- Home
- Entertainment
- ఈవారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే.. క్రేజీ కంటెంట్ తో శివకార్తికేయన్, శ్రద్దా శ్రీనాథ్ రెడీ
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే.. క్రేజీ కంటెంట్ తో శివకార్తికేయన్, శ్రద్దా శ్రీనాథ్ రెడీ
శివకార్తికేయన్ నటించిన మదరాసి చిత్రం, శ్రద్దా శ్రీనాథ్ నటించిన ది గేమ్ వెబ్ సిరీస్ తో పాటు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులని అలరించేందుకు క్రేజీ కంటెంట్ రెడీ అవుతోంది. వాటి రిలీజ్ డేట్లు, స్ట్రీమింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

This Week OTT Releases
ఈ వారం ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు, వెబ్ సీరీస్‌లు సిద్ధమయ్యాయి.నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు విభిన్న భాషలు, జానర్లలో ఉన్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల చేయనున్నాయి. శివకార్తికేయన్ నటించిన మధరాసి, నరైన్ హీరోగా నటించిన సాహసం, ర్యాన్ రైనాల్డ్స్ ప్రధాన పాత్రలో నటించిన ఇఫ్ వంటి సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
కె ఫర్ కింబాప్ (K for Kimbap)
కొరియన్ వంటకం కింబాప్ చుట్టూ తిరిగే ఈ డాక్యుమెంటరీ సెప్టెంబర్ 30న విడుదల అవుతుంది. నామ్ డోహ్-హ్యాంగ్ ఇందులో ప్రధానంగా కనిపిస్తారు.
ఎక్కడ చూడాలి: Netflix
ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ (The Game: You Never Play Alone)
ఒక గేమ్ డెవలపర్ ఆన్‌లైన్, రియల్ లైఫ్ దాడులను ఎదుర్కొంటూ తన కెరీర్ కోసం పోరాడే కథ. శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్, చందినీ తమిళరసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ఎక్కడ చూడాలి: Netflix
మాన్స్టర్ ది ఎడ్ గీన్ స్టోరీ (Monster The Ed Gein Story)
హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన పలు విలన్ పాత్రలకు ప్రేరణ అయిన నిజజీవిత నేరగాడు ఎడ్ గీన్ కథ. చార్లీ హన్నమ్, లారీ మెట్కాల్ఫ్ నటించారు. అక్టోబర్ 3 నుంచి అందుబాటులోకి రానుంది.
ఎక్కడ చూడాలి: Netflix
స్టీవ్ (Steve)
ఒక రీఫార్మ్ స్కూల్ ప్రిన్సిపల్ ఒకే రోజు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరిగే ఈ చిత్రం అక్టోబర్ 3న విడుదల అవుతుంది. సిల్లియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు.
ఎక్కడ చూడాలి: Netflix
ఇఫ్ (If)
ప్రతి ఒక్కరి కల్పిత స్నేహితులను చూడగలిగే శక్తి కలిగిన ఒక అమ్మాయి జర్నీని చూపించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ర్యాన్ రైనాల్డ్స్, జాన్ క్రసిన్స్కి, కైలీ ఫ్లెమింగ్ నటించారు. అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఎక్కడ చూడాలి: Netflix
ప్రైమ్ వీడియో (Prime Video)
మదరాసి (Madharaasi)
ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రెగోలి డిల్యూషన్తో బాధపడుతున్న వ్యక్తి తమిళనాడులో తుపాకులను సరఫరా చేసే సిండికేట్‌ను ఆపడానికి చేసే యత్నమే కథ. అక్టోబర్ 1 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఎక్కడ చూడాలి: Prime Video
ప్లే డర్టీ (Play Dirty)
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. బ్రిటిష్ కమాండోలు ఇటాలియన్ సైనికుల వేషంలో జర్మన్ ఆయిల్ డిపోను ధ్వంసం చేయడానికి చేసే ఆపరేషన్ చుట్టూ కథ తిరుగుతుంది. మైకేల్ కేన్, నైజెల్ డావెన్‌పోర్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడాలి: Prime Video
సన్ నెక్స్ట్ (Sun NXT)
సాహసం (Sahasam)
నరైన్, బాబు ఆంటోని, గౌరి జి కిషన్, రమ్జాన్ మహమ్మద్, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అనుకోని పరిణామాలు చోటుచేసుకున్న తర్వాత ఎదురయ్యే సవాళ్లను చూపిస్తుంది. అక్టోబర్ 1న డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ఎక్కడ చూడాలి: Sun NXT
ఈ వారం వినోదాల విందు
యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో కూడిన ఈ జాబితా అన్ని వయసుల ప్రేక్షకులకు వినోదాన్ని అందించబోతోంది. ముఖ్యంగా మురుగదాస్ తెరకెక్కించిన మదరాసి చిత్రం కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రద్దా శ్రీనాథ్ నటించిన ది గేమ్ వెబ్ సిరీస్ కూడా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండబోతోంది.