డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టపరిహారం ఇచ్చిన ‘జైలర్’ డైరక్టర్
తమిళనాట బాగా లాస్ లు తెచ్చిపెడుతోంది. దాంతో నెల్సన్ ... తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ కు లాస్ లు కాంపన్సేట్ చేస్తున్నారు.
Super Star Rajinikanth
‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్‌కుమార్ ఒక్కసారి దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ‘జైలర్’ విజయం తర్వాత ఆయన నిర్మాతగా మారి తమిళంలో ‘బ్లడీ బెగ్గర్’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేసారు. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో కవిన్ హీరోగా నటించాడు.
ఈ సినిమా తెలుగులో డబ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న స్దాయిలో రెస్పాన్స్ రాలేదు. అలాగే తమిళంలో కూడా ఈ చిత్రం ఎక్కువ రేట్లు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం తెచ్చిపెట్టింది. ఈ నేపధ్యంలో రజనీకాంత్ దారినే ఎంచుకున్నారు నెల్సన్.
bloody beggar
ఊహించని విధంగా హై ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైన బ్లడీ బెగ్గర్ ..భాక్సాఫీస్ దగ్గర అప్పటికే ఉన్న అమర్ నుంచి పోటీ తట్టుకోలేక చతికిల పడింది. దాంతో తమిళనాట బాగా లాస్ లు తెచ్చిపెడుతోంది. దాంతో నెల్సన్ ... తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ కు లాస్ లు కాంపన్సేట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ లో సినిమా నష్టపోియనా ప్రీ రిలీజ్ సేల్స్, శాటిలైట్ రైట్స్, ఓటిటి రైట్స్ తో సినిమా అయితే లాభాల్లోనే ఉన్నట్లు చెప్తున్నారు.
Bloody Beggar
వాస్తవానికి ‘బ్లడీ బెగ్గర్’లో కథ కొత్తగానే అనిపిస్తుంది. ఒక బిచ్చగాడు అనుకోకుండా ఇంద్రభవనం లాంటి ఇంట్లోకి దినం భోజనాలకు వెళ్లి అక్కడ ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడం అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. దర్శఖుడు నెల్సన్‌ను ఈ పాయింటే ఎగ్జైట్ చేసి సినిమా చేసి ఉంటాడు . కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు.ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. డార్క్ కామెడీ జానర్ నచ్చేవాళ్లకు మాత్రం ఎక్కుతుంది.
Bloody Beggar
బిచ్చగాడి పాత్రలో కనిపించిన కవిన్ అదరగొట్టేశాడని రివ్యూలు వచ్చాయి. ప్రారంభంలో పది నిమిషాల్లోనే బిచ్చగాడు పాత్ర రూపు మారిపోతుంది. మరికాసేపు బిచ్చగాడి సీన్స్ ఉండుంటే బాగుండు అనిపించేలా వాటిని డిజైన్ చేసారు. అంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. సినిమా అంతా బంగ్లాలోనే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి.
Bloody Beggar
ఇక బ్లడీ బెగ్గర్ కథ... ప్యాలెస్‌కి షిఫ్ట్ అయినప్పటి నుంచి నెమ్మదిగా కథలో ఉన్న ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అసలు ఆ బిల్డింగ్ ఎవరిది? అందులో ఉన్నవాళ్లంతా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
వాళ్లకి ఈ బిచ్చగాడికి సంబంధం ఏంటి? ఈ పోర్షన్లన్నీ బాగా డిజైన్ చేశారు. అయితే అనుకున్న స్దాయిలోనే ఫన్ పండలేదు. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ మీద నెల్సన్ ఇంపాక్ట్ ఉన్నట్లు కనిపిస్తుంది. నటుల క్లోజప్ షాట్లు అయితే నెల్సన్ తీసినట్లే ఉండి మెప్పిస్తాయి.