జూనియర్ ఎన్టీఆర్ ను దిల్ రాజు ఏమని పిలుస్తారో తెలుసా? కారణం ఏంటి?
హీరోలు నిర్మాతలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే. ఈ క్రమంలో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన నిర్మాత దిల్ రాజు యంట్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రేమగా ఏమని పిలుస్తారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలకు మంచి అనుబంధం ఉంటుంది. గతంలో నిర్మాతలను చూస్తే హీరోలు భయపడేవారు. కాని రాను రాను పరిస్థితి మారింది. నిర్మాతలు హీరోల డేట్స్ కోసం ఇంటిముందు పడిగాపులు కాసే ట్రెండ్ వచ్చింది. ప్రస్తుతం అది కూడా మారిపోయి, హీరోలు, నిర్మాతలు ఫ్రెండ్స్ గా మారిపోతున్నారు. సినిమా నిర్మాణంలో హీరోలు భాగస్వాములు అవ్వడం, తమ కుటుంబం, ఫ్రెండ్స్ నుంచి నిర్మాతలను హీరోలు పరిచయం చేయడం వల్ల ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం పెరిగిపోయింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. స్టార్ హీరోలకు హిట్ సినిమాలు ఇవ్వడమే కాదు, ఆ హీరోలతో మంచి వ్యక్తిగత సంబంధాలు కూడా దిల్ రాజు మెయింటేన్ చేస్తుంటారు.
తాజాగా నితిన్ హీరోగా, దిల్ రాజు నిర్మించిన "తమ్ముడు" సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్–దిల్ రాజు కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజును నితిన్ ఓ ప్రశ్న అడిగారు. "మీకు ఇతర హీరోలతో ఉన్న అనుబంధాల గురించి చెప్పండి" అని నితిన్ అడిగారు. దాంతో దిల్ రాజు ఒక సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు . జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న ప్రత్యేకమైన సంబంధం గురించి ఆయన వెల్లడించారు. అంతే కాదు ఎన్టీఆర్ ను దిల్ రాజు ప్రేమగా ఏమని పిలుస్తారో కూడా చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ, "తారక్ అంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను ఆయనను ‘నాన్న’ అని పిలుస్తాను." "బృందావనం సినిమా చేస్తున్న సమయంలో, నిర్మాత కొడాలి నాని తారక్ ను 'నాన్న' అని పిలుస్తూ ఉండేవాడు. నాకు ఆ పిలుపు బాగా నచ్చింది. అదే సమయంలో తారక్ కూడా నా మీద చాలా గౌరవంతో ఉంటాడు. అలా నేను కూడా తారక్‌ని ‘నాన్న’ అని పిలవడం మొదలుపెట్టాను." అలా అన్నప్పుడు తెలియని ఆనందం కలుగుతుంది, తారక్ కూడా నన్ను అన్నా అని ప్రేమగా పిలుస్తాడు అని దిల్ రాజు వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ, "తారక్ చాలా డెడ్ కేటెడ్, ప్రొఫెషనల్‌గా వర్క్ చేసే నటుడు. ఆయనతో పనిచేయడం ఒక మంచి అనుభవం." ఎన్టీఆర్ గురించి, తమ అనుబంధం గురించి ఎప్పుడు ఎవరు అడిగినా ఇదే విషయం చెపుతాను. ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే ఆ ఆనందం వేరే ఉంటుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఇక 2010లో విడుదలైన బృందావనం సినిమాను దిల్ రాజు నిర్మించారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు. బృందావనం షూటింగ్ సమయంలో తారక్ – దిల్ రాజు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది అప్పటి నుంచి ఇలా కొనసాగుతూనే ఉంది.
"తమ్ముడు" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ – దిల్ రాజు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా, నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. దిల్ రాజు ఈ సందర్భంగా తన కెరీర్‌లోని అనేక విషయాలను పంచుకున్నారు. నితిన్ కూడా ఈసారి ఎలాగైనా హిట్ కొడతామన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
దిల్ రాజు ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ విషయాని వైరల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ – దిల్ రాజు కాంబినేషన్‌లో నెక్ట్స్ సినిమాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.