- Home
- Entertainment
- రామ్ చరణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. `గేమ్ ఛేంజర్` లోటుని భర్తీ చేసే ప్రాజెక్ట్, డైరెక్టర్ ఎవరు?
రామ్ చరణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. `గేమ్ ఛేంజర్` లోటుని భర్తీ చేసే ప్రాజెక్ట్, డైరెక్టర్ ఎవరు?
రామ్ చరణ్‌తో ఈ సంక్రాంతికి `గేమ్ ఛేంజర్` మూవీని నిర్మించిన దిల్‌రాజు భారీ డిజాస్టర్‌ని చవిచూశాడు. అయితే ఇప్పుడు చరణ్‌తో మరో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించి షాకిచ్చాడు.
- FB
- TW
- Linkdin
Follow Us

రామ్ చరణ్‌తో దిల్ రాజు మరో మూవీ
స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్ రాజు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. మరోసారి ఆయన రామ్ చరణ్‌తో మూవీ చేయబోతున్నట్టు తెలిపారు. చరణ్‌తో ఆయన `గేమ్ ఛేంజర్` మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు వంద కోట్లకుపైగా నష్టాలను తీసుకొచ్చిందని టాక్.
`గేమ్ చేంజర్` విషయంలో తప్పు మాదే
ఈ నేపథ్యంలో `గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్‌పై ఇప్పటికే స్పందించారు దిల్ రాజు. ఆ మూవీ విషయంలో తప్పు తనదే అని వెల్లడించారు. మూవీ చేయి దాటి పోతుందని తెలిసీ కూడా ఏం చేయలేకపోయామని తెలిపారు.
పెద్ద డైరెక్టర్ కావడంతో ఇన్‌వాల్వ్ కాలేకపోయామని, ఓ దశలో ఇక వదిలేసుకున్నామని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపై ఇలాంటి మూవీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్‌తో మూవీ చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు.
నితిన్ `తమ్ముడు` మూవీ ట్రైలర్ ఈవెంట్
దిల్‌రాజు.. నితిన్ హీరోగా `తమ్ముడు` చిత్రాన్ని నిర్మించారు. తమ్ముడు శిరీష్‌తో కలిసి దీన్ని తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ మూవీ జులై 4న విడుదల కానుంది. ఈ మూవీతో ఒకప్పటి హీరోయిన్ లయ రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో ఆమె నితిన్‌కి అక్కగా నటిస్తున్నారు. కన్నడ నటి సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించారు.
ఇందులో దిల్ రాజు మాట్లాడుతూ, `తమ్ముడు` సినిమాతో హిట్ కొట్టబోతున్నట్టు తెలిపారు. నితిన్ గత నాలుగైదు సినిమాలు ఆడలేదు, దీంతో కొంత లో లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మూవీతో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారని, సినిమా చూసుకున్నామని, కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని తెలిపారు.
`గేమ్ ఛేంజర్` విషయంలో దిల్ రాజు అసంతృప్తి
ఈ సందర్భంగా దిల్ రాజు.. రామ్ చరణ్‌తో సినిమాని ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతికి `గేమ్ ఛేంజర్`, `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాం. `సంక్రాంతికి వస్తున్నాం`తో పెద్ద హిట్ కొట్టాం.
కానీ `గేమ్ ఛేంజర్`తో రామ్ చరణ్‌కి హిట్ ఇవ్వలేకపోయాం. రామ్ చరణ్‌తో సూపర్ హిట్ తీయలేకపోయామనే చిన్న గిల్ట్ ఉంది. రామ్ చరణ్‌తో ఒక సూపర్ హిట్ మూవీ తీయడానికి ప్లాన్ జరుగుతుంది. తొందర్లోనే దీన్ని ప్రకటిస్తాం` అని తెలిపారు దిల్ రాజు.
రామ్ చరణ్ నెక్ట్స్ మూవీకి దర్శకుడెవరు?
దీంతో రామ్ చరణ్‌తో దిల్ రాజు తీయబోయే సినిమా ఏంటి? దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వేణు శ్రీరామ్ వద్ద `ఐకాన్` అనే కథ ఉంది. దాన్ని చరణ్‌తో తీయబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీని బన్నీతో తీయాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు చరణ్ వద్దకు అదే స్క్రిప్ట్ తో వెళ్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. దీంతోపాటు ప్రశాంత్ నీల్‌తో మూవీ అని మరో టాక్ వినిపిస్తుంది.
మరి దిల్ రాజు .. రామ్ చరణ్‌తో ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై మున్ముందు క్లారిటీ రావాల్సి ఉంది.