- Home
- Entertainment
- 'ఉస్తాద్ భగత్ సింగ్' కి ప్రభాస్ డైరెక్టర్ సాయం..పవన్ మూవీ రీమేకా కాదా ? క్లారిటీ ఇదిగో
'ఉస్తాద్ భగత్ సింగ్' కి ప్రభాస్ డైరెక్టర్ సాయం..పవన్ మూవీ రీమేకా కాదా ? క్లారిటీ ఇదిగో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో రెండవసారి తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో రెండవసారి తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ అంచనాలు పూర్తిగా తెలిసిన దర్శకుడు హరీష్.
దీనితో హరీష్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే చిత్రాన్నే తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంపై అభిమానుల్లో కొంత అనుమానులు కూడా ఉన్నాయి. మొదటి నుంచి ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ తేరికి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. లేదు ఇది రీమేక్ కాదు.. అంతకుముందు హరీష్ రాసుకున్న భవదీయుడు భగత్ సింగ్ కథని తేరితో మిక్స్ చేసి తెరకెక్కిస్తున్నారు అని అంటున్నారు.
పూర్తి క్లారిటీ అయితే రావడం లేదు. తాజాగా దీనిపై ప్రభాస్ డైరెక్టర్ దశరథ్ క్లారిటీ ఇచ్చారు. అదేంటి.. పవన్ సినిమా గురించి ప్రభాస్ డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా ? డైరెక్టర్ దశరథ్ సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ హిట్స్ తో పాపులర్ అయ్యారు. ఆయన రచయిత కూడా. చాలా చిత్రాలకు రచయితగా పనిచేశారు.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ విషయంలో కూడా దశరధ్ హరీష్ శంకర్ కి సాయం అందించారు. ఉస్తాద్ కథలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంది. ఆయన జూన్ 30న రిలీజ్ కాబోతున్న లవ్ యు రామ్ అనే చిన్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఓపెన్ అయ్యారు. ఉస్తాద్ చిత్రం రీమేక్ మూవీనా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. డైరెక్టర్ హరీష్ శంకర్ తేరి చిత్రంలో కేవలం 10 శాతం లైన్ మాత్రమే తీసుకున్నారు. మిగిలిన 90 శాతం కథ హరీష్ శంకర్ గారు రాసుకున్నదే అని దశరథ్ అన్నారు. ఉస్తాద్ లో తేరి మూవీ పాయింట్ మాత్రమే ఉంటుంది కానీ కథ మొత్తం వేరు అని దశరథ్ చెప్పడం తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ రీమేక్ చేయడం ఫ్యాన్స్ కి కూడా ఇష్టం లేదు. ఆ మధ్యన హరీష్ ని ట్రోల్ కూడా చేశారు. దశరథ్ ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ కూల్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.