మా మధ్య ఆ చనువుంది, దాన్ని రచ్చ చేయకండి.. నితిన్‌పై కామెంట్లకి నిర్మాత వివరణ
నితిన్ ని అల్లు అర్జున్‌తో పోల్చుతూ నిర్మాత దిల్ రాజు తక్కువ చేసిన మాట్లాడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.
- FB
- TW
- Linkdin
Follow Us

నితిన్‌పై చేసిన వ్యాఖ్యలకు దిల్ రాజు క్లారిటీ
నితిన్ హీరోగా కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటిపోయింది. సుమారు 23ఏళ్లు అయ్యిందని ఇటీవలే నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే నితిన్ కెరీర్‌లో సక్సెస్‌ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ. మూడు నాలుగు పరాజయాలు పడితే ఒక్క హిట్ వస్తోంది.
దీంతో ఇంకా హీరోగా నిలబడేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన తర్వాత వచ్చిన వాళ్లు స్టార్స్ గా రాణిస్తున్న నేపథ్యంలో నితిన్ ని ఉద్దేశించి దిల్ రాజు కామెంట్ చేశారు. తాజాగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
జులై 4న విడుదల కాబోతున్న `తమ్ముడు` మూవీ
నితిన్ హీరోగా `తమ్ముడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఇందులో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం(జులై 4న) విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నితిన్, దిల్ రాజు మధ్య చిట్ చాట్ జరిగింది. నితిన్ యాంకర్‌గా మారగా, దిల్ రాజు గెస్ట్ గా వ్యవహరించారు. ఇందులో తాను మిస్ అయిన ఎలిమెంట్ ఏంటి అని ప్రశ్నించాడు నితిన్.
దీనికి దిల్ రాజు స్పందిస్తూ, అల్లు అర్జున్, నిన్ను ప్రారంభంలో చూశాను. ఆర్యతో బన్నీని, దిల్‌తో నిన్ను చూశాను, మీరిద్దరు ఫ్యూచర్ స్టార్స్ అని భావించాను.
అల్లు అర్జున్ ఆ స్థాయికి చేరుకున్నారు, కానీ నువ్వు రీచ్ కాలేకపోయావు, ఈ మూవీతో హిట్ కొడతావని, `ఎల్లమ్మ`తో రీచ్ అవుతావని తెలిపారు దిల్ రాజు.
నితిన్ ని తక్కువ చేసి మాట్లాడటంపై దిల్ రాజు వివరణ ఇదే
ఇందులో నితిన్‌ని తక్కువ చేసి మాట్లాడటం పట్ల వివాదం రాజుకుంది. ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. పెద్ద రచ్చ చేస్తున్నారు. తాజాగా దీనికి వివరణ ఇచ్చాడు దిల్ రాజు.
`నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్ కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్ గా చెప్పాను.
మా మధ్య ఉన్న రిలేషన్ తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్ గా చూడొద్దు` అని తెలిపారు దిల్ రాజు. తాను ఏమాట్లాడినా వివాదం చేస్తున్నారని, యాడిట్యూడ్ అంటున్నారని, తాను మంచే కోరుకుంటున్నట్టు తెలిపారు దిల్ రాజు.
సినిమాల పైరసీపై దిల్ రాజు కామెంట్
ఇక పైరసీ గురించి ఆయన స్పందిస్తూ, పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్స్ లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు.
పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం. పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్ తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే.
ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్ కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్ కే. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాయాలి` అని వెల్లడించారు దిల్ రాజు.
`తమ్ముడు`కి ఏ సర్టిఫికేట్‌పై క్లారిటీ
`తమ్ముడు` సినిమా గురించి చెబుతూ, మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్ గా ఉన్నాయని ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు.
ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యు బై ఎ ఇస్తామని చెప్పారు. ఈ సినిమాను థియేటర్ ఎక్సిపీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్ కు అంగీకరించాం.
ఇది `సంక్రాంతికి వస్తున్నాం` లాంటి ఎంటర్ టైనర్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ రండి అని చెబుతాం. `తమ్ముడు` మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న మూవీ. థియేటర్స్ కు వచ్చిన వాళ్లనైనా సంతృప్తి పరచాలి కదా అని ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం.
ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80 శాతం మూవీ అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్ లో ఎంజాయ్ చేసేలా రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ వేణు. `తమ్ముడు` సినిమాకు ప్రీమియర్స్ వేసే విషయం ఆలోచిస్తున్నాం` అని అన్నారు దిల్ రాజు.
దిల్ రాజు బ్యానర్‌లో నెక్ట్స్ సినిమాల లైనప్
ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా, నిర్మాతగా తాను చేయబోయే కార్యక్రమాలు, సినిమాల గురించి చెబుతూ, `ఎఫ్ డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రస్తుతం మా సంస్థలో `రౌడీ జనార్థన్`, `ఎల్లమ్మ`, `దేత్తడి`తోపాటు మరో మూవీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్ లో ఉన్నాయి.
అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒకటి, `మార్కో` మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా ఉంటాయి.
అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. `యానిమల్` డైరెక్టర్‌తో ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ లో రెండు మూడు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి` అని చెప్పారు దిల్ రాజు.