- Home
- Entertainment
- మహేష్ `పోకిరి`లాగే విజయ్ `బీస్ట్` సినిమా?.. సంచలన విషయాలు చెప్పిన దర్శకుడు.. ఫ్యాన్స్ ఫెస్టివల్‌కి రెడీ
మహేష్ `పోకిరి`లాగే విజయ్ `బీస్ట్` సినిమా?.. సంచలన విషయాలు చెప్పిన దర్శకుడు.. ఫ్యాన్స్ ఫెస్టివల్‌కి రెడీ
థళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ `బీస్ట్` మరో రెండు రోజుల్లో థియేటర్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీకి సంబంధించి దర్శకుడు నెల్సన్ అసలు విషయం బయటపెట్టారు. ఈ కథకి స్ఫూర్తి ఏంటో చెప్పేశాడు.

థళపతి నటిస్తున్న 65వ చిత్రం `బీస్ట్`. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ బుధవారం (ఏప్రిల్ 13) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో `బీస్ట్` ప్రెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు నెల్సన్, హీరోయిన్ పూజా హెగ్డే, తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ పాల్గొని సందడి చేశారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అవుతుందని, ఆయన కెరీర్‌లో మరో బెస్ట్ మూవీ అవుతుందని తెలిపారు.
మరోవైపు దర్శకుడు నెల్సన్ వరుసగా ప్రమోషన్‌లో పాల్గొంటూ ఇంటర్వ్యూలిస్తున్నారు. అంతేకాదు ఏకంగా విజయ్‌తోనూ ఇంటర్వ్యూ చేశారు. సన్ టీవీ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా, అది ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వెళ్లింది. బేసిక్‌గా విజయ్ తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడు, కేవలం ఈవెంట్లు తప్ప, మీడియా ముందుకు రారు. ఆయనకున్న ఫాలోయింగ్‌కి ఆయన రావాల్సిన అవసరం కూడా లేదు.
దీంతో సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల బాధ్యతలు దర్శకుడు నెల్సన్, హీరోయిన్ పూజా తీసుకున్నారు. అందులో భాగంగా దర్శకుడు నెల్సన్ `బీస్ట్` మూవీ గురించి, చిత్ర కథ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్ నటించిన `పోక్కిరి` చిత్రానికి ఆయన పెద్ద అభిమాని అట. ఆ సినిమా ప్రభావం తనపై ఉంటుందన్నారు.
అదే సమయంలో అసలు విషయం బయటపెట్టాడు. `బీస్ట్` స్టోరీకి ఇన్‌స్పిరేషన్ `పోక్కిరి` చిత్రమే అని వెల్లడించారు. అంతటితో ఆగలేదు, విజయ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. `పోక్కిరి` చిత్రం తరహాలో ఈ సినిమాలోనూ ఓ సీన్ ఉంటుందట. లెన్తీగా లేకపోయినా బాగానే ఉంటుందని, ఆ ట్విస్ట్ అదిరిపోతుందని చెబుతున్నారు దర్శకుడు నెల్సన్. అది ఫ్యాన్స్ కి సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందని తెలిపారు. అదే వర్కౌట్ అయితే బాక్సాఫీసు వద్ద రచ్చ రచ్చే అని నెల్సన్ పరోక్షంగా వెల్లడించారు.
మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన `పోకిరి` చిత్రం తెలుగులో ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. అప్పటి వరకు హైయ్యేస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా `పోకిరి` నిలిచింది. టాలీవుడ్‌కి కలెక్షన్ల టేస్ట్ ని చూపించిన చిత్రమిది. ఇందులో క్లైమాక్స్ కి ముందు వచ్చే ట్విస్ట్ సినిమాకి ప్రాణం. అదే సినిమాని నిలబెట్టింది. ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూసేలా చేసింది. దీన్ని తమిళంలో విజయ్ హీరోగా `పోక్కిరి` పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో ఇలియానా కథానాయికగా నటించగా, తమిళంలో ఆసిన్ నటించగా, ప్రభుదేవా దర్శకత్వం వహించారు. అక్కడ ఈ చిత్రం 200 డేస్ ఆడింది.