MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ధర్మేంద్ర ఆర్యోగానికి సంబంధించి కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు

ధర్మేంద్ర ఆర్యోగానికి సంబంధించి కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు

Dharmendra: బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు ధ‌ర్మేంద్ర ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ మంగ‌ళ‌వారం పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. కాగా తాజాగా ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 12 2025, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆసుపత్రి నుంచి ధర్మేంద్ర డిశ్చార్జ్
Image Credit : Asianet News

ఆసుపత్రి నుంచి ధర్మేంద్ర డిశ్చార్జ్

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న ఆరోగ్యం కుద‌ట‌ప‌డ‌గా బుధ‌వారం (ఈరోజు) ఉదయం 7:30 గంటలకు వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు ఆయనను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. “ ప్ర‌స్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది, మిగిలిన చికిత్స ఇంట్లోనే కొనసాగుతుంది.” అని వైద్యులు తెలిపారు.

24
పుకార్ల‌కు చెక్
Image Credit : hema malini instagram

పుకార్ల‌కు చెక్

ధ‌ర్మేంద్ర ఆరోగ్యం పూర్తిగా క్షీణించింద‌ని, ఆయ‌న మ‌ర‌ణించారంటూ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే వెంట‌నే దీనిపై కుటుంబ స‌భ్యులు స్పందించారు. భార్య హేమా మాలిని మాట్లాడుతూ.. “ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం అసహ్యకరం. ధర్మేంద్ర బాగానే ఉన్నారు,” అని తేల్చి చెప్పారు. కుమార్తె ఈషా డియోల్ ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ.. “నా తండ్రి ఆరోగ్యం మెరుగవుతోంది. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు,” అని కోరింది.

Related Articles

Related image1
మొబైల్ యూజర్లకు జలక్.. రూ. 189 ప్లాన్‌ను తొల‌గించిన ప్ర‌ముఖ‌ టెలికం సంస్థ‌
Related image2
5 గ్ర‌హాల్లో కీలక మార్పులు... ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే. కొందరికి మాత్రం ఇబ్బందులు
34
అక్టోబ‌ర్‌లో ఆసుప‌త్రిలో చేరిన ధ‌ర్మేంద్ర
Image Credit : hema malini instagram

అక్టోబ‌ర్‌లో ఆసుప‌త్రిలో చేరిన ధ‌ర్మేంద్ర

అనారోగ్య కార‌ణాల దృష్ట్యా ధ‌ర్మేంద్ర‌ను అక్టోబర్ చివరలో ఆసుపత్రిలో చేర్చారు. శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది కార‌ణంగా.. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. కొన్ని రోజుల పరిశీలన తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. “ఆయన వయస్సు దృష్ట్యా జాగ్రత్త అవసరం, అందుకే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.” అని వైద్యులు తెలిపారు.

44
అభిమానుల స్పందన
Image Credit : bobby deol instagram

అభిమానుల స్పందన

ఇక‌పై ధ‌ర్మేంద్రకు అవసరమైన చికిత్స ఇంట్లోనే కొనసాగుతుందని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఆసుపత్రి నుంచి ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. ధ‌ర్మేంద్ర ఆరోగ్యంగా ఉండ‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Related Stories
Recommended image1
మొబైల్ యూజర్లకు జలక్.. రూ. 189 ప్లాన్‌ను తొల‌గించిన ప్ర‌ముఖ‌ టెలికం సంస్థ‌
Recommended image2
5 గ్ర‌హాల్లో కీలక మార్పులు... ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే. కొందరికి మాత్రం ఇబ్బందులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved