యమలీల కు ఆలీ రెమ్యూనరేషన్ ఎంత? బ్లాక్ బస్టర్ ని రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరో చెప్పిన డైరెక్టర్!
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాజా ఇంటర్వ్యూలో యమలీల మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కొందరు స్టార్స్ ఆ మూవీని రిజెక్ట్ చేశారంటూ వాళ్ళ పేర్లు బహిర్గతం చేశాడు.
Ali
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఈయన మల్టీ టాలెంటెడ్. తన సినిమాలకు సంబంధించిన ప్రధాన క్రాఫ్ట్స్ కి ఆయనే పనిచేసేవారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం, నటన... ఎస్వీ కృష్ణారెడ్డి అని టైటిల్ పడిన ఏకైన డైరెక్టర్.
Yamaleela
90లలో ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు సంచలనం రేపాయి. కామెడీ, సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలతో అద్భుత విజయాలు అందుకున్నాడు. జంధ్యాల తర్వాత హెల్తీ కామెడీకి ఎస్వీ కృష్ణారెడ్డి పెట్టింది పేరు. ఆయన తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో యమలీల ఒకటి.
Yamaleela
1995లో విడుదలైన యమలీల బ్లాక్ బస్టర్ హిట్. ఆలీ హీరోగా నటించగా ఇంద్రజ హీరోయిన్. యముడిగా కైకాల సత్యనారాయణ, చిత్ర గుప్తుడిగా బ్రహ్మానందం నటించారు. ఇక ప్రధాన విలన్ పాత్రలో తనికెళ్ళ భరణి విలక్షణమైన నటనతో మెప్పించారు. అయితే ఈ మూవీని కొందరు స్టార్స్ రిజెక్ట్ చేశారట.
Yamaleela
తాజా ఇంటర్వ్యూలో యమలీల మూవీని వదులుకున్న నటుల పేర్లు ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించారు. కమెడియన్ ఆలీని యమలీల హీరోగా ఎంచుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి... ఈ విషయం ఆయనకు చెప్తే నమ్మలేదట. నేను హీరోగా చేయడం ఏమిటండీ? అని ఆలీ అన్నాడట.
Yamaleela
ఈ కథ నీకే సెట్ అవుతుందని ఎస్వీ కృష్ణారెడ్డి ఆలీని హీరోగా ఎంపిక చేశాడట. రెండు మూడు వేలు రెమ్యూనరేషన్ తీసుకునే ఆలీకి యమలీల చిత్రానికి రూ. 50 వేలు ఇచ్చారట.
ఇక హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారట. ఆలీ హీరో అనగానే సౌందర్య చేయను అన్నారట. పెద్ద హీరోల పక్కన చేస్తున్న నేను ఆలీతో నటిస్తే కెరీర్ కి ప్రమాదం అని సౌందర్య అన్నారట. సరే మీ ఇష్టం అని చెప్పిన ఎస్వీ కృష్ణారెడ్డి ఇంద్రజను హీరోయిన్ గా తీసుకున్నారట.
sv krishna reddy
ఇక మెయిన్ విలన్ గా కోట శ్రీనివాసరావును అనుకున్నారట. ఆయన కూడా సౌందర్య చెప్పిన కారణమే చెప్పారట. అప్పుడు కోట శ్రీనివాసరావు చేయాల్సిన పాత్ర తనికెళ్ళ భరణికి ఇచ్చారట. అలా సెట్స్ పైకి వెళ్లిన యమలీల అతిపెద్ద విజయం సాధించింది.
SV Krishna Reddy
నేను ప్రతి సినిమాకు కొత్తగా ఆలోచిస్తాను. యమలీల ఆడుతుంది అనే గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండేవి. అందుకే స్టార్స్ రిజెక్ట్ చేసినా పర్లేదు అనుకున్నాను. కొత్త కథలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇండస్ట్రీ ఆదరించదు... అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.