- Home
- Entertainment
- 'లైగర్' తెచ్చిన నష్టాలు కష్టాలు..అద్దె కట్టలేక ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరి..
'లైగర్' తెచ్చిన నష్టాలు కష్టాలు..అద్దె కట్టలేక ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరి..
పూరి జగన్నాధ్ లైగర్ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. లైగర్ కనుక హిట్ అయి ఉంటే పాన్ ఇండియా స్థాయిలో పూరి దశ తిరిగిపోయి ఉండేది. లైగర్ చిత్రాన్ని హిందీలో బడా నిర్మాత కరణ్ జోహార్ చేత రిలీజ్ చేయించారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా పరిస్థితి ఇంత ఘోరంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. సరైన కథ లేకుండా పైపై మెరుగులతో ఒక రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం.. తీరా థియేటర్స్ లో సినిమా విసుగు పుట్టించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
పూరి జగన్నాధ్ లైగర్ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. లైగర్ కనుక హిట్ అయి ఉంటే పాన్ ఇండియా స్థాయిలో పూరి దశ తిరిగిపోయి ఉండేది. లైగర్ చిత్రాన్ని హిందీలో బడా నిర్మాత కరణ్ జోహార్ చేత రిలీజ్ చేయించారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు.. లైగర్ పాన్ ఇండియా పక్కన పెడితే తెలుగులో కూడా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది.
అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే.. ముంబై పూరికి పర్మనెంట్ అడ్డాగా మారిపోయి ఉండేది. పూరి జగన్నాధ్ తన కలల ప్రాజెక్ట్ జనగణమన కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని భావించారు. దీనికోసం లైగర్ షూటింగ్ సమయంలోనే ముంబైలో విలాసవంతమైన సీ ఫేసింగ్ 4 బి హెచ్ కె ఫ్లాట్ రెంట్ కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫ్లాట్ రెంట్ నెలకి రూ 10 లక్షలు. నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే ఇంకాస్త ఎక్కువే. ఇప్పుడు లైగర్ మూవీ తీరని నష్టాలు మిగిల్చింది. త్వరలో బయ్యర్లతో పూరి సమావేశం అయి వారి నష్టాల విషయంలో హామీ ఇవ్వన్నట్లు.. వీలైనంత మేర భరించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెలకి ఋ 10 లక్షలు రెంట్ కట్టడం అసాధ్యంగా మారుతోంది అట.
దీనితో ముంబై ఫ్లాట్ ని పూరి జగన్నాధ్ వెకేట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనగణమన చిత్రం కూడా ఆగిపోయింది. మొత్తంగా పూరి జగన్నాధ్ కి లైగర్ మూవీ తెచ్చిన కష్ఠాలు అన్నీ ఇన్నీ కావు.
పూరి తదుపరి తన కొడుకు ఆకాష్ పూరితో ఓ కొరియన్ రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ మూవీ రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. పూరి మునుపటి ఫామ్ ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.