కి సినీ నేపథ్యం ఉంది. నా కంటే తనపైనే ఎక్కువ ఒత్తిడి ఉంది. ఒకరోజు సురేష్ బాబు సెట్స్ కి వచ్చారు. నాన్నా నువ్వు సెట్స్ లో ఉంటే నేను చేయను అని అభిరామ్ అన్నాడు. సురేష్ బాబు మానిటర్ వెనుక కూర్చున్నారు. సురేష్ బాబు సెట్స్ కి వస్తే వెంకటేష్, రానా కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. ఆయన దృష్టి కోణం భిన్నంగా ఉంటుంది. 

77

అహింస ఒక ఫిలాసఫీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. అహింసను ఎలా వాడాలో చెప్పాము. ఈ చిత్రంలో ఏకంగా 14 ఫైట్ సీక్వెన్సులు ఉన్నాయి. వాటిలో 4 యాక్షన్ సన్నివేశాలకు నేనే ఫైట్ మాస్టర్ గా చేశాను. అహింస విజయం సాధించి డబ్బులు వస్తే మళ్ళీ చిత్రాలు చేస్తాను. రానా తో 'రాక్షస రాజు' అనే చిత్రం చేస్తాను. అలాగే మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తాను.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Varalaxmi Sarathkumar: డబ్బుల్లేకపోతే పిల్లల్ని కనడం ఎందుకు.. దుమారం రేపుతున్న వరలక్ష్మి కామెంట్స్
Recommended image2
Revanth Reddy: అల్లు అర్జున్‌ హాలీవుడ్‌కి వెళ్లాలి, మన పోటీ వాళ్లతోనే.. సీఎం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Recommended image3
Tollywood: అక్క‌డ కూడా మేక‌ప్ వేసుకోమ‌నే వారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved