కన్నీళ్లు ఆపుకోలేకపోయా... సెల్వరాఘవన్ జీవితంలో ఏం జరుగుతోంది?
Selvaraghavan: దర్శకుడు సెల్వరాఘవన్ తన భార్య నుంచి విడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపుతోంది.
14

Image Credit : instagram
Selvaraghavan Viral Video
దర్శకుడు సెల్వరాఘవన్, భార్య గీతాంజలి విడిపోయారని, మనస్పర్థల వల్లే ఆమె తన ఇన్‌స్టా నుంచి ఫోటోలు తీసేసిందని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.
24
Image Credit : Instagram
సెల్వరాఘవన్ ఏం మాట్లాడారు?
చాలా రోజులుగా చెప్పాలనుకున్నా. ఇది నాకు మాత్రమే కాదు, కోట్లాది మందికి జరిగింది. మన జీవితంలో ఏది ఎలా జరగాలో దేవుడు ముందే నిర్ణయిస్తాడు. సంతోషమైనా, విషాదమైనా ముందే రాసిపెట్టి ఉంటుంది.
34
Image Credit : Instagram
దేవుడు నిర్ణయించాడు
3 ఏళ్ల క్రితం నా జీవితంలో తట్టుకోలేని ఓ సంఘటన జరిగింది. కన్నీళ్లు ఆగలేదు. కానీ ఆ సంఘటన నన్ను బలవంతుడిని చేయడానికే అని తర్వాత తెలిసింది. అందుకే ఏది జరిగినా దేవుడి నిర్ణయమే.
44
Image Credit : instagram
గందరగోళంలో అభిమానులు
విడాకులు దేవుడి నిర్ణయమే అని సెల్వరాఘవన్ చెబుతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. 2011లో గీతాంజలిని పెళ్లాడారు. ఈమె రెండో భార్య. మొదటి భార్య సోనియా అగర్వాల్‌తో విడాకులు అయ్యాయి.
Latest Videos

