MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: సింగర్‌గా మెగాస్టార్ మ్యాజిక్! ఎన్ని పాటలు పాడారో తెలుసా?

Chiranjeevi: సింగర్‌గా మెగాస్టార్ మ్యాజిక్! ఎన్ని పాటలు పాడారో తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడనివారు ఉండరు. 4 దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చిరంజీవిలో నటుడు, డ్యాన్సర్ మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా ఉన్నారని మీకు తెలుసా?

2 Min read
Author : Kavitha G
Published : Oct 31 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిరంజీవి స్వయంగా పాడిన పాటలు
Image Credit : Asianet News

చిరంజీవి స్వయంగా పాడిన పాటలు

చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన అద్భుతమైన నటన, అదిరిపోయే డ్యాన్సులు, పవర్‌ఫుల్ డైలాగులు. దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తూ మెగాస్టార్‌గా ఎదిగారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చిరంజీవి స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. అభిమానులు థియేటర్లలో ఈలలు, కేకలతో సందడి చేస్తారు. అయితే ఆయన కేవలం నటన, డ్యాన్సుల్లోనే కాదు.. పాటలు పాడటంలోనూ తన ప్రతిభను చూపించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కొన్ని పాటలు పాడారు. అవేంటో, ఏ సినిమాలో పాడారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మాస్టర్ సినిమాలో తొలిసారిగా..
Image Credit : Asianet News

మాస్టర్ సినిమాలో తొలిసారిగా..

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా 1997లో వచ్చిన మాస్టర్ సినిమాలో తన గాత్రాన్ని వినిపించారు. ఈ సినిమాలోని 'అరే తమ్ముడు' పాటను స్వయంగా ఆయనే పాడారు. అప్పటివరకు తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. ఒక్కసారిగా గాయకుడిగా మారి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ పాటలో ఆయన గొంతులోని ఉత్సాహం, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేసిన చిరంజీవి, పాటలు పాడటంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.

36
మృగరాజు సినిమాలో చాయ్ పాట..
Image Credit : Asianet News

మృగరాజు సినిమాలో చాయ్ పాట..

2001లో విడుదలైన మృగరాజు సినిమాలోనూ చిరంజీవి తన గాత్రాన్ని అందించారు. ఇందులో 'ఏ చాయ్ చటుక్కునా తాగరా బాయ్' అనే పాటను ఆయన పాడారు. టీ తాగడం వల్ల కలిగే ఆనందాన్ని సరదాగా వ్యక్తపరిచే ఈ పాట ప్రేక్షకులను అలరించింది. చిరంజీవి నటనకు, ఆయన గొంతుకు సరిపోయేలా ఈ పాట ఉండటంతో అభిమానులకు మంచి అనుభూతిని అందించింది. నటుడిగానే కాదు.. సింగర్ గా కూడా ప్రేక్షకులను మెప్పించగలరని ఈ పాటతో మరోసారి నిరూపించారు.

46
చైల చైల పాటతో మరోసారి..
Image Credit : Asianet News

చైల చైల పాటతో మరోసారి..

చిరంజీవి పాడిన పాటల్లో ఎక్కువమందికి గుర్తుండిపోయేది 'చైల చైల సాంగ్'. 2004లో విడుదలైన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఈ పాట ఉంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అదే సమయంలో ఆయన గొంతుతో వచ్చిన చైల చైల పాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాటలో చిరంజీవితో పాటు ప్రముఖ గాయకుడు కేకే కూడా గాత్రాన్ని అందించారు.

56
జగదేక వీరునికి పాటలోనూ..
Image Credit : Actor Srikanth\facebook

జగదేక వీరునికి పాటలోనూ..

2007లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలోనూ చిరంజీవి మరోసారి తన గాత్రాన్ని వినిపించారు. ఈ సినిమాలోని 'జగదేక వీరునికి' పాటను ఆయన పాడారు. ఈ చిత్రం గాంధేయ సిద్ధాంతాలు, ప్రేమ, మానవత్వం వంటి అంశాలతో తెరకెక్కింది. ఇందులో చిరంజీవి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జగదేక వీరునికి పాటతో మరోసారి తనలోని గాయకుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

66
నటుడిగానే కాదు.. సింగర్ గానూ ప్రత్యేక గుర్తింపు
Image Credit : Asianet News

నటుడిగానే కాదు.. సింగర్ గానూ ప్రత్యేక గుర్తింపు

సాధారణంగా హీరోలు తమ సినిమాల్లో పాటలు పాడటం కొత్త విషయమేమీ కాదు. అయితే చిరంజీవి లాంటి స్టార్ హీరో స్వయంగా పాట పాడటం అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన పాడిన పాటల సంఖ్య తక్కువే అయినప్పటికీ, ప్రతి పాటలోనూ తనదైన శైలిని చూపించారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Grossing Telugu Movies: తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఏవి?
Recommended image2
#Cult Day 1 Collections: కల్ట్ మూవీ మొదటి రోజు వసూళ్లు.. విశ్వక్‌ సేన్‌ సినిమాకి బాక్సాఫీసు షాక్‌
Recommended image3
Sobhan Babu: 500 పెట్టుబడితో 5 కోట్లు సంపాదించాడు.. శోభన్ బాబు మనీ సేవింగ్ సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Folk Song: 10 రోజుల్లో 10 కోట్ల వ్యూస్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాధురీ రాథోడ్ కంబ్యాక్ సాంగ్!
Recommended image2
Old Sarees: మీ ఊర్లోకి కూడా పాత చీరలు కొంటామని వస్తున్నారా? వాటితో ఏం చేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved