- Home
- Entertainment
- అది పర్సనల్ మ్యాటర్.. పెళ్ళికి ముందు శృంగారం, అలియా భట్ ప్రెగ్నన్సీపై బోల్డ్ బ్యూటీ కామెంట్స్
అది పర్సనల్ మ్యాటర్.. పెళ్ళికి ముందు శృంగారం, అలియా భట్ ప్రెగ్నన్సీపై బోల్డ్ బ్యూటీ కామెంట్స్
ప్రస్తుతం బాలీవుడ్ లో అలియా భట్ ప్రెగ్నెన్సీ గురించి చర్చ జరుగుతోంది. కొందరు అలియా భట్ ప్రెగ్నన్సీ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో అలియా భట్ ప్రెగ్నెన్సీ గురించి చర్చ జరుగుతోంది. కొందరు అలియా భట్ ప్రెగ్నన్సీ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పెళ్ళైన రెండు నెలలకే అలియా భట్, రణబీర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పెళ్ళికి ముందే శృంగారం అనే టాపిక్ తెరపైకి వచ్చింది.
బాలీవుడ్ లో పెళ్ళికి ముందు శృగారం, గర్భం అనే సంఘటనలు గతంలో జరిగాయి. బాలీవుడ్ నటి నేహా ధూపియా, అంగద్ బేడీ వివాహానికి ముందే రిలేషన్ షిప్ లో ఉన్నారు. పెళ్ళికి ముందే నేహా ధూపియా గర్భవతి ఐంది. దీనితో వారిద్దరికీ కుటుంబ సభ్యులు హుటాహుటిన వివాహం చేశారు.
ఈ విషయాన్ని నేహా ధూపియా స్వయంగా అంగీకరించింది. వివాహానికి ముందే తాను గర్భవతిని కావడంతో వేగంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. దియా మీర్జాది కూడా దాదాపుగా అదే పరిస్థితి. వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తని దియా మీర్జా గతేడాది వివాహం చేసుకుంది.
వీరిద్దరి వివాహం జరిగిన రెండు నెలల లోపే దియా మీర్జా తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించింది. దీనితో వివాహానికి ముందే వైభవ్ తో ఆమె శారీరక సంబంధం కలిగి ఉందని అందుకే గర్భవతి అయినట్లు నెటిజన్లు ట్రోల్ చేశారు.
ఇప్పుడు అలియా భట్ విషయంలో కూడా అదే చర్చ జరుగుతోంది. దీనిపై దియా మీర్జా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఛాయిస్ ఉంటుంది. తమకు ఏం కావాలో ఎంపిక చేసుకునే హక్కు ఉంది. అది శృగారం అయినా , గర్భం అయినా... వివాహానికి ముందు శృగారం, గర్భం నచ్చని పాత ఆలోచనలు ఉండే జనాలు ఉన్నారు. కానీ వారికి భయపడాల్సిన అవసరం లేదు.
జనాలకు నచ్చకపోయినా.. వ్యక్తిగత హక్కుని ఎంచుకునే వారిని గౌరవించే వారు కూడా ఉన్నారు. ఇలాంటి విషయాల్ని మోడ్రన్ గా ఆలోచించే స్థాయిలో మనం ఇంకా లేము అంటూ దియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పర్సనల్ ఛాయిస్ విషయంలో ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని దియా తేల్చి చెప్పింది.
దియా వ్యాఖ్యలు నెటిజన్లు కూడా అంతే ఘాటుగా బదులిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ముందు నీ గర్భం గురించి ప్రకటించకుండా.. పెళ్లి తర్వాతే ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడావు. అప్పుడే కట్టుబాట్లు ఎందుకు బ్రేక్ చేయలేదు అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.