MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Dacoit Collections: డెకాయిట్‌ మూవీ మొదటి రోజు కలెక్షన్లు.. రవితేజ, శర్వానంద్‌లకు అడవి శేష్‌ షాక్‌

Dacoit Collections: డెకాయిట్‌ మూవీ మొదటి రోజు కలెక్షన్లు.. రవితేజ, శర్వానంద్‌లకు అడవి శేష్‌ షాక్‌

అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `డెకాయిట్‌` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఇది రవితేజ, శర్వానంద్‌ చిత్రాలను దాటేయడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 11 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డెకాయిట్‌కి పాజిటివ్‌ టాక్‌
Image Credit : X/@AnnapurnaStdios

డెకాయిట్‌కి పాజిటివ్‌ టాక్‌

అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా `డెకాయిట్‌` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శానిల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీని సుప్రియా, సునీల్‌ నారంగ్‌ నిర్మించారు. ఇందులో అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మంచి అంచనాల మధ్య విడుదలయ్యింది. అయితే యావరేజ్‌ నుంచి, ఎబౌ యావరేజ్‌ టాక్‌ ని తెచ్చుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం ఊహించని విధంగా సందడి చేస్తోంది. తొలి రోజు మంచి వసూళ్లని రాబట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డెకాయిట్‌ కలెక్షన్లు
Image Credit : X/@AnnapurnaStdios

డెకాయిట్‌ కలెక్షన్లు

అడవి శేష్‌ సినిమాలంటే మినిమమ్‌ గ్యారంటీ అనే పేరుంది. పైగా ఆయన సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలతో అలరిస్తూ వచ్చారు. కానీ `డెకాయిట్‌`తో తన జోనర్‌ దాటి ప్రయోగం చేశారు. లవ్‌ ఎమోషనల్‌, యాక్షన్‌ మేళవింపుగా ఈ మూవీని చేశారు. దీనికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. ఈ సినిమా మొదటి రోజు రూ.13.57 కోట్ల వరకు వసూళ్లని రాబట్టినట్టు పలు బాక్సాఫీసు సైట్లు వెల్లడించాయి. ఇందులో ఇండియాలో ఏడున్నర కోట్లు, ఓవర్సీస్‌లో సుమారు ఆరు కోట్ల వరకు సాధించినట్టు సమాచారం. ఓవరాల్‌గా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పదమూడు కోట్లకుపైగా గ్రాస్‌ సాధించినట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
Dacoit Movie Review: డెకాయిట్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మూవీ ఎలా ఉందంటే ?
Related image2
Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ గురించి పూనకాలు తెప్పించే వార్త.. అసలు ఈ ఐడియాకే మొక్కాలి
34
రవితేజ, శర్వానంద్‌ సినిమాలకు షాక్‌
Image Credit : X/@AnnapurnaStdios

రవితేజ, శర్వానంద్‌ సినిమాలకు షాక్‌

ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం `డెకాయిట్‌` సినిమా కలెక్షన్లని అధికారికంగా ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.16కోట్లు రాబట్టినట్టు వెల్లడించింది. ఓవర్సీస్‌లో బాక్సాఫీసుని షేక్‌ చేస్తుందని టీమ్‌ తెలిపింది. అక్కడ మొదటి రోజు 5లక్షల 75వేల డాలర్లు రాబట్టింది. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు ఊహించని వసూళ్లని రాబట్టిందని చెప్పొచ్చు. ఈ విషయంలో ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, శర్వానంద్‌ నటించిన `నారీ నారీ నడుమ మురారి` చిత్రాలను కూడా దాటేయడం విశేషం. ఈ సినిమాలు మొదటి రోజు కేవలం ఐదు కోట్లు మాత్రమే రాబట్టాయి. ఇప్పుడు అడవి శేష్‌ వారి సినిమాలకు దాటేయడం విశేషం. ఇది ఆయన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్‌గా చెప్పొచ్చు. అడవి శేష్‌ నటించిన `మేజర్‌` మూవీ మొదటి రోజు రూ.13కోట్లు రాబట్టింది. ఇప్పుడు దాన్ని `డెకాయిట్‌` దాటేసింది.

44
డెకాయిట్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌, బిజినెస్‌ లెక్కలు
Image Credit : Asianet News

డెకాయిట్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌, బిజినెస్‌ లెక్కలు

`డెకాయిట్‌` మూవీకి మొత్తంగా రూ.62కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం. ఇక దీనికి థియేట్రికల్‌గా రూ.32కోట్ల వ్యాపారం జరిగింది. ఏపీ, తెలంగాణలో రూ.19కోట్లకు సేల్‌ కాగా, మిగిలిన ఇండియాలో రూ.5కోట్లు, ఓవర్సీస్‌లో ఆరు కోట్లకు అమ్ముడు పోయింది. అయితే ఓవర్సీస్‌లో ఈ మూవీ ఈ ఈవెండ్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌ కాబోతుంది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.33కోట్ల షేర్‌ రావాలి. రూ.65కోట్ల గ్రాస్‌ రావాల్సి ఉంది. ఇదే జోరు చూపిస్తే, మొదటి వీకెండ్‌తోపాటు, మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని చెప్పొచ్చు. అయితే శనివారం నుంచి దీనికి ఎలాంటి స్పందన ఉంటుందనేది చాలా కీలకం. అదే ఈ సినిమా భవిష్యత్‌ని నిర్ణయించనుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Dacoit Movie Review: డెకాయిట్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ మూవీ ఎలా ఉందంటే ?
Recommended image2
Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ గురించి పూనకాలు తెప్పించే వార్త.. అసలు ఈ ఐడియాకే మొక్కాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved