- Home
- Entertainment
- రంగు తక్కువని రిజెక్ట్ చేశారు.. అవమానాలు దాటుకుంటూ వచ్చా, ఖిలాడీ బ్యూటీ హాట్ కామెంట్స్
రంగు తక్కువని రిజెక్ట్ చేశారు.. అవమానాలు దాటుకుంటూ వచ్చా, ఖిలాడీ బ్యూటీ హాట్ కామెంట్స్
యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది.

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం డింపుల్ హయతి మాస్ మహారాజ్ రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై డింపుల్ హయతి బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది.
తాజగా ఓ ఇంటర్వ్యూలో డింపుల్ హయతి తన టాలీవుడ్ జర్నీ గురించి హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయిలు హద్దులు పెట్టుకుంటారు అని, ఇంతవరకే చేయగలరు అనే అపవాదు ఉంది. దానిని చెరిపివేయడానికే నేను వచ్చా. అందుకే ఎప్పుడూ ట్రెండీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు డింపుల్ పేర్కొంది.
గద్దలకొండ గణేష్ చిత్రంలో సూపర్ హిట్టు స్పెషల్ సాంగ్ చేశాక అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. వాటన్నింటినీ వదులుకున్నా. సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ఖిలాడీ మూవీలో ఆఫర్ వచ్చింది. ఈ మూవీలో గ్లామర్ గా, ట్రెండీగా అలరిస్తాను అని డింపుల్ చెబుతోంది.
ఇటీవల విడుదలైన ఫుల్ కిక్కు సాంగ్ లో డింపుల్ మాస్ స్టెప్పులతో మోతెక్కిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై అమ్మడి హంగామా ఒక రేంజ్ లో ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. పైగా డింపుల్ ప్రొఫెషనల్ డాన్సర్. ఇక తాను కూడా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు దాటుకుంటూ వచ్చానని పేర్కొంది.
నేను కొంచెం రంగు తక్కువగా ఉన్నానని చాలా చిత్రాల్లో రిజెక్ట్ చేశారు. ఒకప్పుడు రంగు , అందానికి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతిభ చూసి కూడా అవకాశాలు ఇచ్చేవారు ఉన్నారు అని డింపుల్ పేర్కొంది.