- Home
- Entertainment
- సీక్వెల్, ప్రీక్వెల్ ఊహకు కూడా అందదు.. ఓజీ జస్ట్ శాంపిల్ అంతే, సుజీత్ కామెంట్స్ తో ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్
సీక్వెల్, ప్రీక్వెల్ ఊహకు కూడా అందదు.. ఓజీ జస్ట్ శాంపిల్ అంతే, సుజీత్ కామెంట్స్ తో ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్
ఓజీ మూవీ సీక్వెల్, ప్రీక్వెల్ పై సుజీత్ క్రేజీ కామెంట్స్ చేశారు. ఓజీ మూవీ జస్ట్ శాంపిల్ మాత్రమే అని సుజీత్ అన్నారు. సుజీత్ కామెంట్స్ తో ఫ్యాన్స్ ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ లకు టైటిల్స్ కూడా పెట్టేస్తున్నారు.

OG Director Sujeeth
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విజయవంతంగా థియేటర్స్ లో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ చిత్రంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. డైరెక్టర్ సుజీత్ అభిమానులని డిసప్పాయింట్ చేయకుండా పవన్ ని సరికొత్త యాక్షన్ అవతారంలో చూపించారు. ఈ మూవీలో యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఇంతటి మాస్ అండ్ స్టైలిష్ గా గతంలో ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు. జపాన్ నేపథ్యం నుంచి కథని ముంబైకి కనెక్ట్ చేసిన విధానం బావుంది.
పదేళ్ల పాటు ఓజీ యూనివర్స్
డైరెక్టర్ సుజీత్ మూవీ చివర్లో ఓజీ పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే అది సీక్వెలా, లేక ప్రీక్వెలా అనేది క్లారిటీ లేదు. ఫ్యాన్స్ మాత్రం ఓజీ 2 వీలైనంత త్వరగా రావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి అభిమానులకు సుజీత్, తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఓజీ ఇక్కడితో ఆగిపోదు. ఓజీ యూనివర్స్ అనేది 10 ఏళ్లపాటు కొనసాగుతుంది అని తెలిపారు. అయితే సీక్వెల్ ఉంటుందా ప్రీక్వెల్ ఉంటుందా అని యాంకర్ ప్రశ్నించగా సుజీత్ రియాక్ట్ అయ్యారు. ఓజీ చిత్రానికి ప్రీక్వెల్, సీక్వెల్ రెండూ ఉంటాయి.
ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ కి టైటిల్స్ పెట్టేసిన ఫ్యాన్స్
రెండింటినీ ఒకేసారి షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సుజీత్ ఇచ్చిన అప్డేట్ తో పవన్ అభిమానులు మరింతగా క్రేజీగా మారిపోయారు. ఓజీ సీక్వెల్ ప్రీక్వెల్ లకు టైటిల్స్ కూడా పెట్టేస్తున్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ పెడుతున్న టైటిల్స్ చూస్తే ఆశ్చర్యపోవలసిందే.
ఓజీ ప్రీక్వెల్ : ది ఫస్ట్ బ్లడ్
ఓజీ సీక్వెల్ : రిటర్న్ ఆఫ్ ది వారియర్
ఓజీ ది బ్లాక్ డ్రాగన్
ఓజీ ఇన్ఫినిటీ వార్
ఓజీ ఎండ్ గేమ్.. సుజీత్ తదుపరి చిత్రాల లైనప్ ఇలాగే ఉండాలి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఓజీ జస్ట్ శాంపిల్ మాత్రమే
ఓజీ మూవీ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫుల్ పొటెన్షియల్ కాదు.. జస్ట్ శాంపిల్ మాత్రమే అని సుజీత్ చేసిన కామెంట్స్ ఇంకా అంచనాలు పెంచేస్తున్నాయి. త్వరలో ఓజీ చిత్రంలో నేహా శెట్టి ఐటెం సాంగ్ ని కూడా యాడ్ చేయబోతున్నట్లు సుజీత్ ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద ఓజీ మూవీ జోరు తగ్గడం లేదు. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే ఓజీ మూవీ బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే పెద్ద ఛాలెంజ్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తయ్యాక ఓజీ సీక్వెల్ ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పవన్ తన చిత్రాలకు ఎంత వరకు టైం కేటాయిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఓజీ సీక్వెల్ అంటే ఇంకా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మరి పవన్, సుజీత్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, వెంకట్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు.