- Home
- Entertainment
- సౌత్‌లో రీమేక్ అయిన ధర్మేంద్ర సినిమాలు.. తెలుగులో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు
సౌత్‌లో రీమేక్ అయిన ధర్మేంద్ర సినిమాలు.. తెలుగులో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు
Dharmendra: ధర్మేంద్ర చాలా సినిమాలు సౌత్‌లో రీమేక్ అయ్యాయి, అవన్నీ హిట్టే. `ఫూల్ ఔర్ పత్తర్` నుంచి `గజబ్ దాకా` దాదాపు ఐదు సినిమాలు సౌత్‌లో రీమేక్ అయ్యాయి. అందులోనూ తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజులు సూపర్ హిట్స్ అందుకున్నారు.

`ఫూల్ ఔర్ పత్తర్ తెలుగులో `నిండు మనుసులు`గా రీమేక్
ధర్మేంద్ర సినిమా `ఫూల్ ఔర్ పత్తర్` 1966లో రిలీజైంది. ఈ మూవీ బాలీవుడ్‌లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో రీమేక్ అయ్యింది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా `నిండు మనుసులు`గా రీమేక్ అయి హిట్ అయ్యింది. దీంతోపాటు తమిళం `ఓలి వల్లకు`గా, మలయాళంలో `పుతియా వల్లిచమ్`గా రీమేక్ అయ్యింది. అక్కడ కూడా హిట్ అయ్యింది.
`సీతా ఔర్ గీతా` తెలుగులో `గంగా మంగా`గా రీమేక్
ధర్మేంద్ర, హేమ మాలినిల సినిమా సీతా ఔర్ గీతా 1972లో రిలీజైంది. హిందీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీని తెలుగులో కృష్ణ మోహన్ బాబు `గంగా మంగా`గా రీమేక్ చేశారు. అయితే ఇది ఎన్టీఆర్ నటించిన `రాముడు భీముడు`కి రీమేక్ కావడం విశేషం. ఇక ఈ సినిమా తమిళంలో వాణి రాణి (1974)గా వచ్చింది. రెండూ బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి.
`ఇన్సాఫ్ కీ పుకార్` తెలుగులో `గురు శిష్యులు`గా రీమేక్
ధర్మేంద్ర, హేమ మాలినిల సినిమా ఇన్సాఫ్ కీ పుకార్ 1987లో రిలీజైంది. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దీన్ని కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్ కలిసి `గురు శిష్యులు`గా రీమేక్ చేశారు. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది.
షోలే
ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్‌ల సినిమా షోలే 1975లో రిలీజైంది. దీని సౌత్ రీమేక్ తమిళంలో రక్త కన్నీరు (1974)గా వచ్చింది. తెలుగులో రీమేక్ కాలేదు. కానీ ఇందులోని గబ్బర్ సింగ్ పాత్ర ఆధారంగా `గబ్బర్ సింగ్` మూవీని రూపొందించారు. కాకపోతే ఇది `దబాంగ్` కి రీమేక్. ఆ తర్వాత హిందీలోనే వర్మ `ఆగ్` పేరుతో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు.
రాజ్‌పుత్
ధర్మేంద్ర, హేమ మాలినిల సినిమా రాజ్‌పుత్ 1982లో రిలీజైంది. తెలుగులో రాజ్‌పుత్ (1983) డబ్ అయి ఆకట్టుకుంది. తమిళంలో రాజవంశం (1983)గా రీమేక్ అయ్యింది. రెండు చోట్లు ఆకట్టుకుంది.
గజబ్
ధర్మేంద్ర, రేఖల సినిమా గజబ్ 1982లో రిలీజైంది. ఇది హిందీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తమిళంలో వచ్చిన `కళ్యాణరామన్` చిత్రానికి రీమేక్ కావడం విశేషం.

