MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • The RajaSaab: అది ప్రభాస్ కాదు, డూప్ అంటూ ట్రోలింగ్.. మరోసారి మారుతికి రాజాసాబ్ సెగ

The RajaSaab: అది ప్రభాస్ కాదు, డూప్ అంటూ ట్రోలింగ్.. మరోసారి మారుతికి రాజాసాబ్ సెగ

ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఓటీటీలో విడుదలైన తర్వాత మరోసారి నెటిజన్లు డైరెక్టర్ మారుతిపై విమర్శలు చేస్తున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 08 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ది రాజాసాబ్ మూవీ
Image Credit : Youtube/People Media Factory

ది రాజాసాబ్ మూవీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. డైరెక్టర్ మారుతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలని గుర్తు పెట్టుకుని రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక నెటిజన్లు ఆడేసుకున్నారు. తన ఇంటి అడ్రెస్ ఇస్తాను అని, సినిమా బాగాలేకుంటే రావచ్చు అని మారుతి శపథం చేశారు. సినిమా రిలీజై డిజాస్టర్ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారుతిపై ట్రోలింగ్
Image Credit : T-Series Malayalam

మారుతిపై ట్రోలింగ్

దీనితో మారుతిని టార్గెట్ చేస్తూ ప్రభాస్ అభిమానులు పోస్ట్ లు పెట్టారు. రాజాసాబ్ రిలీజ్ అయ్యాక మారుతి ఒకసారి ప్రెస్ మీట్ లో కనిపించి మాయమైపోయారు. ట్రోలింగ్ ఇప్పుడిప్పుడే తగ్గుతోంది అనుకుంటున్న టైంలో మారుతిని మరోసారి నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం ది రాజాసాబ్ చిత్రం రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ కావడమే. 

Related Articles

Related image1
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు
Related image2
Sreeleela: బాలయ్య మూవీ తప్ప అన్నీ ఫ్లాపులే, శ్రీలీల జాతకం ఈ సినిమాతో తేలిపోతుందా ?
35
ఓటీటీలో రాజాసాబ్ స్ట్రీమింగ్ 
Image Credit : Asianet News

ఓటీటీలో రాజాసాబ్ స్ట్రీమింగ్ 

ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనితో నెటిజన్లు ఈ సారి స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మారుతిని తిడుతున్నారు. రాజాసాబ్ మూవీలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ రివ్యూలు ఇస్తున్నారు. 

45
అది ప్రభాస్ కాదు డూప్ అంటూ ట్రోలింగ్
Image Credit : Asianet News

అది ప్రభాస్ కాదు డూప్ అంటూ ట్రోలింగ్

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, ప్రభాస్ లుక్స్ దారుణంగా ఉన్నాయనేది నెటిజన్ల కంప్లైంట్. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ కి బదులు అతడి డూప్ ఉన్నాడు అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. మరికొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్ దారుణంగా ఉన్నాయి. అదే విధంగా కథలో మిస్సైన లాజిక్కులు, అర్థం పర్థం లేని సీన్లపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. 

55
నెటిజన్ల విమర్శలు
Image Credit : X

నెటిజన్ల విమర్శలు

హీరోలకు డూప్ లు ఉండడం, కొన్ని సన్నివేశాల్లో వారు నటించడం సహజమే. కానీ బాడీ డబుల్ అని ఆడియన్స్ కనిపెట్టేసేలా నాసిరకంగా సీన్లు ఉండకూడదు. రాజాసాబ్ లో అదే తప్పు జరిగింది. ఇలాంటి బేసిక్ విషయాలని కూడా మారుతి ఎలా మిస్ అయ్యారు అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
ప్రభాస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: రామాయణ్‌పై టాక్సిక్‌ డిజాస్టర్‌ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Recommended image2
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Related Stories
Recommended image1
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు
Recommended image2
Sreeleela: బాలయ్య మూవీ తప్ప అన్నీ ఫ్లాపులే, శ్రీలీల జాతకం ఈ సినిమాతో తేలిపోతుందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved