MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్, 195 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం.. ప్రభాస్, బన్నీ కూడా అతడి ముందు దిగదుడుపే

ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్, 195 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం.. ప్రభాస్, బన్నీ కూడా అతడి ముందు దిగదుడుపే

ప్రముఖ బుల్లితెర యాంకర్, కమెడియన్ తన వందల కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్లకి ధీటుగా అతడి రెమ్యునరేషన్ ఉంటోంది. 

3 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2025, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాన్ ఇండియా స్టార్ల రెమ్యునరేషన్
Image Credit : Instagram

పాన్ ఇండియా స్టార్ల రెమ్యునరేషన్

ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లు వందల కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలని మించేలా వీరి రెమ్యునరేషన్ ఉంటోంది. ప్రభాస్ ఒక్కో చిత్రానికి 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 300 కోట్లు అని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, అల్లు అర్జున్, షారుఖ్ లాంటి పాన్ ఇండియా స్టార్ లకు షాక్ ఇచ్చే విధంగా ఒక బుల్లితెర యాంకర్, కమెడియన్ రెమ్యునరేషన్ సంచలనం సృష్టిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3
Image Credit : Instagram

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3

ప్రముఖ బుల్లితెర యాంకర్, హాస్యనటుడు అయిన కపిల్ శర్మ నెట్‌ఫ్లిక్స్ వేదికగా నిర్వహిస్తున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడవ సీజన్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 21, 2025న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా వచ్చారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు తాజా ఎపిసోడ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. 

ఈ షోకు సంబంధించి కపిల్ శర్మ రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, కపిల్ శర్మ తొలి సీజన్ నుంచే ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. 2024 మార్చి 30 నుండి జూన్ 22 వరకు ప్రసారమైన తొలి సీజన్‌లో మొత్తం 13 ఎపిసోడ్‌లుఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్లు చొప్పున కపిల్ రెమ్యునరేషన్ మొత్తం రూ.65 కోట్లు అయ్యింది.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్న స్టార్ హీరో, తెలుగు సినిమాపై మరోసారి ప్రేమ
Related image2
రియల్ లైఫ్ లో నటించకూడదు.. చిరంజీవిలో నాకు నచ్చేది అదే, కాస్ట్లీ గిఫ్ట్ పై కృష్ణం రాజు కామెంట్స్
35
మూడు సీజన్లకు 195 కోట్ల రెమ్యునరేషన్
Image Credit : Instagram

మూడు సీజన్లకు 195 కోట్ల రెమ్యునరేషన్

అదే విధంగా, రెండవ సీజన్ కూడా 13 ఎపిసోడ్‌లతో 2024 సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 14 వరకుప్రసారమైంది. సెకండ్ సీజన్ కి కూడా కపిల్ శర్మ అదే రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇది కూడా మరో రూ.65 కోట్లను తీసుకువచ్చింది.

ప్రస్తుతం నడుస్తున్న మూడవ సీజన్‌కు కూడా అదే పారితోషికం చెల్లిస్తున్నారని నివేదికలు తెలిపాయి. మొత్తం 13 ఎపిసోడ్‌లు ప్రసారమయ్యే అవకాశముండటంతో కపిల్ మరో రూ.65 కోట్లు సంపాదించనున్నారు. ఇలా మూడు సీజన్ల కలిపి కపిల్ శర్మకు ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.195 కోట్లు.

45
పాన్ ఇండియా స్టార్లని మించేలా సంపాదన
Image Credit : Instagram

పాన్ ఇండియా స్టార్లని మించేలా సంపాదన

ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో తొలి సీజన్  2024 మార్చిలో ప్రారంభమైంది. అంటే కేవలం 16 నెలల వ్యవధిలో కపిల్ శర్మ ఏకంగా 195 కోట్లు సంపాదించారు. ఇది ఆషామాషీ విషయం కాదు. ఉదాహరణకి పాన్ ఇండియా హీరో ఎవరైనా ఒక భారీ బడ్జెట్ చిత్రం చేస్తే మినిమమ్ 2 ఏళ్ళ టైం పడుతుంది. రెండేళ్ల కష్టానికి గాను వారికి 200 కోట్ల వరకు పారితోషికం దక్కుతుంది. కానీ కపిల్ శర్మ 16 నెలల్లో మూడు సీజన్లు కలిపి 39 ఎపిసోడ్స్ కి గాను 195 కోట్లు అందుకుంటున్నారు. దీని ప్రకారం కపిల్ శర్మ ఆదాయం పాన్ ఇండియా స్టార్లని మించేలా ఉందని చెప్పడంలో సందేహం లేదు. 

ఈ షోలో కపిల్‌తో పాటు మరో ప్రముఖులు కూడా ఉన్నారు. అర్చన పూరన్ సింగ్ ఒక్క ఎపిసోడ్‌కు రూ.10 నుండి 12 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ ఒక్క ఎపిసోడ్‌కు రూ.25 లక్షలు, కికూ శార్దా రూ.7 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం.

55
కపిల్ శర్మ తొలి రెమ్యునరేషన్ రూ.500
Image Credit : Instagram

కపిల్ శర్మ తొలి రెమ్యునరేషన్ రూ.500

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారమవుతున్న ఈ హాస్య కార్యక్రమం కేవలం వినోదం మాత్రమే కాకుండా, భారీ మొత్తంలో పారితోషికాలు అందిస్తున్న ప్రాజెక్ట్‌గా నిలిచిందని తెలుస్తోంది. కపిల్ శర్మ 2007 నుండి బుల్లితెరపై కామెడీ షోలతో తనదైన ముద్ర వేస్తున్నారు. 

కపిల్ శర్మ ఎన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారు. కమెడియన్ కాకముందు ఓ టెలిఫోన్ బూత్ లో పనిచేసేవారట. అక్కడ కపిల్ తొలి సంపాదన రూ.500 మాత్రమే. కానీ ఇప్పుడు వందల కోట్లు అందుకునే స్థాయికి ఎదిగారు. కపిల్ తండ్రి జీతేంద్ర కుమార్ శర్మ పంజాబ్ పోలీస్ లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన క్యాన్సర్ కారణంగా 2004లో మృతి చెందారు.కపిల్ శర్మ 2015 నుండి 2019 వరకు ఫోర్బ్స్ ప్రకటించిన టాప్ 100 ఇండియన్ సెలెబ్రిటీస్ లిస్ట్‌లోస్థానం దక్కించుకున్నారు. తండ్రి అనారోగ్యం కారణంగా కుటుంబ బాధ్యతలు భుజాలపై తీసుకున్న కపిల్, తన బాచిలర్స్ డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. తరువాత డిగ్రీ పూర్తిచేసే అవకాశం రాలేదు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ప్రభాస్
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్న స్టార్ హీరో, తెలుగు సినిమాపై మరోసారి ప్రేమ
Recommended image2
రియల్ లైఫ్ లో నటించకూడదు.. చిరంజీవిలో నాకు నచ్చేది అదే, కాస్ట్లీ గిఫ్ట్ పై కృష్ణం రాజు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved