శోభన్ బాబు, జయలలితకి పిల్లలు ఉన్నారా? మేకప్ మ్యాన్ బయటపెట్టిన నిజం ఇదే
శోభన్ బాబు, తమిళనాడు మాజీ సీఎం జయలలితతో పిలల్ని కన్నారా? వీరికి కూతురు ఉందంటూ ప్రచారం జరుగుతుంది. మేకప్ మ్యాన్ చెప్పిన నిజం ఏంటో చూద్దాం.

ఇప్పటికీ సోగ్గాడిగా వెలుగుతున్నారు శోభన్ బాబు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ సోగ్గాడిగా కీర్తించబడుతున్నారు శోభన్‌బాబు. ఎంత మంది హీరోలు వచ్చినా, ఎంత అందంగా ఉన్నా.. అందం విషయంలో ఆయన్ని కొట్టేవారు లేరంటారు. ఫ్యామిలీ కథలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి, ముఖ్యంగా మహిళా ఆడియెన్స్ కి దగ్గరయ్యారు శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిల గ్రీకు వీరుడుగా వెలిగారు.
సినిమాల్లోనే కాదు, శోభన్ బాబు రియల్ లైఫ్‌లోనూ ఎఫైర్
శోభన్ బాబు నటుడిగానూ, పర్సనల్ లైఫ్ విషయంలోనూ చాలా సిస్టమాటిక్ ఉన్న హీరో. క్రమశిక్షణ, నిబద్ధతతో ఉంటారు. అంతే నిబద్ధతతో సినిమాలు చేశారు. వ్యక్తిగత జీవితాన్ని, సినిమా జీవితాన్ని ఎప్పుడూ కలిపేవారు కాదు. షూటింగ్ సమయంలో కుటుంబ విషయాల గురించి మాట్లాడేవారు కాదు, ఇంట్లో సినిమాల గురించి మాట్లాడేవారు కాదట. ఆయనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు.
జయలలితతో శోభన్ బాబు సహజీవనం
శోభన్‌బాబు సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు భార్యలతో గొడవ ఉంటుంది. ఇంట్లో భార్య ఉండగా, ప్రియురాలిని కూడా మెయింటేన్ చేయడం, ఇద్దరి మధ్య ఆయన పడే స్ట్రగుల్ ప్రధానంగా ఆయన సినిమాలుంటాయి. ఎక్కువగా ఇలాంటి చిత్రాలే చేశారు సోగ్గాడు.
అయితే రియల్ లైఫ్‌లోనూ అలాంటిదే ఆయన జీవితంలో ఉంది. ఆయనకు భార్య, పిల్లలున్నారు. కానీ స్టార్ హీరోయిన్, మాజీ సీఎం జయలలితతో ఎఫైర్ నడిపించిన విషయం తెలిసిందే. అది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్.
శోభన్ బాబు, జయలలితకి కూతురు పుట్టారా?
అయితే వీరి విషయంలో సోగ్గాడు కంటే, జయలలితనే ఆయన్నిఎక్కువగా ఇష్టపడిందంటారు. కొంత కాలం ఈ ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేశారట. చాలా మంది అప్పటి తరం నటులు, జర్నలిస్ట్ లు ఈ విషయాన్ని చెప్పారు. అయితే వీరికి ఒక కూతురు కూడా ఉందనే ప్రచారం జరిగింది. జయలలితతో సహజీవనం చేసిన శోభన్ బాబు, ఆమెతో ఓ కూతురుని కన్నాడని అంటుంటారు.
శోభన్ బాబు, జయలలితకి పిల్లలు లేరు, కానీ అందమైన జంట
ఇప్పటికీ ఈ ప్రచారం ఉంది. దీనిపై జయలలిత పర్సనల్ మేకప్ మ్యాన్ అసలు విషయం బయటపెట్టారు. శోభన్ బాబుకి, జయలలితకు కూతురు ఉన్నారనేది అబద్దమని, వారికి పిల్లలు లేరని తెలిపారట.
వారు మంచి స్నేహితులని మేకప్ మ్యాన్ వెల్లడించినట్టు సీనియర్ నటి సత్య ప్రియ సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జయలలితకి పనిచేసిన మేకప్ మ్యాన్ నటి సత్యప్రియ వద్దకు కూడా పనిచేశారు.
ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన విషయాలను తనతో పంచుకునేవాడట. కానీ శోభన్ బాబు, జయలలిత మంచి అందమైన జంట అని, వారు సహజీవనం చేసినది కూడా నిజమే అని నటి సత్యప్రియ వెల్లడించడం విశేషం.