Brahmamudi: కళ్యాణ్ సాయం కోరిన ధాన్యలక్ష్మి.. చీటింగ్ కేసు పెడతానంటున్న రుద్రాణి?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భార్యది తప్పు కాదు అని తెలిసినా క్షమించలేకపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో కంగారు పడుతుంది కనకం. డబ్బులు తీసారా అంటూ ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. మాకేం అవసరం ఉంటుంది అంటాడు కృష్ణమూర్తి. ఇందాక పార్సెల్ కి స్వప్న డబ్బులు ఇవ్వడం గుర్తు చేసుకుంటుంది అప్పు. స్వప్నని తన గదిలోంచి హాల్లోకి లాక్కు వస్తుంది. ఆ గ్రహాన్ని ఎందుకు బయటకు వచ్చావు అంటూ చిరాకు పడుతుంది కనకం.
నిజం తెలిస్తే నీకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది అంటూ ఇందాక మేకప్ కిట్ కి ఇచ్చిన డబ్బులు ఎక్కడివి అని అక్కని నిలదీస్తుంది అప్పు. ఇంకెక్కడివి అమ్మ డబ్బులు అంటుంది స్వప్న. ఇది దొంగతనాలు కూడా చేస్తుందమ్మా అంటుంది అప్పు. మన ఇంట్లో డబ్బులు తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుంది అయినా ఏవో కోట్లు కోట్లు కొల్లగొట్టేసినట్లు ఎందుకు అలా అయిపోతున్నారు కావాలంటే వేయి రూపాయలు మిగిలాయి అవి మీ మొహాన పారేస్తాను తీసుకోండి.
రేపు నేను దుగ్గిరాల వారి ఇంటి కోడల్ని అయిన తర్వాత నేనే మీకు కావలసినంత డబ్బు ఇస్తాను అంటూ పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదని ఆలోచిస్తున్నాను పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దు అంటూ కోప్పడతాడు కృష్ణమూర్తి. కనకం కూడా నానా చివాట్లు పెడుతుంది. మా అమ్మ నన్ను ఎప్పుడు ఇలా తిట్టలేదు అని ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. అదేమైనా చేసుకుంటుందేమో అని భయపడుతుంది పెద్దమ్మ.
అమ్మ ఆ మేకప్ బాక్స్ వెనక్కి ఇచ్చేసి డబ్బులు రిటన్ తీసుకోమంటుందేమో అని ఓవరాక్షన్ చేస్తుంది అంటుంది అప్పు. సేటుకి వడ్డీ ఎలా కట్టాలి అని కంగారు పడుతుంది కనకం. సీన్ కట్ చేస్తే కావ్యని ముస్తాబు చేసి గదిలోకి పంపుతుంది ధాన్యలక్ష్మి. నాకెందుకు అవమానం జరుగుతుందేమో అనిపిస్తుంది కావ్య. అప్పుడు నువ్వు ఊరుకో వద్దు నీ తప్పు లేదని నిరూపించుకున్నావు. నీ కోరికలు తీర్చడం ఎప్పుడో భర్తగా తన బాధ్యత అని చెప్పి పంపిస్తుంది ధాన్యలక్ష్మి.
గదిలోకి పాలు గ్లాసుతో వచ్చిన కావ్య ని చూసి నువ్వు నా దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నీది తప్పు లేదని నిరూపించుకున్నా కూడా నువ్వు నాకు శత్రువు గానే కనిపిస్తున్నావు. నా భార్యగా ఒప్పుకోకపోవటానికి ఇప్పుడు కారణాలు ఏమీ లేవు దయచేసి ఏదో కారణం చెప్పి నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు రాజ్. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు బద్ధ శత్రువు లాగా చూసుకునే మనం భార్యాభర్తలమయ్యాము.
ఈ ఇంట్లోకి రానివ్వను అన్నారు అత్తయ్య అలాంటిది ఈ ఇంట్లోనే తిరుగుతున్నాను. మీరు ఈ గదిలోకి రానివ్వను అన్నారు ఇప్పుడు ఇదే గదిలో ఉన్నాను. ఏమో ఎవరికి తెలుసు రేపు మీరు కూడా మారొచ్చు నన్ను ప్రేమించొచ్చు అంటుంది కావ్య. అది జరగని పని అంటాడు రాజ్. సరేగాని ముందీ పాలు తాగండి అని పాలు చేతిలో పెట్టి వాష్ రూమ్ కి వెళ్తుంది కావ్య. పాలని డస్ట్ బిన్ లో పోసేస్తాడు రాజ్.
అది చూసిన ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది. కళ్యాణ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ సంసారాన్ని సరి చేయటానికి మీ సహాయం కావాలి అని అడుగుతుంది. వాళ్ళు బాగుంటారు అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ తల్లికి మాట ఇస్తాడు కళ్యాణ్. మరోవైపు స్నానానికి వెళ్తాడు రాజ్. ఈలోగా పనిమనిషి వచ్చి మోటర్ పాడయింది టాప్ లో వాటర్ రాదు. నేను చెప్పే వరకు వాష్ రూమ్ లోకి వెళ్ళకండి అని చెప్తుంది. అదే విషయాన్ని కంగారుగా వెళ్లి రాజ్ కి చెబుదాం అనుకుంటుంది కావ్య.
కానీ రాజ్ వినిపించుకోకుండా మొండిగా తలకి షాంపూ పెట్టుకుంటాడు. తర్వాత ట్యాప్ ఓపెన్ చేసేసరికి వాటర్ రాదు. అప్పుడు కంగారు పడతాడు రాజ్. డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కావ్య కనిపిస్తుంది. ఏం వాటర్ రావట్లేదా అంటూ ఆటపట్టిస్తుంది కావ్య. తరువాయి భాగంలో ఎవరు అడ్డుకున్న రాహుల్ స్వప్న కి వెళ్లి జరిగి తీరుతుంది అంటాడు రాజ్. నేను ఒప్పుకోను వాళ్ళ మీద చీటింగ్ కేసు పెడతాను అంటుంది రుద్రాణి. ఏమని పెడతావు అంటూ నిలదీస్తాడు రాజ్.