- Home
- Entertainment
- ఢీ14 నుండి సుడిగాలి సుధీర్, రష్మీ అవుట్...వారి స్థానంలో రంగంలోకి దిగిన బిగ్ బాస్ బ్యాచ్!
ఢీ14 నుండి సుడిగాలి సుధీర్, రష్మీ అవుట్...వారి స్థానంలో రంగంలోకి దిగిన బిగ్ బాస్ బ్యాచ్!
తెలుగులో ఢీ డాన్స్ రియాలిటీ షోకి తిరుగులేదు. 13 సీజన్స్ గా తిరుగులేని షోగా నిరవధికంగా సాగిపోతుంది. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన ఢీ టీఆర్పీ భారీగా రాబడుతుంది. దీంతో నిర్వాహకులు ప్రతి సీజన్ కి కొత్త హంగులు హద్దుతూ సరికొత్తగా సిద్ధం చేస్తున్నారు.

ఇటీవలే ఢీ సీజన్ 13 ముగిసింది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కాన్సెప్ట్ తో సాగిన షో సూపర్ సక్సెస్ అందుకుంది. ఫైనల్ ఎపిసోడ్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి విన్నర్స్ కి ట్రోపి, ప్రైజ్ మనీ అందించారు. కాగా ఢీ 14 (Dhee 14) త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈసారి మరో కొత్త కాన్సెప్ట్ తో షోని సిద్ధం చేశారు.
జూనియర్స్, లేడీస్, జోడీలతో పాటు ఛాంపియన్స్ అంటూ నాలుగు విభాగాల నుండి కంటెస్టెంట్స్ పోటీపడనున్నారు. ఇక ప్రోమోలో యాంకర్స్ గా ప్రదీప్, హైపర్ ఆది (Hyper Adhi) కనిపించారు. జడ్జెస్ స్థానంలో ఎప్పటిలాగే ప్రియమణి, గణేష్ మాస్టర్ ఉన్నారు. కొత్తగా బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ షోలో కనిపించారు.
అయితే క్రేజీ బుల్లితెర రూమార్డ్ కపుల్ రష్మీ,సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)కనిపించలేదు. దీంతో ఈ సీజన్ నుండి సుధీర్, రష్మిలను తప్పించారనే సందేహాలు తెరపైకి వచ్చాయి. ఒక వేళ అదే నిజం అయితే, ఓ వర్గం ప్రేక్షకులకు నిరాశే.
గత నాలుగైదు సీజన్స్ గా రష్మీ (Rashmi Gautham), సుధీర్ షోలో సందడి చేస్తున్నారు. యాంకర్స్ గా వీరి ఎంట్రీ తర్వాత ఢీ మరింత ఎంటర్టైనింగ్ గా మారింది.కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మన్స్ మధ్య రష్మీ, సుధీర్ రొమాన్స్, కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదం పంచేవి. ఢీ వేదిక సాక్షిగా వీరిద్దరికీ ఉత్తుత్తి పెళ్లి కూడా జరిగింది.
ఎన్నాళ్ళు చూసినా విసుగు పుట్టని జంటగా రష్మీ, సుధీర్ బుల్లితెరపై పేరు తెచ్చుకున్నారు. వీరి కారణంగానే షోని చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి తరుణంలో ఢీ నిర్వాహకులు వీరిని తొలగించారంటే నమ్మడం కష్టమే.
అయితే రెమ్యూనరేషన్ లేదా ఇతర కారణాలతో స్వచ్ఛందంగా సుధీర్, రష్మీ తప్పుకొని ఉండవచ్చు. అయితే ఇది కేవలం కర్టైన్ రైసింగ్ ఎపిసోడ్ కాబట్టి... షోలో పాల్గొనకపోయి ఉండవచ్చు. కాగా సుధీర్, రష్మీతో పాటు యంగ్ యాంకర్ దీపికా పిల్లి, జడ్జి పూర్ణ కూడా ఈ ప్రోమోలో కనిపించలేదు.
ఢీ 13లో సందడి చేసిన వీరంతా కనిపించకపోవడానికి సమూల మార్పులే కారణమా.. లేక వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో కొత్తగా బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. మోనాల్ కూడా రానుందని, ఆమె ఓ టీమ్ కి లీడర్ గా ఉంటారన్న మాట వినిపిస్తుంది. ఏది ఏమైనా పూర్తి వివరాలు తెలియాలంటే ఓ ఎపిసోడ్ ప్రసారం కావాలి.