- Home
- Entertainment
- `గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్ ని రామ్ చరణ్ ముందే ఊహించాడా? కాలమే సమాధానం చెబుతుందంటూ స్టేట్‌మెంట్
`గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్ ని రామ్ చరణ్ ముందే ఊహించాడా? కాలమే సమాధానం చెబుతుందంటూ స్టేట్‌మెంట్
`గేమ్ ఛేంజర్`పై దారుణమైన ట్రోల్స్, నెగటివ్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుంది. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది.

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ `గేమ్ ఛేంజర్` సంక్రాంతికి విడుదలై ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోతుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై బాగా నెగటివ్ ట్రోల్ జరిగింది. ఇతర హీరోల అభిమానులు ట్రోల్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
కావాలని కొందరు సినిమాని డ్యామేజ్ చేసినట్టు సమాచారం. ఏదేమైనా `గేమ్ ఛేంజర్` అటు రామ్ చరణ్‌కి, ఇటు శంకర్‌కి, నిర్మాత దిల్ రాజుకి పెద్ద నష్టాన్ని తీసుకురాబోతుంది. అందులో ఈ నెగటివ్ ప్రచారమే కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ నేపథ్యంలో `గేమ్ ఛేంజర్` ఫలితంపై ఇప్పటికే రామ్ చరణ్ స్పందించారు. సినిమాని ఆదరించి సక్సెస్ చేసిన ఫ్యాన్స్, ఆడియెన్స్, సపోర్ట్ చేసిన మీడియాకి ధన్యవాదాలు తెలిపారు చరణ్. మరో సినిమాతో మరింతగా అలరించే ప్రయత్నం చేస్తానని, హార్డ్ వర్క్ చేస్తానని తెలిపారు.
అంతే ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ గానీ చేయలేదు. అయితే ఇది కూడా సినిమాపై చాలా ప్రభావం చూపించింది. కాస్త ప్రమోషన్స్ చేస్తే ఆడియెన్స్ చూసేవారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రతి వారం మనది కాదు, అన్నీ రోజులు ఒకేలా ఉండవు, మనకు అనుకూలంగా ఉండవు అనే నిజాలను మనం గుర్తుంచుకోవాలని చెప్పడం విశేషం.
`సమయం పాటించడం అన్నింటికన్నా చాలా ముఖ్యం. కాలామే అన్నింటికి సమాధానం చెబుతుంది. ప్రతి దానికి యాక్షన్ జరగ్గానే, దానికి రియాక్షన్ ఇవ్వాలని తాపత్రయం పడకుండా, కొంత కాలం వెయిట్ చేయాలి.
ప్రతి సంవత్సరం మనదే అవ్వదు, ప్రతి వారం మనదే అవదు, ప్రతి నెల మనదే అవదు. కొన్ని సార్లు మనకు ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. కొన్ని సార్లు మనకు అనుకూలంగా ఉండదు అనే నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి` అని తెలిపారు రామ్ చరణ్. బాలయ్య హోస్ట్ గా చేసే `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో ఈ విషయాన్ని తెలిపారు చరణ్.
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ షో చేసే నాటికి `గేమ్ ఛేంజర్` మూవీ విడుదల కాలేదు. దీంతో ముందుగానే రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` రిజల్ట్ ని ఊహించారా? ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేశాడా? అనే డౌట్ అవుతుంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా? అని అనిపిస్తుంది.
ఏదేమైనా చరణ్ మాటలు `గేమ్ ఛేంజర్` ఫలితానికి, ఆ మూవీపై జరిగిన దాడికి సూట్ అయ్యేలా ఉంది. దీంతో ఈ మూవీ ఫలితానికి చరణ్ వ్యాఖ్యలను సింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో `ఆర్‌సీ16` పేరుతో సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఇది రూపొందుతుంది. ఇందులో శివ రాజ్‌కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నార చరణ్. ఈ రెండు సినిమాలకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం విశేషం.
read more: టైటానిక్ ఒడ్డుకు చేరింది.. పవిత్ర లోకేష్ తన లైఫ్‌లోకి రావడంపై నరేష్ క్రేజీ కామెంట్స్
also read: `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్, రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే?