“ఫ్యామిలీ స్టార్” రివ్యూలపై దిల్ రాజు కామెంట్స్,ఇంత ఓపెన్ గానా?
మొత్తం మూవీ ఇక్కడే తీస్తే, ‘టీవీ సీరియల్ తీశార్రా బాబూ’ అని మీరే అంటారు. విలన్‌ను బట్టి హీరో ఉంటాడు.

Family Star
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star) ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. గీతాగోవిదం బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద ట్రేడ్ లో భారీ ఎక్స్ పెర్టేషన్స్ ఉన్నాయి. అయితే ఓపెనింగ్స్ పరంగా మాత్రం నార్మల్ గా ఉన్నాయి. రివ్యూలు కూడా డివైడ్ గా వచ్చాయి. అందరూ సినిమా కథ ఓల్డ్ గా ఉందని, తమ్ముడు, గ్యాంగ్ లీడర్ వంటి పాత హిట్ సినిమాలు కొన్నింటిని దగ్గర పెట్టుకుని వండి వార్చిన చిత్రమని కామెంట్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ రివ్యూలపై కామెంట్స్ చేసారు.
Family Star Review
నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) మాట్లాడుతూ.. మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి. సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది. మేము ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ను మీడియా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో.. వాళ్లు రివ్యూస్‌లో ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం.
Family Star Review
దర్శకుడు రాసుకున్న కథ, పాత్రను బట్టి నటీనటుల ఎంపిక ఉంటుంది. వెన్నెల కిషోర్‌ను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాం. ఆయన కనిపించిన సీన్స్‌కు విపరీతంగా నవ్వుతున్నారు. పెళ్లి సాంగ్ మంచి హిట్ అయింది. అయితే, సినిమా ఫ్లో ఆగిపోతోందనే కారణంతోనే ఆ పాటను చివర పెట్టారు. పాట పూర్తిగా వేయకుండా ఆపేస్తున్నారని కొందరు అన్నారు. ఆపరేటర్లకు తెలియదు కదా.. ఇప్పుడు అందరికీ చెబుతాం. పూర్తి పాటను ప్రదర్శించాల్సిందే.
Family Star Review
సెకండాఫ్‌లో కుటుంబం కోసమే హీరో అమెరికా వెళ్తాడు. మొత్తం మూవీ ఇక్కడే తీస్తే, ‘టీవీ సీరియల్ తీశార్రా బాబూ’ అని మీరే అంటారు. విలన్‌ను బట్టి హీరో ఉంటాడు. రెండు జిల్లాల నుంచి మనుషులు వస్తే హీరో కొట్టకుండా ఉంటాడా? హీరో అంటే హీరో పనే చేయాలి. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చూశాం. ఫైట్‌లో హీరో 20 మందిని కొడతాడు. నిజ జీవితంలో మనం కొడతామా? అన్ని యాక్షన్ మూవీలు బ్లాక్‌బస్టర్సే కదా! ఎమోషన్స్ కనెక్ట్ అయితే లాజిక్స్ అడగం.
Family Star Review
కొందరు నచ్చని విషయాలు చెప్పినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కడతారు. సినిమాలో హీరోయిన ఎక్కడా డామినేట్ చేయలేదు. సెకండాఫ్‌లో మూవీ మొత్తం హీరోనే కనపడతాడు. సినిమాను సినిమాటిక్‌గానే తీయాలి. లేకపోతే డాక్యుమెంటరీ తీశారంటూ మీరే (రివ్యూవర్స్) అంటారు. ఇక్కడ రెండే విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మూవీ ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అంతే..!’’ అంటూ దిల్‌రాజు అన్నారు.
Family Star Review
ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజెస్ రావడం మొదలైంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్స్‌కు వెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో మార్నింగ్ ఏడున్నరకు షోస్ మొదలయ్యాయి. నేను కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లో సినిమా చూశాను. 90 పర్సెంట్ యూత్ ఆడియెన్స్ థియేటర్‌లో ఉన్నారు. నేను ఏ ఏ సన్నివేశాల్లో ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతారు అనుకున్నానో అదే జరిగింది.
Family Star Review
సినిమా మొదలైన పది నిమిషాల వరకు ప్రేక్షకులు సైలెంట్‌గా ఉన్నారు. మృణాల్ ఎంట్రీ నుంచి రెస్పాన్స్ మొదలైంది. మరికాసేపటికి సినిమాలో వాళ్లంతా ఇన్వాల్వ్ అయి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. యూఎస్ నుంచి వచ్చిన రిపోర్ట్‌లో ఫస్టాఫ్ సూపర్బ్‌గా ఉంది. సెకండాఫ్ కొంతసేపు స్లోగా ఉంది, ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ చాలా బాగుందని చెప్పారు.
Family Star Review
కానీ హైదరాబాద్‌లో నేను చూస్తున్నప్పుడు సినిమా మొత్తం ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సెకండాఫ్‌లో విజయ్, మృణాల్ కాంబో సీన్స్ కూడా వారికి బాగా నచ్చాయి. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్‌గా థియేటర్స్‌కు వెళ్తున్నారు. మీడియా షో చూశాక నాతో టచ్‌లో ఉండే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్యామిలీతో ‘ఫ్యామిలీ స్టార్’ చూసి ఎంజాయ్ చేశామని చెప్పారు.
Family Star Review
మేము సినిమాలో బామ్మకు, మనవడికి మధ్య చూపించిన ఎమోషన్.. బాబాయ్, పిల్లలు, అన్నదమ్ముల మధ్య చూపించిన ఎమోషన్.. ఆడియెన్స్‌కు బాగా నచ్చుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ (Family Audience) ఈ సినిమా చూడండి. మాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో మీరూ అలాగే ఫీలవుతారు. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్ చేయండి.
Family Star Review
సినిమా చూశాక మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తమ ఫ్యామిలీని గొప్ప పొజిషన్ లోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్ ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి శనివారం నుంచి వారిని కలవబోతున్నాం. ఇప్పటికే ఇలాంటి మూడు ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేశాం. పర్సనల్‌గా నేను, విజయ్, పరశురామ్, మృణాల్ వెళ్లి ఆ ఫ్యామిలీ స్టార్‌ను సర్ ప్రైజ్ చేయబోతున్నాం’’ అని తెలిపారు.
Family Star Review
స్టోరీ లైన్:
మిడిల్ క్లాస్ కుర్రాడు 'గోవర్ధన్'(Govardhan)కి ఫ్యామిలీ అంటే ప్రాణం. ఆర్కిటెక్ట్ అయిన అతను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తూ కుటుంబ బాధ్యతలు అన్నీ తన భుజాల మీదే మోస్తూ ఉంటాడు. ఇంట్లో తనే ఆర్దిక ఆధారం. ఓ ప్రక్కన తాగుడుకు బానిసైన ఒక అన్న(రవి ప్రకాష్) మరో ప్రక్క ఎప్పుడూ ఏదో బిజినెస్ పెట్టుబడి అంటూ తిరిగే మరో అన్న (రాజా చెంబోలు) కు ఆదాయాలు లేకపోవటంతో వాళ్ల ఫ్యామిలీలను తనే సాకాల్సిన పరిస్దితి. ఇలా తను,తన కుటుంబం, ఉద్యోగం అంటూ వెళ్తున్న గోవర్ధన్ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అనే డబ్బున్న అమ్మాయి వస్తుంది. ఆమె అతను ఇంట్లోకి అద్దెకు దిగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసే ఆమె వచ్చాక జీవితం మారిపోతుంది. మెదట్లో ఆమెను పట్టించుకోకపోయినా మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ప్రేమ ప్రపోజల్ పెట్టే టైమ్ కు ఆమె మన హీరో గోవర్దన్ ఓ ట్విస్ట్ లాంటి షాక్ ఇస్తుంది. ఆ షాక్ ఏంటి..అప్పుడు గోవర్ధన్ ఏం చేశాడు? వాళ్ల ప్రేమ కథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఏ సినిమా అయినా ఆడిటోరియంలో 70శాతం ప్రేక్షకులకు నచ్చితే అది హిట్ అని సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అన్నారు. కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతానికి ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ముందు అనుకున్నట్లే…. 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. అయితే అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ లెక్క 6 కోట్లు ఆ పైనకి పెరిగే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో 283K డాలర్స్ ను అందుకున్న సినిమా డే 1 కలెక్షన్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా మొత్తం మీద…మొదటి రోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 8-8.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం కనిపిస్తుంది…