MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ధురంధర్ ది రివెంజ్ పై రాజమౌళి రివ్యూ... రణవీర్ సింగ్ మూవీపై అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

ధురంధర్ ది రివెంజ్ పై రాజమౌళి రివ్యూ... రణవీర్ సింగ్ మూవీపై అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్‌గా మారింది ‘ధురంధర్ ది రివెంజ్’ చిత్రం. బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోన్న ఈ సినిమాపై సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 21 2026, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధురంధర్ ది రివెంజ్ పై సెలబ్రిటీల ప్రశంసలు..
Image Credit : Asianet News

ధురంధర్ ది రివెంజ్ పై సెలబ్రిటీల ప్రశంసలు..

మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ధురంధర్ ది రివెంజ్ సినిమా.. మొదటి భాగం ‘ధురంధర్’ విజయంతో ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. ఆ అంచనాలను మరింతగా మించి ‘ధురంధర్ ది రివెంజ్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ మూవీ చూసిన ఫిల్మ్ స్టార్స్ వారి స్పందనలు తెలియజేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన తనదైన శైలిలో సినిమా గురించి విశ్లేషిస్తూ ప్రశంసలు కురిపించారు. “నాకు ధురంధర్ మొదటి భాగం చాలా నచ్చింది. కానీ ‘ది రివెంజ్’ పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు సినిమాను మించిపోయింది” అని తెలిపారు.

25
ధురంధర్ ది రివెంజ్ పై రాజమౌళి రివ్యూ..
Image Credit : SS Rajamouli\Twitter

ధురంధర్ ది రివెంజ్ పై రాజమౌళి రివ్యూ..

సినిమాలోని రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, ప్రపంచ నిర్మాణం, దర్శకత్వం వంటి అంశాలు ఎలాంటి లోపం లేకుండా ఉన్నాయని రాజమౌళి పేర్కొన్నారు. ముఖ్యంగా భావోద్వేగాల ప్రదర్శన ఈ చిత్రానికి ప్రధాన బలం అని ఆయన అభిప్రాయపడ్డారు. 

కథలో మలుపులను అద్భుతంగా అల్లడం ద్వారా నిజమైన ఉత్కంఠను సృష్టించారని ఆయన అన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ “ఇంత పెద్ద నిడివి ఉన్న సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను చివరి ఫ్రేమ్ వరకు కట్టిపడేయడం గొప్ప విషయం” అని వ్యాఖ్యానించారు.

Related Articles

Related image1
Dhurandhar 2 Collection Day 2: 200 కోట్లు కొల్ల గొట్టిన ధురంధర్ 2, రణవీర్ సింగ్ మూవీ రెండో రోజు వసూళ్లు ఎంత?
Related image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
35
రణవీర్ నటనపై ఏమన్నాడంటే?
Image Credit : Asianet News

రణవీర్ నటనపై ఏమన్నాడంటే?

రణవీర్ సింగ్ నటనపై కూడా రాజమౌళి ప్రశంసలు తెలిపారు. “హమ్జా అలీ మజారీ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను మైమరపింపచేసింది. ” అని పేర్కొన్నారు. అలాగే ఆర్. మాధవన్ నటన కూడా దేశంలో ప్రతీ ఒక్కరి ఎమోషన్స్ ను ప్రతిబింబించేలా ఉందని కొనియాడారు.ఈ సినిమా విజయానికి చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి చేసిన ఈ విశ్లేషణలో సినిమా ప్రతి అంశంపై ఇచ్చిన స్పందన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

45
అల్లు అర్జున్ కామెంట్స్..
Image Credit : Asianet News

అల్లు అర్జున్ కామెంట్స్..

ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఆయన తన సోషల్ మీడియాలో ఏమని రాశాడంటే? "దేశభక్తిని చాలా స్టైలిష్‌గా (Patriotism with Swag) చూపించిన సినిమా ఇది. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ సినిమాలో చప్పట్లు కొట్టించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది బ్లాక్‌బస్టర్ బ్లాస్ట్ సినిమా. మాధవన్, నా బ్రదర్ రణ్వీర్ సింగ్ లు పెర్ఫార్మన్స్ లు పీక్.. దర్శకుడు ఆదిత్య ధర్ మన ఇండియన్ సినిమా గర్వించే అద్భుతమైన దర్శకుడు అన్నారు. సినిమా మామూలుగా లేదు.. అదరగొట్టేశారు అని అల్లు అర్జున్ తెలిపారు.

55
ఒక్క మాటలో విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే?
Image Credit : Vijay Devarakonda\Twitter

ఒక్క మాటలో విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే?

ధురంధర్ రి రివెంజ్ సినిమాపై విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. ఆయన ఏమన్నాడంటే..? '' ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈసినిమా కచ్చితంగా ఒక చరిత్రను సృష్టిస్తుంది. ఈసినిమాలో భాగం అయిన ప్రతీ ఒక్కరికి నా శుభాకాంక్షలు. ధురంధర్ గురించి ఒక్క మాటలో చెపుతాను.. భారత్ మాతాకి జై..'' అని అన్నారు. వీరే కాదు ఈసినిమాపై రామ్ గోపాల్ వర్మ, నాగార్జున లాంటి వారు ఎందరో స్పందించారు. ఈసినిమా నుంచి ఎవరు బయటకు రాలేకపోతున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika: చిన్నారికి ఊహించని ట్రీట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా.. విరోష్‌తో కలిసి ఏం చేసిందంటే
Recommended image2
ఐశ్వర్యరాయ్ కి సారీ చెప్పిన స్నేహా ఉల్లాల్ , కారణం ఏంటి? అసలేం జరిగిందంటే?
Recommended image3
Dhurandhar 2 Collection Day 2: 200 కోట్లు కొల్ల గొట్టిన ధురంధర్ 2, రణవీర్ సింగ్ మూవీ రెండో రోజు వసూళ్లు ఎంత?
Related Stories
Recommended image1
Dhurandhar 2 Collection Day 2: 200 కోట్లు కొల్ల గొట్టిన ధురంధర్ 2, రణవీర్ సింగ్ మూవీ రెండో రోజు వసూళ్లు ఎంత?
Recommended image2
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved