MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Sukumar: ఒక దొంగ, పాము, గుడి పూజారి.. దర్శకుడు సుకుమార్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన

Sukumar: ఒక దొంగ, పాము, గుడి పూజారి.. దర్శకుడు సుకుమార్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన

దర్శకుడు సుకుమార్‌ `పుష్ప 2`తో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తన జీవితం మారానికి ఒక పాము, దొంగ, గుడి పూజారి ప్రధాన కారణమని తెలిపారు సుకుమార్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 11 2026, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన సుకుమార్‌
Image Credit : our own

ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన సుకుమార్‌

క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ `పుష్ప 2`తో సృష్టించిన సంచలనాలు ఎలాంటివో మనం చూశాం. సుకుమార్‌ జీనియస్‌ దర్శకుడు అని, ఆయన ఆలోచనలు ఎక్కడో చాలా హైలో ఉంటాయని, ఆయన ఆలోచనలను నేలకు దించి, సినిమా చేస్తే తాము ఎవ్వరం ఆయన ముందు నిలబడలేం అని దర్శకుడు రాజమౌళి ఓ ఈవెంట్‌లో కామెంట్‌ చేశారు. ఆ కామెంట్లని నిజం చేశారు సుకుమార్‌. `రంగస్థలం`, `పుష్ప` చిత్రాలతో తానేంటో ఇండియన్‌ సినిమాకి రుచి చూపించారు. `పుష్ప 2` ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్
Image Credit : Sukumar/Instagram

ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్

ఇక దర్శకుడు సుకుమార్‌ సినిమాల్లోకి రావడానికి ముందు లెక్కల మాస్టర్‌. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. రైటింగ్‌, కథలు చెప్పాలనే ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. `ఆర్య`తో దర్శకుడిగా మారి, ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు. అయితే సుకుమార్‌ ఇప్పుడు ఇంత పెద్ద స్టార్‌ డైరెక్టర్‌ కావడానికి తెరవెనుక తన ఊర్లో జరిగిన స్టోరీ ఉంది. ఒక దొంగ, ఒక పాము, ఒక గుడి పూజారి సుకుమార్‌ లైఫ్‌నే మార్చేశాయి. అసలేం జరిగిందనేది చూస్తే, సుకుమార్‌ ది తూర్పుగోదావరి జిల్లా, మట్టపర్రు విలేజ్‌. సుకుమార్‌ చిన్నప్పుడు ఆ ఊర్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఊర్లో వెంకటేశ్వరస్వామి వెలిశారు. దానికో కథ ఉంది.

34
ఊర్లో వెంకటేశ్వరస్వామి ఆలయం
Image Credit : our own

ఊర్లో వెంకటేశ్వరస్వామి ఆలయం

సుకుమార్‌ ఇంటికి కొద్ది దూరంలో రెండు తాటి చెట్లు ఉండేవట. వాటి మధ్యలో పాము పుట్ట ఉండేది, అక్కడ పాము తిరిగేది. దీంతో అటువైపు ఎవరూ వెళ్లేవారు కాదు. సుకుమార్‌ ఊర్లోనే ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగ సడెన్‌గా పుట్టకు సమీపంలో చెట్టుకింద కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాడట. అక్కడే ఓ రాయి మీద వెంకటేశ్వరస్వామి ఆకారం ఉంది. దీంతో ఈ పరిణామాలు చూసి జనమంతా అక్కడ వెంకటేశ్వరస్వామి వెలిశారని ప్రచారం చేశారట. అక్కడ పుట్టలో ఉన్న పాము ఆ రాయి వద్దే తిరిగేదట. అంతేకాదు ఆ దొంగ వద్దకు కూడా వచ్చేదని, అతని చుట్టూ తిరిగేది. అయినా ధ్యానంలో ఉన్న అతను పట్టించుకునేవాడు కాదట. పక్కనే చెరువు ఉంటే, దాంట్లో మునిగి వచ్చిన రాళ్ల చుట్టూ, విగ్రహాల చుట్టూ తిరిగేదట పాము. దీన్ని సుకుమార్‌ స్వయంగా చూశారట. ఆ సమయంలోనే ఊర్లో ఓ పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడి తల నిర్ణీత పరిమాణం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండేదట. చేతులకు ఎర్రటి శంఖు చిత్రాలున్నాయట. దీంతో ఇవన్నీ చూసి అక్కడ దేవుడే మొలిశాడనే పుకారు స్టార్ట్ అయ్యిందట. దొంగ కాస్త స్వామిజీగా మారిపోయాడు. దీంతో ఇతర ఊర్ల నుంచి జనాలు రావడం, ఆ రాళ్లని, పిల్లాడిని చూసి వెళ్లేవారట. అంతేకాదు తోచని విరాళాలు ఇచ్చేవారట.

44
సుకుమార్‌ లైఫ్‌ మార్చిన పాము, దొంగ, పూజారి
Image Credit : our own

సుకుమార్‌ లైఫ్‌ మార్చిన పాము, దొంగ, పూజారి

వచ్చిన విరాళాలతో గుడని నిర్మించారట. ఆ గుడి నిర్మాణంలో సుకుమార్‌ కూడా భాగమయ్యాడట. గుడి కట్టడం కోసం పనిచేస్తే డబ్బులు కూడా ఇచ్చేవారట. ఆ గుడికి బీఏ చదివిన పూజారి వచ్చాడు. ఆయన వద్దకు సుకుమార్‌ ట్యూషన్‌కి వెళ్లేవాడట. పూజారికి నవలలు చదవడం అలవాటు. వారపత్రికల్లో వచ్చే సీరియళ్లని కలిసి పుస్తకంగా తయారు చేసేవారట. అవన్నీ చదువుకోవడానికి ఇచ్చేవాడట. అవి తనకు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు సుకుమార్‌. ఒక రకంగా తనకు అక్షర జ్ఞానం కలిగింది అక్కడే అని తెలిపారు. దానికి కారణం ఆ పాము, దొంగ, గుడి పూజారి అని తెలిపారు. ఒకవేళ అక్కడ గుడి లేకపోయినా, పాము లేకపోయినా, ఆ దొంగ లేకపోయినా తానిప్పుడు ఇలా ఉండేవాడిని కాదు అని తెలిపారు సుకుమార్‌. `రంగస్థలం` సినిమా సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు దర్శకుడు. ప్రస్తుతం ఆయన రామ్‌ చరణ్‌తో తీయబోతున్న సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Dacoit Collections: డెకాయిట్‌ మూవీ మొదటి రోజు కలెక్షన్లు.. రవితేజ, శర్వానంద్‌లకు అడవి శేష్‌ షాక్‌
Recommended image2
Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ గురించి పూనకాలు తెప్పించే వార్త.. అసలు ఈ ఐడియాకే మొక్కాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved