MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • డైరక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి,డేట్ ఫిక్స్, పెళ్లి కూతురు ఎవరంటే...

డైరక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి,డేట్ ఫిక్స్, పెళ్లి కూతురు ఎవరంటే...

త్వరలోనే హైదరాబాద్‌ కి చెందిన ఓ డాక్టర్ తో అతని వివాహం జరగనుందని సమాచారం. వచ్చేవారంలోనే నిశ్చితార్థం కూడా జరగనుందనే టాక్ వినిపిస్తోంది.

2 Min read
Author : Surya Prakash
Published : Nov 07 2024, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Director Krish ,Dr. Priti Challa, anushka

Director Krish ,Dr. Priti Challa, anushka


డైరక్టర్ క్రిష్ వ్యక్తిగత జీవితం మరో మలుపు తిరగబోతోంది. ఆయన మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు.  డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడీ 2016లో రమ్య అనే వైద్యురాలితో కలిసి పెళ్లిపీటలెక్కారు. అయితే ఐదేళ్లకే వీరి వివాహ బంధం బీటలు వారింది.

ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. దీని తర్వాత రమ్య యూఎస్‌లో మరో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి క్రిష్ మాత్రం సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే ఇప్పడు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఈ డైరెక్టర్ రెడీ అయ్యాడని తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Director Krish ,Dr. Priti Challa, anushka

Director Krish ,Dr. Priti Challa, anushka


గమ్యం సినిమాతో తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసుకుని  టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి. ఆ తర్వాత వేదం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుని ముందుకు వెళ్లారు. ఆ తర్వాత దగ్గుబాటి రానాతో  కృష్ణం వందే జగద్గురుమ్, వరుణ్ తేజ్ తో కంచె, బాలయ్యతో  గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి  సినిమాలు చేసారు. ఈ సినిమాలు దేనికవే ప్రత్యేకం. 
 

36
Director Krish ,Dr. Priti Challa, anushka

Director Krish ,Dr. Priti Challa, anushka


అయితే ఈ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంలో వివాహం విషయంలో దెబ్బతిన్నారు. . క్రిష్ కొన్ని సంవత్సరాల ముందు రమ్య అనే వైద్యురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం వైభవంగా జరగడంతో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు.

కానీ విభేదాల కారణంగా కొన్నాళ్లకే క్రిష్‌, రమ్య విడిపోయారు. రమ్య యూఎస్‌లో మరో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయినట్లు తెలుస్తోంది. కానీ క్రిష్ మాత్రం ఒంటరిగానే ఉన్నారు. ఇప్పుడు మరో వివాహం చేసుకోబోతున్నారు. త్వరలోనే హైదరాబాద్‌ కి చెందిన ఓ డాక్టర్ తో అతని వివాహం జరగనుందని సమాచారం. వచ్చేవారంలోనే నిశ్చితార్థం కూడా జరగనుందనే టాక్ వినిపిస్తోంది.

46


డాక్టర్ ప్రీతి చల్లా హైదరాబాద్ లో పేరున్న గైనకాలజిస్ట్. ఆమెతో క్రిష్ కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. వీళ్లిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 16 న హైదరాబాద్ లో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. క్రిష్ మొదటి బార్య కూడా  ఓ డాక్టర్..అలాగే ఇప్పుడు వివాహం చేసుకోబోతున్న ఆమె కూడా డాక్టర్ కావటం విశేషం.
 

56
Tejas and Malvika baby

Tejas and Malvika baby


 కెరీర్ విషయానికి వస్తే క్రిష్ ...గబ్బర్ ఈజ్ బ్యాక్ (ఠాగూర్ రీమేక్) సినిమాతో హిందీలోనూ సత్తా చాటాడు. అయితే ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాలు వర్కవుట్ కాలేదు. మణికర్ణిక సినిమా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అయితే వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ తెరకెక్కించిన కొండ పొలం సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కమర్షియల్ గా ఆడలేదు. 

66
bindu krishna

bindu krishna


ఆ తర్వాత  పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాను కూడా ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి కూడా మధ్యలోనే తప్పుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం స్వీటీ అనుష్కా శెట్టితో కలిసి ఘాటీ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.  షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved