- Home
- Entertainment
- Telugu Heroines : సావిత్రి, వాణి శ్రీ, జయప్రద, రాశీ, రంభ తెలుగు హీరోయిన్ల సొంతూర్లు ఇవే.!
Telugu Heroines : సావిత్రి, వాణి శ్రీ, జయప్రద, రాశీ, రంభ తెలుగు హీరోయిన్ల సొంతూర్లు ఇవే.!
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల హవా చూసి చాలా ఏండ్లే గడిసిపోయింది. గతంలో బిగ్ స్క్రీన్ పై తెలుగు నటీమణులు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సావిత్రి, వాణి శ్రీ, జయప్రద, విజయశాంతి, రాశి, రంభ, రోజా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. అయితే వీరి ప్రాంతం, ఊరు పేర్లు మాత్రం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కాగా, వీరి సొంతూర్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ప్రస్తుత యంగ్ హీరోయిన్ల స్వస్థలాలు కూడా తెలుసుకుందాం.

అలనాటి హీరోయిన్లు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతటి గౌరవమో, ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1950 నుంచి 70, 80 వరకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తెలుగు హీరోయిన్లు ప్రభంజనం కొనసాగించారు. వారి యాదిలో నాటి హీరోయిన్లు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకుందాం. మహానటి సావిత్రి ఏపీలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జన్మించింది. జయప్రద స్వస్థలం రాజమండ్రి.. విజయశాంతి వరంగల్ లో పుట్టారు. రాశీ -రాజోలుకు, రంభ విజయవాడకు చెందిన హీరోయిన్లు. వీరంతా తెలుగు వాళ్లే కావడం గర్వకారణం.
తెలుగు యంగ్ హీరోయిన్లలో ముందువరుసలో ఉన్న సుందరి రీతూ వర్మ (Ritu Varma). ఈ బ్యూటీ వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. సినిమా సినిమాకు తన పాపులారిటీని పెంచుకుంటోంది. రితూ తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన హీరోయినే కావడం విశేషం. పెళ్లి చూపులు సినిమాతో ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత టక్ జగదీశ్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను అలరించింది.
హైదరాబాద్ కు చెందిన మరో యంగ్ హీరోయిన్ అతిథి రావు హైదరీ (Aditi Rao Hydari). మోడల్ గా తన కేరీర్ ను స్టార్ చేసిన ఈహీరోయిన్ తక్కువ కాలంలోనే తన ప్రతిభకు గుర్తింపు దక్కింది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులను దక్కించుకుంది. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ హిందీలోనే ఎక్కువగా మెరిసింది. తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం, వీ, మహా సముద్రం లాంటి చిత్రాల్లో నటించింది.
చాలా కాలంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటిస్తోంది హీరోయిన్ అంజలి (Anjali). కొన్నాళ్లపాటు వరుస తమిళ చిత్రాల్లో నటించి తమిళ హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటీ కూడా తెలుగు హీరోయినే. ఆంధ్రప్రదేశ్ లోని రాజోల్ వీరి స్వస్థలం. ప్రస్తుతం తెలుగుతో పాటు పలు భాషల చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో జర్నీ, గీతాంజలి, బలుపు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఎఫ్3, ఆర్సీ 15 చిత్రాల్లో నటిస్తోంది.
యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba) కూడా తెలుగు హీరోయినే. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా వీరి స్వస్థలం. అయినా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో నటించింది. చివరిగా ‘రాగల 24 గంటల్లో, పిట్ట కథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంపై ఫోకస్ పెట్టింది.
‘కలర్ ఫొటో’సినిమాతో పాపులారిటీని దక్కించుకున్న చాందిని చౌదరి (Chandini Chowdary) కూడా తెలుగు హీరోయినే. ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, కలర్ ఫొటో, సూపర్ ఓవర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బరంతో కలిసి ‘సమ్మతమే’ చిత్రంలో నటిస్తోంది.
ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ వినిపిస్తున్న యంగ్ హారోయిన్లలో బిందు మాధవి (Bindu Madhavi) ఒకరు. దాదాపు పదేండ్ల కింద తెలుగులో వరుస చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ కూడా తెలుగమ్మాయినే. ఆంధ్ర ప్రదేశ్ లోని మదనాపల్లెకు చెందిన ఈ సుందరి తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం కాస్తా దూరమయ్యిందనే చెప్పాలి. గతంలో ‘అవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్, ఓం శాంతి, పిిల్ల జమీందార్’ చిత్రాల్లో నటించింది.
ఇటీవల ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’చిత్రంలో అలరించిన యంగ్ హీరోయిన్ ఆనంది (Anandhi) కూడా తెలుగు హీరోయినే. ఈమె స్వస్థలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా. ఈ అచ్చమైన తెలుగమ్మాయి తమిళ హీరోయిన్ గా పేరొందింది. గతంలో ‘ఈరోజుల్లో, బస్ స్టాప్, నాయక్, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాల్లో నటించింది. మళ్లీ తెలుగు సినిమా ఆఫర్లు అందుకుంటోంది.