MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న కమెడియన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న కమెడియన్ ఎవరో తెలుసా?

ఒక కమెడియన్ స్టార్ హీరోల రికార్డులపై కన్నేశాడు. ఈ కాలంలో ఎవరికీ సాధ్యం కాని ఓ పనిని చేయబోతున్నాడు. ఇప్పటి వరకూ కమల్ హాసన్, శివాజీ గణేషన్, ఎన్టీఆర్, ఏఎన్నార్ లు మాత్రమే సాధించిన రికార్డును బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న కమెడియన్ ఎవరు? అసలు కథేంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 21 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒక్క సినిమా ఎన్నో పాత్రలు..
Image Credit : Asianet News

ఒక్క సినిమా ఎన్నో పాత్రలు..

ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం వంటి ప్రయోగాలు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఉన్నాయి. హీరోలు ఇలాంటి పాత్రలు చేయడం సర్వసాధారణం. ఒకే సినిమాలో హీరో అనేక పాత్రలు పోషించడం చాలా అరుదైన విషయం. ఈ విషయంలో కాస్త ముందడుగు వేశాడు కమల్ హాసన్, ఆయన నటించిన ‘దశావతారం’ చిత్రం ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 

ఆ సినిమాలో ఆయన పది పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలు త్రిపాత్రాభినయం చేసి మెప్పించగా.. అంతకుముందు తొమ్మిది పాత్రల్లో నటించిన హీరోలుగా శివాజీ గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
16 పాత్రల్లో కమెడియన్ యోగిబాబు..
Image Credit : x/iYogiBabu

16 పాత్రల్లో కమెడియన్ యోగిబాబు..

ఇక కమల్ హాసన్ దశావతారం సనిమా తరువాత ఎవరు ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. మధ్య లో విక్రమ్ ట్రై చేసినా..అది సక్సెస్ అవ్వలేదు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు మరోసారి ఈ ట్రెండ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మూన్ వాక్’లో ఏకంగా 16 పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా యోగిబాబు ఓ సందర్భంలో వెల్లడించారు. అయితే ఈ సినిమా ‘దశావతారం’ తరహాలో ఉండదని ఆయన స్పష్టం చేశారు. మొదట్లో ఈ స్థాయిలో పాత్రలు చేయడానికి తాను నిరాకరించానని, కానీ దర్శకుడు పట్టుదలతో ఒప్పించడంతో ఈ ప్రయోగానికి అంగీకరించినట్లు తెలిపారు.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ ఇంటి విలువ ఎంతో తెలుసా? హైదరాబాద్ లో బంగ్లా, ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఇవే..
Related image2
రామ్ చరణ్ ఇంద్రభవనం.. ఎన్నికోట్ల విలువ ఉంటుందో తెలుసా? ఇంటీరియర్ చూస్తే వావ్ అనాల్సిందే
34
25 ఏళ్ల గ్యాప్ తరువాత..
Image Credit : Asianet News

25 ఏళ్ల గ్యాప్ తరువాత..

‘మూన్ వాక్’ సినిమాలో ప్రభుదేవా హీరోగా నటిస్తుండగా.. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విశేషం ఏంటంటే.. దాదాపు 25 ఏళ్ల తరువాత ప్రభుదేవ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ చేయబోతున్నారు. .ఈ సినిమాలో యోగిబాబు పలు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. దుబాయ్ మాథ్యూ, కవారిమాన్ నారాయణన్, ఆట్టుక్కాల్ వంటి పాత్రలను ఆయన పోషిస్తున్నారు. ఈ 16 పాత్రలు ఒకదానికి ఒకటి సంబధం లేకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

44
అసలు కథ కథ విషయానికి వస్తే..
Image Credit : x/iYogiBabu

అసలు కథ కథ విషయానికి వస్తే..

ఒక చిన్న పట్టణంలో నివసించే కొంతమంది యువకులు పాప్ సంగీతం, ముఖ్యంగా మైఖేల్ జాక్సన్ ప్రభావంతో డ్యాన్స్ నేర్చుకోవాలని ఆశపడతారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వారు చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే సవాళ్లు, చివరకు వారి కల నెరవేరుతుందా లేదా అన్నదే కథగా తెలుస్తోంది.ఈ సినిమా ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యోగిబాబుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి.. ఈ సినిమాలో ఇన్ని పాత్రలు చేయించడం వెనుక కారణం ఏంటీ అనేది సినిమా చూసిన తరువాతే ఆడియన్స్ కు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై సౌత్ సినీ వర్గాల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఇంటి విలువ ఎంతో తెలుసా? హైదరాబాద్ లో బంగ్లా, ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఇవే..
Recommended image2
రామ్ చరణ్ ఇంద్రభవనం.. ఎన్నికోట్ల విలువ ఉంటుందో తెలుసా? ఇంటీరియర్ చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved