బస్సు డ్రైవర్‌తో శర్వా డైరక్టర్ గొడవ, వైరల్ గా వీడియో
బస్సు ముందు ఆపి ఎందుకు ఎక్కువ శబ్దం వచ్చే ఎయిర్‌హారన్ ఉపయోగిస్తున్నావంటూ డ్రైవర్‌ను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం
actor cheran
తమిళంలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న దర్శకుడు చేరన్. ఆయన సినిమాలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఆయన చేసిన కొన్ని సినిమాలు తమిళంలో రీమేక్ అయ్యాయి.రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ కూడా తమిళంలో చేరన్ చేసిందే.
అలాగే ఆయన శర్వానంద్ తో అప్పట్లో రాజాధిరాజా అనే సినిమా కూడా చేసారు. ఆ సినిమా తమిళంలో బాగుందనిపించుకున్నా తెలుగులో ఆడలేదు. సినిమా విషయాలు ప్రక్కన పెడితే ఆయన ఓ బస్సు డ్రైవర్ తో గొడవపడటం హాట్ టాపిక్ గా మారింది.
cheran
మామూలుగానే తమిళనాడులో ప్రైవేటు బస్సు డ్రైవర్ల దందా ఎక్కకువగా ఉంటుంది. బస్సును తీసుకొని రోడ్డు మీదకు వచ్చినంతనే.. ఇష్టారాజ్యంగా ఎయిర్ హారన్లు మోగిస్తూ దూసుకెళుతుంటారు. వీరి తీరుతో అదే రోడ్లపై వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా పుదుచ్చేరి నుంచి కడలూర్ కు బయలుదేరిన ప్రైవేటు బస్సు ముందుగా వెళుతున్న ప్రముఖ నటుడు కం దర్శకుడి కారును ఓవర్ టేక్ చేయటం వివాదంగా మారింది.
దాంతో ప్రైవేటు బస్సు డ్రైవర్‌తో సినీ దర్శకుడు చేరన్ వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కడలూర్-పుదుచ్చేరి మధ్య నిత్యం సుమారు 150కి పైగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. డ్రైవర్లు పోటీపోటీగా పడుతూ ఎయిర్‌హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మంగళవారం ఉదయం 11.30 సమయంలో పుదుచ్చేరి నుంచి కడలూర్‌కు బయల్దేరిన ప్రైవేటు బస్సు ముందుగా వెళుతున్న ప్రముఖ నటుడు, దర్శకుడు చేరన్ కారును ఓవర్‌టేక్ చేస్తూ ఎయిర్ హారన్ మోగించాడు.
దాంతో కోపం తెచ్చకున్న చేరన్ కారును బస్సు ముందు ఆపి ఎందుకు ఎక్కువ శబ్దం వచ్చే ఎయిర్‌హారన్ ఉపయోగిస్తున్నావంటూ డ్రైవర్‌ను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కండక్టర్ ఇద్దరినీ సమాధానపరిచాడు. క్రమశిక్షణ, ప్రయాణీకులకు భద్రతలేకుండా ప్రైవేటు బస్సులను నడిపే డ్రైవర్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.