MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?

Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?

Karthika Deepam 2 Today Episode (మే 5వ తేదీ)లో సుమిత్ర తండ్రి దక్షిణామూర్తికి యాక్సిడెంట్. హాస్పిటల్ కి తీసుకెళ్లిన దీప, కార్తీక్. రక్తం ఇచ్చి ప్రాణం కాపాడిన శివన్నారాయణ. నిజం తెలిస్తే గొడవలు తప్పవన్న శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

2 Min read
Author : Kavitha G
Published : May 26 2026, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో కార్తీక్, దీప గుడికి వెళ్లి వస్తుంటారు. దారిలో వాళ్లను చూసిన దక్షిణామూర్తి కార్తీక్ అని పిలుస్తాడు. అతను కార్తీక్ తో మాట్లాడ్డానికి ముందుకు వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. దక్షిణమూర్తి తలకు గాయం కావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్తారు దీప, కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
శ్రీధర్ కి సర్జరీ
Image Credit : Jiohotstar

శ్రీధర్ కి సర్జరీ

మరోవైపు శ్రీధర్ గురించి డాక్టర్ తో మాట్లాడుతుంటాడు శివన్నారాయణ. రిపోర్ట్స్ అన్నీ చూశారు కదా.. శ్రీధర్ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతాడు. వీలైనంత త్వరగా శ్రీధర్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్తాడు డాక్టర్. కంగారు పడతాడు శివన్నారాయణ. అంతకుముందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను డాక్టర్. స్ట్రెస్ కూడా తగ్గింది. ఇంట్లో అందరితో మాట్లాడి త్వరలో సర్జరీకి ప్లాన్ చేసుకుంటాను అని చెప్తాడు శ్రీధర్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప
Related image2
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
37
జ్యో డౌట్
Image Credit : Jiohotstar

జ్యో డౌట్

ఇంకోవైపు పారు, జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. బావ, దీప గుడికి వెళ్తే ఈపాటికి వచ్చేయాలి కదా అంటుంది జ్యోత్స్న. రెస్టారెంట్ కి వెళ్లొచ్చు అంటుంది పారు. వాళ్లకు అంత టైం ఇవ్వకూడదు అని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. దక్షిణమూర్తి గురించి చెప్పకుండా, తెలిసిన వాళ్లకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి తీసుకొచ్చామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్. ఎవరా తెలిసిన వ్యక్తి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న.

47
బ్లెడ్ ఇచ్చిన శివన్నారాయణ
Image Credit : Jiohotstar

బ్లెడ్ ఇచ్చిన శివన్నారాయణ

డాక్టర్ తో మాట్లాడి బయటకు వస్తున్న శ్రీధర్, శివన్నారాయణ.. కార్తీక్, దీపలను చూస్తారు. మీరు ఎందుకు హాస్పిటల్ కు వచ్చారని కార్తీక్ ని అడుగుతాడు శివన్నారాయణ. అప్పుడే వచ్చిన డాక్టర్.. పేషెంట్ కు బ్లెడ్ చాలా పోయింది. ఆర్జెంట్ గా ఎ పాజిటివ్ బ్లెడ్ కావాలి. లేకపోతే ప్రాణాలు కాపాడటం కష్టం అని చెప్తాడు. ఎవరా వ్యక్తి ఏమైందని కార్తీక్ ని అడుగుతాడు శివన్నారాయణ. దక్షిణమూర్తి గురించి చెప్పకుండా ఓ వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు కార్తీక్. నాది ఎ పాజిటివ్ బ్లెడ్ గ్రూపే.. నేను బ్లెడ్ ఇస్తాను అని చెప్పి బ్లెడ్ ఇవ్వడానికి వెళ్తాడు శివన్నారాయణ.

57
శ్రీధర్ షాక్
Image Credit : Jiohotstar

శ్రీధర్ షాక్

ఓ సారి పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వెళ్తాడు శ్రీధర్. అక్కడ దక్షిణామూర్తిని చూసి షాక్ అవుతాడు. మామయ్య రక్తం ఇచ్చి కాపాడింది తన శత్రువునా అనుకొని బయటకు వచ్చి తప్పు చేశావ్ కార్తీక్. ఈ విషయం మీ తాతకు తెలిస్తే నిన్ను క్షమించడు అని చెప్తాడు శ్రీధర్. ఏం చేయమంటారు అని అడుగుతాడు కార్తీక్. నిజం చెప్పేయమంటాడు శ్రీధర్. ఆ తర్వాత శివన్నారాయణ కూడా పేషెంట్ ని చూడ్డానికి వెళ్లి సరిగ్గా చూసే టైంకి ఫోన్ రావడంతో వెనక్కి వచ్చేస్తాడు.

67
చాటుగా విన్న పారు, జ్యో
Image Credit : Jiohotstar

చాటుగా విన్న పారు, జ్యో

మరోవైపు శివన్నారాయణ ఇంటికి వెళ్లిన శ్రీధర్. కాంచనతో దక్షిణామూర్తి యాక్సిడెంట్ గురించి చెప్తాడు. మీ నాన్నే బ్లెడ్ ఇచ్చి మరీ కాపాడాడు. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఈ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని అంటాడు శ్రీధర్. వాళ్లిద్దరి మాటలను చాటుగా వింటారు పారు, జ్యోత్స్న. బావ, దీప మంచి ఛాన్స్ ఇచ్చారు మనకు. దీన్ని ఎలా వాడుకుంటానో చూడు అని పారుతో అంటుంది జ్యోత్స్న.

77
స్పృహలోకి దక్షిణమూర్తి
Image Credit : Jiohotstar

స్పృహలోకి దక్షిణమూర్తి

స్పృహలోకి వచ్చిన దక్షిణమూర్తితో జరిగిన విషయం చెప్తాడు కార్తీక్. నా చావు చూడాలనుకునే శివన్నారాయణ నాకు ప్రాణం పోశాడా? అని ఫీల్ అవుతాడు దక్షిణామూర్తి. డ్రైవర్ ని అడిగితే మీ గురించి ఏం తెలియదు అని చెప్పారు. అడ్రెస్ చెప్తే మీ వాళ్లను పిలిపిస్తామని అంటుంది దీప. సుమిత్ర అడ్రెస్ చెప్తాడు దక్షిణమూర్తి. సైలెంట్ అయిపోతారు కార్తీక్, దీప. ఆ తర్వాత మీరు వెళ్లండి. నేను చూసుకోగలను అని దీప, కార్తీక్ లను పంపించేస్తాడు దక్షిణమూర్తి. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved