- Home
- Entertainment
- అల్లు అర్జున్ అంతటి స్టార్ అయ్యే ఛాన్స్ ఉండి ఫెయిల్ అయిన హీరో ఎవరు..అతడి ముఖం మీదే చెప్పిన దిల్ రాజు
అల్లు అర్జున్ అంతటి స్టార్ అయ్యే ఛాన్స్ ఉండి ఫెయిల్ అయిన హీరో ఎవరు..అతడి ముఖం మీదే చెప్పిన దిల్ రాజు
అల్లు అర్జున్ తరహాలో వరుస హిట్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఒక హీరో స్టార్ కావడంలో విఫలమయ్యారు. ఆ హీరోని అల్లు అర్జున్ తో పోల్చుతూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి
- FB
- TW
- Linkdin
Follow Us

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఆర్య, బన్నీ లాంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోగా అవతరించారు. పుష్ప 2 మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
అల్లు అర్జున్ లాగా స్టార్ అయ్యే ఛాన్స్
అల్లు అర్జున్ తరహాలో వరుస హిట్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఒక హీరో స్టార్ కావడంలో విఫలమయ్యారు. ఆ హీరోని అల్లు అర్జున్ తో పోల్చుతూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నితిన్. దిల్ రాజు,నితిన్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా రూపొందిన చిత్రం తమ్ముడు. ఈ మూవీ జూలై 4న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.
దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నితిన్ స్వయంగా దిల్ రాజుని ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇంటర్వ్యూలో నితిన్ దిల్ రాజు కి ఒక ఆసక్తికర ప్రశ్న సంధించారు. నితిన్ మాట్లాడుతూ.. అంకుల్(దిల్ రాజు) మీరు దిల్ మూవీ నుంచి ఇప్పటి వరకు నాలో గమనించిన పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి అని ప్రశ్నించారు.
వాళ్ళిద్దరిని స్టార్లుగా ఊహించుకున్న దిల్ రాజు
దిల్ రాజు బదులిస్తూ.. నీవు నాకంటే ఒక ఏడాది సీనియర్ వి. నువ్వు జయం చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చావ్. నేను ఆ తర్వాత సంవత్సరం దిల్ సినిమాతో నిర్మాతగా మారాను. ఈ 23 ఏళ్ల కెరీర్ లో మంచి అనుభవం సంపాదించావు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ నీకు వచ్చింది అని దిల్ రాజు తెలిపారు. నెగిటివ్ అంశాల విషయానికొస్తే.. దిల్ మూవీ చేస్తున్నప్పుడు నిన్ను, ఆర్య మూవీ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ను.. మీ ఇద్దరినీ నేను టాలీవుడ్ ఫ్యూచర్ స్టార్లుగా ఊహించుకున్నాను.
నితిన్ ముఖం మీదే చెప్పేసిన దిల్ రాజు
అల్లు అర్జున్ విషయంలో నా ఊహ నిజమైంది. కానీ నువ్వు స్టార్ డమ్ సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యావు అంటూ దిల్ రాజు నితిన్ మొఖం మీద చెప్పేశారు. జయం, దిల్ చిత్రాల తర్వాత నితిన్ కి ఒక రేంజ్ లో అవకాశాలు వచ్చాయి. రాజమౌళి, రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్లతో పని చేసినప్పటికీ నితిన్ స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయారు. స్టార్ స్టేటస్ కి నితిన్ అడుగు దూరంలో నిలిచిపోయారు.కథల ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల నితిన్ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఒక దశలో నితిన్ కి పదేళ్ళపాటు హిట్స్ లేవు. ఇష్క్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు.
తమ్ముడు మూవీతో కంబ్యాక్ ఇస్తాడా ?
జూలై 4న రిలీజ్ అవుతున్న తమ్ముడు చిత్రం నితిన్ కెరీర్ కి చాలా కీలకం. నితిన్ చివరగా నటించిన ఎక్స్ట్రా, రాబిన్ హుడ్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో నితిన్ తమ్ముడు చిత్రంతో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి లయ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది.