MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి నో చెప్పారు, కానీ శంకర్ దగ్గర బుక్కైపోయిన దిల్ రాజు.. పూరి జగన్నాధ్, శ్రీనువైట్లతో జస్ట్ మిస్

రాజమౌళి నో చెప్పారు, కానీ శంకర్ దగ్గర బుక్కైపోయిన దిల్ రాజు.. పూరి జగన్నాధ్, శ్రీనువైట్లతో జస్ట్ మిస్

దిల్ రాజు తన కెరీర్ లో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసింది చాలా తక్కువ. దిల్ రాజు ఎక్కువగా కొత్త దర్శకులని పరిచయం చేస్తుంటారు. పక్కాగా కథ రాయించుకోవడం, కొత్త దర్శకుడిని ఎంచుకుని హిట్ల మీద హిట్లు కొట్టడం దిల్ రాజు సక్సెస్ ఫార్ములా.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 13 2025, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దిల్ రాజు తన కెరీర్ లో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసింది చాలా తక్కువ. దిల్ రాజు ఎక్కువగా కొత్త దర్శకులని పరిచయం చేస్తుంటారు. పక్కాగా కథ రాయించుకోవడం, కొత్త దర్శకుడిని ఎంచుకుని హిట్ల మీద హిట్లు కొట్టడం దిల్ రాజు సక్సెస్ ఫార్ములా. దిల్ రాజు తన కెరీర్ లో సుకుమార్, బోయపాటి, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్ లాంటి క్రేజీ దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 

25

దిల్ రాజు పరిచయం చేసినప్పుడు వాళ్లంతా స్టార్ డైరెక్టర్లు కాదు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే విధానానికి దిల్ రాజు వ్యతిరేకమా అంటే.. అదీ కాదు. ఆయనకి కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయాలని ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

35

గతంలో పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని దిల్ రాజు చాలా ప్రయత్నించారట. కానీ కుదర్లేదు. శ్రీను వైట్లతో సినిమా చేయాలని ఆనందం మూవీ తర్వాతే ట్రై చేశారట. ఆయనతో కూడా ప్రాజెక్ట్ మెటీరియల్ కాలేదు. ఆర్య తర్వాత సుకుమార్ తో మరో సినిమా చేయడానికి చర్చలు జరిగాయి. సుకుమార్ జగడం కథ వినిపించారు. ఆ కథ నచ్చక దిల్ రాజు చేయలేదు. సుకుమార్ తో సినిమా కుదర్లేదు కాబట్టి ఆ టైం లో దిల్ రాజు.. రాజమౌళితో మూవీ చేయడానికి ప్రయత్నించారట. 

45

రాజమౌళిని వెళ్లి అడగగా ఒక మాట అన్నారట.. మీలాంటి నిర్మాత నాతో సినిమా చేస్తే అది మరొక చిత్రం మాత్రమే అవుతుంది. అదే కొత్త దర్శకుడితో చేస్తే ఇండస్ట్రీలో మరొకరికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు అని చెప్పారు. రాజమౌళి మాటలకు దిల్ రాజు ఫిదా అయ్యారట. ఏది ఏమైనా జక్కన్నతో దిల్ రాజు కాంబినేషన్ సెట్ కాలేదు. 

55

కానీ దిల్ రాజు.. శంకర్ దగ్గర మాత్రం బుక్కయ్యారు. అంత పెద్ద దర్శకుడితో దిల్ రాజు చేసిన గేమ్ ఛేంజర్ చిత్రం ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసినప్పటికీ అది మూడేళ్ళ పాటు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదలైంది. కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
Latest Videos
Recommended Stories
Recommended image1
Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..
Recommended image2
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Recommended image3
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved