- Home
- Entertainment
- సాయిపల్లవిపై దర్శకుడు సుకుమార్ సంచలన కామెంట్.. `లేడీ పవన్ కళ్యాణ్` అంటూ కితాబు.. హోరెత్తిన ప్రాంగణం..
సాయిపల్లవిపై దర్శకుడు సుకుమార్ సంచలన కామెంట్.. `లేడీ పవన్ కళ్యాణ్` అంటూ కితాబు.. హోరెత్తిన ప్రాంగణం..
హీరోయిన్లలో నేచురల్ పర్ఫెర్మెన్స్ తో ఆకట్టుకుంటున్న సాయిపల్లవిపై క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంచలన కామెంట్ చేశారు. `లేడీ పవన్ కళ్యాణ్` అంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.

శర్వానంద్, రష్మిక మందన్నా(Rashmika Mandanna) కలిసి నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్(Aadavaallu Meeku Joharlu Pre Release Event) ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి సాయిపల్లవి(Sai Pallavi), కీర్తిసురేష్‌తోపాటు దర్శకుడు సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్లు కీర్తిసురేష్(Keerthy Suresh), రష్మిక మందన్నాల గురించి చెబుతూ వారి నటనని అప్రిషియేట్ చేశారు సుకుమార్. వీరు బెస్ట్ యాక్టర్స్ అని కొనియాడారు. వీరికి గ్యాంగ్ లీడర్ సమంత అంటూ ప్రశంసించారు. రష్మిక గురించి చెబుతూ ఆమె పేరు మర్చిపోవడం నవ్వులు పూయించింది.
అయితే Sai Pallavi గురించి చెప్పడానికి దర్శకుడు సుకుమార్(Sukumar) ప్రయత్నించగా ప్రాంగణం మొత్తం అరుపులతో హోరెత్తిపోయింది. సుకుమార్‌ని మాట్లాడనివ్వకుండా అభిమానులు అరుపులతో మారుమోగిపోయేలా చేశారు. దీంతో సుకుమార్ షాక్ అయ్యారు. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది చూసిన సాయిపల్లవి సైతం తన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తంచేసింది. సుకుమార్‌కి చెవిలో ఏదో చెప్పింది.
అయితే ఆభిమానులు నాన్ స్టాప్‌గా అరవడంతో ఆశ్చర్యపోయిన సుకుమార్ `నువ్వు లేడీ పవన్ కళ్యాణ్`(Lady Pawan Kalyan) అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో మరోసారి `ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. వెనకాలు ఉన్న హీరోయిన్లు కీర్తిసురేష్, రష్మిక మందన్నాలుసైతం ఆశ్చర్యపోవడం విశేషం. ఈ సందర్బంగా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు సుకుమార్ అద్భుతమైన యాక్టన్ అని కొనియాడారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయం చెప్పే అవకాశం రాలేదన్నారు.
సాయిపల్లవి మంచి ఆర్టిస్ట్ అని, అదే సమయంలో మంచి హ్యూమన్ బీయింగ్ అని తెలిపారు. యాడ్ రిజక్ట్ చేయడం గొప్ప విషయం. ఇన్‌స్పైరింగ్‌గా ఉంటావని, ఎప్పటికీ ఆ విషయంలో గుర్తిండిపోతావని అభినందించారు సుకుమార్. మంచి నటి మాత్రమే కాదు, మంచి హ్యూమన్ బీయింగ్‌గా కూడాఉండగలగడం ఈ ఫీల్డ్ లో చాలా కష్టమని, అందుకు సాయిపల్లవిని అభినందించారుసుకుమార్.
అయితే ఆ తర్వాత సాయిపల్లవి మాట్లాడే సమయంలోనూ అభిమానులు మరోసారి హోరెత్తించారు. ఈవెంట్ మొత్తం దద్దరిల్లేలా చేశారు. మధ్యలో యాంకర్ సుమ కల్పించుకుని అభిమానులను నిలవరింపచేసే ప్రయత్నం చేసింది. అయితే అభిమానులు ఆ రేంజ్‌తో అరవడంతో సాయిపల్లవి స్పందిస్తూ,ఈ ఈవెంట్ మళ్లీ ఏడవడం బాగోదని, మళ్లీ ఏడవలేనని తెలిపింది. `శ్యామ్ సింగరాయ్` ఈవెంట్‌లో ఇదే స్థాయిలో అభిమానులు అరుపులతో హోరెత్తించడంతో సాయిపల్లవి కన్నీళ్లు పెట్టున్న విషయం తెలిసిందే. దాన్ని గుర్తు చేస్తూ మీ ప్రేమకి ధన్యవాదాలు అని తెలిపింది.
మరోవైపు ఈ ఈవెంట్‌కి తాను గెస్ట్ గా రాలేదని, కేవలం ఫ్యామిలీ మెంబర్‌లా వచ్చానని తెలిపింది. తనతో `పడి పడి లేచే మనసు` చిత్రం చేసిన నిర్మాతలకు ఈచిత్రం పెద్ద విజయం సాధించాలని తెలిపింది. అలాగే శర్వానంద్ తనకు ఫ్రెండ్ లాంటివారని, ఇప్పటికీ మంచి సినిమాలు చేయాలని వెతుక్కుంటారని తెలిపింది. మొత్తానికి `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఈవెంట్‌లో అందరి కంటే హైలైట్ గా నిలిచి అటు కీర్తిసురేష్, రష్మిక మందన్నాలు సైతం అసూయ పడేలా చేసింది సాయిపల్లవి.