5 సెకండ్ల కోసం 5 కోట్లు ఖర్చు పెట్టిన దర్శకుడు, చివరకు ఏమయ్యిందంటే..?
సినిమాలలో చిన్న సీన్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు కొంత మంది దర్శకులు. సినిమా హిట్ అవ్వకపోయినా వారు చేసిన ప్రయోగాలు మాత్రం సక్సెస్ అవుతాయన్ననమ్మకం.. ఇంతకీ విషయం ఏంటంటే..?
Director Shankar
ఒకప్పుుడ రెండు మూడు కోట్లకు.. ఐదారు కోట్లకు సినిమాలు చేసేవారు. కాని రాను రాను భారీ బడ్జెట్ పెట్టందే సినిమాలు అవ్వడంలేదు. టాలీవుడ్ సినిమా రేంజ్ ఎంత వరకూ వెళ్తుందోఅందరికి తెలిసిందే. రాజమౌళి - మహేష్ బాబు సినిమా దాదాపు 1000 కోట్లకుపైనే అనిటాక్. ఈరేజ్ లో సిసిమా అంటే.. సినిమాలో దేనికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు అనేది కూడా ముఖ్యమే.
సాంగ్స్ కు ఇంత.. సీన్స్ కుఇంతా.. ఆ యాక్షన్ సీన్ కు అన్ని కోట్లు.. ఫలానా సీన్ కోసం వందల కోట్లు అంటూ.. చాలా డబ్బులు పెట్టేస్తున్నారు మేకర్స్. ఈక్రమంలో ఇలాంటి వాటికి భారీగా డబ్బులు ఖర్చుు చేసే దర్శకుడి గురించి తెలుసుకుందాం.
Also Read: గేమ్ ఛేంజర్ సాంగ్ లో రామ్ చరణ్ జాకెట్, కాస్ట్ ఎంతో తెలిస్తే.. కళ్ళుతిరగాల్సిందే..?
చిన్న సినిమాలు రెండు మూడు కోట్లతో తీసేవి కూడా చాలా ఉన్నాయి. ఆ సినిమాలు భారీ విజయాలు సాధించి రికార్డ్ లు సృష్టిస్తుంటాయి. కాని వేల కోట్లు పెట్టి తీసిన పెద్ద సినిమాలు డిజాస్టర్లుగా నిలిచినవి కూడా ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల కోసం వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఆసినిమాల్లో సెకండ్ల సీన్ కోసం కోట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిసినిమాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు భారతీయుడు 2 సినిమాను.
Also Read:రజినీకాంత్ - చిరంజీవి మధ్య పెద్ద గొడవ, అరుచుకున్న స్టార్ హీరోలు, అసలు విషయం చెప్పిన మెగాబ్రదర్..
Jeans Movie
శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కొన్ని సీన్లు.. సాంగ్స్ కోసమే కోట్లు పెడుతుంటారు. మరీ ముఖ్యంగా జీన్స్ సినిమాలో ఒక్క పాట కోసం 7 ప్రపంచ వింతలు ఒక్క పాటలో చూపించాడు శంకర్. ఇక కొన్నిసినిమాల్లో పాట కోసం వేసిన సెట్స్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతుంటాడు. ఇక రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు సినిమా కోసం 200 కోట్లు బడ్జెట్ అనుకున్నారు. కాని అది శంకర్ వల్ల 500 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది.
బడ్డెట్ విషయంలోకాంప్రమైజ్ అవ్వని శంకర్ .. భారతీయుడు 2 సినిమా కోసం కూడా ఇలాంటి కాస్ట్లీ సాహసమే చేశాడట. అదేంటంటే..? ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం ఏకంగా రూ.5 కోట్లకుపైగానే నిర్మాతతో ఖర్చు చేయించాడట శంకర్.
అయితే అదేం అర్ధగంట.. గంట సీన్ కాదు.. కనీసం ఐదు నిమిషాల సీన్ కూడా కాదు.. 5 సెకండ్ల సీన్ కోసం.. 5 కోట్లకు పైనే ఖర్చు పెట్టించాడట శంకర్. అది ఏ సీన్ అంటే...ఎస్.జే సూర్య ఉండే ఇల్లు సీన్. ఈసీన్ లో ఉండే ఇల్లు 5 సెకండ్ల లోపే కనిపిస్తుంది.
దీని కోసం ఈ ఇంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారట. ఇందు కోసం ఏకంగా 5 నుంచి 8 కోట్ల వరకూ ఖర్చు చేశారని టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
Director Shankar
మరి ఇంత ఖర్చు చేసి.. అంత తక్కువగా ఎందుకు చూపించారంటే.. భారతీయుడు సినిమాకు మరోసీక్వెల్ ఉంటుంది. భారతీయుడు3 గా రాబోతున్న ఆ సినిమాలో ఈ ఇంటికి సబంధించి పూర్తి సీన్స్ ఉంటాయి అని అంటున్నారు మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ ఇల్లు మాత్రం అన్నికోట్లు ఖర్చు పెట్టి.. కనీసం నిమిషాల వ్వవధిలో కూడా చూపించకపోవడం ఆశ్చర్యం కదా..? అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ మ్యాటర్ మాత్రం బాగా వైరల్ అవుతోంది.
Director Shankar
ఇక ఈ సినిమా చాలా ధారుణంగాప్లాప్ అయ్యింది. ఇంత కష్టపడి.. ఇన్ని కోట్లు పెట్టి తీసినందుకు మంచి రెస్పాన్స్ వచ్చిందా అంటే.. డిజాస్టర్ టాక్ తో నడిచింది. అంతే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌లకు వెళ్లిన ఆడియెన్స్… ఇంటర్వెల్‌లోనే బయటకు వచ్చేశారంటే శంకర్ ఎంత దారుణంగా సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు.
500 కోట్లు బడ్జెట్ పెట్టిన ఈసినిమాకు థియేట్రికల్ కలెక్షన్లతో పాటు.. అన్ని హక్కులు కలిపినా… నిర్మాతకు కేవలం రూ.150 కోట్లు మాత్రమే వచ్చాయట. ఈ లెక్కన నిర్మాతకు వందల కోట్లు నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.