- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Nov 25: రామరాజు నుంచి తెలివిగా డబ్బు కొట్టేసిన భాగ్యం, వల్లీ డ్యాన్సులు
Illu Illalu Pillalu Today Episode Nov 25: రామరాజు నుంచి తెలివిగా డబ్బు కొట్టేసిన భాగ్యం, వల్లీ డ్యాన్సులు
Illu Illalu Pillalu Today Episode Nov 25: ఈ రోజు ఎపిసోడ్ లో రామరాజును మోసం చేసి భాగ్యం డబ్బు కొట్టేందుకు ప్లాన్ వేసింది. అనుకున్నట్టుగానే వారి ప్లాన్ సక్సెస్ అయింది. ఇక వల్లీ ఆనందానికి అవధులు లేవు.

కోడళ్లను ఉతికారేసిన వేదవతి
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో వేదవతి ఇద్దరి కోడళ్లపై అరుస్తూ కనిపిస్తుంది. అత్తకి ఏమాత్రం మర్యాద ఇవ్వడం లేదని అంటుంది. నర్మదా సర్ది చెప్పడానికి ప్రయత్నించినా కూడా వేదవతి వినదు. నర్మదకి సపోర్టుగా ప్రేమ రాగానే ప్రేమ మీద కూడా విరుచుకుపడుతుంది వేదవతి. మీ ఇద్దరికీ అత్త కన్నా మీ భర్తలే ఎక్కువైపోయారని అంటుంది. ‘మీ ఆయన నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేస్తానన్నాడని నువ్వు మురిసిపోవడం, నువ్వు మీ ఆయనకి సపోర్ట్ చేయడం.. ఇదిగో ఈవిడ వాళ్ళ ఆయనతో గవర్నమెంట్ ఉద్యోగానికి చేయించాలని ఆరాట పడిపోతోంది, ఆ విషయం మూడో కంటికి తెలియకుండా దాచి పెట్టడం’ అంటూ వేధవతి ఇద్దరినీ ఉతికి ఆరేస్తుంది. కోడలు ఇద్దరు ఏమనలేక అలా చూస్తూ ఉండిపోతారు అనాల్సిన మాటలు అన్నీ అనేసి అక్కడినుంచి వేదవతి కోపంగా వెళ్ళిపోతుంది.
రామరాజుని రెచ్చగొట్టిన భాగ్యం
ఇక అక్కడ నుంచి సీన్ భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయి దగ్గరికి మారిపోతుంది. ఇంట్లో జరిగిన గొడవలను తలుచుకొని తెగ ఆనంద పడుతూ ఉంటారు. వల్లీ ఇంకో ప్లాన్ తో రామరాజు దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఇదే మంచి సమయం అని తల్లిదండ్రులకి చెబుతుంది. అనుకున్నట్టే భాగ్యం ఇడ్లీ బాబాయ్ రామరాజు దగ్గరికి వస్తారు. భాగ్యం ‘అయిన వాళ్ళందరూ మోసం చేసిన ధర్మరాజులా ఉన్నారు. ఏమైంది అన్నయ్యగారు’ అని రామరాజుని అడుగుతుంది. ఈ లోపు అక్కడికి కొడుకులు, కోడళ్లు అందరూ వస్తారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు ఏమైందండీ అంటూ వేదవతిని అడుగుతుంది భాగ్యం.ఇంట్లో ఏదైనా గొడవ అయిందా అని అడుగుతుంది. దాంతో రామరాజు వచ్చిన విషయం చెప్పమని భాగ్యాన్ని అడుగుతాడు.
భాగ్యం కొత్త బిజినెస్ ఐడియా
భాగ్యం మాట్లాడుతూ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువైపోవడం వల్ల ఆ వ్యాపారం పెట్టలేకపోయామని, మీరు మరొక వ్యాపారం ప్లాన్ తో రమ్మన్నారు కదా అందుకే వచ్చామని చెబుతుంది. రామరాజు ఆ బిజినెస్ ఐడియా ఏమిటని అడుగుతాడు. దానికి భాగ్యం ఈమధ్య ‘కొడుకులకు పెళ్లి అవ్వగానే భార్యల మాటే వింటున్నారు కదండీ’ అని గొడవకు గొడవను మళ్ళీ గుర్తుచేస్తుంది. చాలామంది కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రులను చూడకుండా వదిలేస్తున్నారు కదా.. అలాంటి తల్లిదండ్రులని మేము చూసుకునే బిజినెస్ మొదలు పెడదామని అనుకుంటున్నట్టు భాగ్యం చెబుతుంది. దానికోసం ముందుగానే పెద్ద ఇల్లు తీసుకొని మంచాలు, పరుపులు, గిన్నెలు అన్నీ కొనాల్సి ఉంటుందని.. దానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, అందుకని మీరు ఒక పది లక్షలు అప్పుగా ఇవ్వాలని అడుగుతుంది భాగ్యం.
అసలే కోపంలో ఉన్న రామరాజులు మరింతగా బాధపెట్టేలా మాట్లాడుతుంది. కొడుకులు కోడలిపై విరక్తిగా ఉన్న రామరాజు భాగ్యం మాటలకు ప్రభావితం అవుతాడు. ప్రేమ, నర్మదా భాగ్యం ప్లాన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు.
భాగ్యం చేతికి పదిలక్షల రూపాయలు
కానీ రామరాజు మాత్రం భాగ్యం చెప్పిన ఐడియా తనకు నచ్చిందని అంటాడు. ‘ఎప్పుడు ఎవరు ఎలా మారతారో, కన్నవారికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరికీ తెలియదు.. కాబట్టి నిన్నటి వరకు కన్న వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళు రేపటి రోజు గుండెల మీద తన్నవచ్చు. పిల్లల ప్రపంచం వేరే ఉంటుంది’ అని 10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. వేదవతిని 10 లక్షలు తెచ్చి ఇవ్వమని చెబుతారు. ఇదంతా చూసి వల్లీ ఆనందంతో పొంగిపోతుంది. 10 లక్షల క్యాష్ తీసుకొచ్చి భాగ్యం ఇడ్లీ బాబాయ్ చేతిలో పెట్టేస్తాడు రామరాజు. ఆ డబ్బులు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే అందరూ ఎవరి దారిన వేలు వెళ్లిపోతే వల్లి మాత్రం నిల్చుని ఆనందంతో డాన్స్ లేస్తుంది.
వార్నింగ్ ఇచ్చిన నర్మద
ఇంటి నుంచి బయటకు వచ్చాక భాగ్యం, ఇడ్లీ బాబాయి డబ్బులు చూసి తెగ మురిసిపోతూ ఉంటారు. అదే సమయానికి నర్మద బయటకి వస్తుంది. నర్మదను దెప్పి పొడిచే విధంగా మాట్లాడుతుంది. ‘నిన్నటి వరకు నీకు ఇంట్లో ఎంతో విలువ ఉంది. కానీ ఇప్పుడు మీ మామయ్య దగ్గర నీకు ఎలాంటి విలువ లేదు. మొన్న పచ్చడిలో ఉప్పు కలిపేసి మీ మామయ్య మాకు డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడ్డావు. కానీ ఈరోజు మీ మావయ్య నువ్వు మాట్లాడుతున్నా కూడా వినకుండా మాకు డబ్బులు ఇచ్చేశారు. అదను చూసి దెబ్బ కొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య’ అంటుంది భాగ్యం.
నర్మద మాట్లాడుతూ ‘గాలి ఎప్పుడూ ఒకేవైపు వీచదు. సమయం అన్నివేళలా కలిసి రాదు. మా మామయ్య దగ్గర మీరు డబ్బులు తీసుకోవడం ఇదే మొదటిసారి.. ఇదే చివరిసారి అవుతుంది’ అని వార్నింగ్ ఇస్తుంది.
సేనాపతి అనుమానం
ఇక్కడి నుంచి సీన్.. వల్లి దగ్గరకు మారుతుంది. వల్లి పాటలు వేసుకొని మరీ డాన్సులు చేస్తూ ఉంటుంది. ఇంట్లో గొడవలు జరగడం, తల్లిదండ్రులకు 10 లక్షలు డబ్బులు రావడం వల్ల ఆనందాన్ని రెట్టింపు చేశాయి. నర్మద, ప్రేమలను రామరాజు దగ్గర చెడుగా మార్చినందుకు వల్లి ఎంతో ఆనందపడుతుంది. ఇక వాళ్ళిద్దరూ ఇంట్లో పిల్లి పిల్లల్లాగా ఉండాల్సిందేనని, కానీ తాను మాత్రం చిరుత పులిలా ఉండాలని అనుకుంటుంది. ఇక సేనాపతి సేనాపతి భార్య నగలను చూసి ప్రేమను గుర్తు చేసుకుంటుంది. ఇవి వేసుకొని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉండాల్సిన కూతురుకు ఆ అదృష్టం లేకుండా పోయిందని బాధపడుతుంది.
ఆ నగలను తీసుకెళ్లి సేనాపతిని మెరుగు పట్టించి తీసుకురమ్మని చెబుతుంది భద్రావతి. వాటిని పట్టుకున్న సేనాపతికి అనుమానం వస్తుంది. ఈ నగలు రోల్డ్ గోల్డ్ లాగా తేలికగా ఉన్నాయేంటని అడుగుతాడు. దానికి భద్రావతి అవి కిలో బరువు ఉంటాయని చెబుతుంది. అవన్నీ మంచి బంగారమేనని చెప్పి మెరుగు పెట్టి తీసుకురమ్మని పంపిస్తుంది. ఇక రామరాజు ఇంట్లో వేదవతి భర్తని భోజనానికి పిలుస్తుంది. కానీ రామరాజు తినేందుకు ఇష్టపడరు. బాధతో అలా కూర్చునే ఉంటాడు. కోడళ్ళు కొడుకులు అందరూ రామరాజు దగ్గరికి వస్తారు. దీంతో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

