ధనుష్ కు షాక్ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్, జాగ్రత్తగా ఉండమంటూ నిర్మాతలకు...
ధనుష్ తో కొత్త సినిమాలు మొదలు పెట్టేముందు జాగ్రత్తగా ఉండమని, అడ్వాన్స్ లు ఇచ్చేముందు తమకు తెలియచేయమని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది.

dhanush
ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘రాయన్’తమిళంలో బాగానే వర్కవుట్ అవుతోంది. కానీ తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ధనుష్ రాసి, డైరక్ట్ చేసి, నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 26న విడుదలైంది. ధనుష్‌తో పాటు ఎస్‌జే సూర్య, సందీప్‌కిషన్‌ల యాక్షన్ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. దీనికితోడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. దీంతో ఈ చిత్రం రికార్డుల దిశగా పయనిస్తోంది. తాజాగా ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే హైయిస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పినట్లు ప్రకటించారు.
Dhanush Raayan
ఇప్పటివరకు ‘రాయన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.75కోట్లు వసూలుచేసినట్లు చిత్ర టీమ్ అఫీషియల్ గా తెలిపింది. ఈ కలెక్షన్స్ ఇలానే కొనసాగితే త్వరలోనే ‘రాయన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేఫధ్యంలో ధనుష్ తో కొత్త సినిమాలు మొదలు పెట్టేముందు జాగ్రత్తగా ఉండమని, అడ్వాన్స్ లు ఇచ్చేముందు తమకు తెలియచేయమని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది.
Raayan
తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షతన రాష్ట్ర సినిమా థియేటర్ల యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా థియేటర్ల మల్టీఫ్లెక్స్ యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా పంపిణీదారుల సంఘం నిర్వాహకుల సమావేశం చెన్నైలో సోమవారం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నటుడు ధనుష్ ఇప్పటికే పలువురు నిర్మాతల వద్ద అడ్వాన్స్ తీసుకున్న నేపథ్యంలో ఇకపై ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు రాష్ట్ర సినీ నిర్మాతల సంఘంతో చర్చించాలని తీర్మానించారు.
తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ Thenandal ఫిల్మ్స్ వారు 2023లో ధనుష్ కు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చామని, అప్పటి నుంచి ఇప్పటిదాకా షూటింగ్ కు రాలేదని కంప్లైంట్ చేసారు. తమలాగే చాలా మంది దగ్గర ధనుష్ అడ్వాన్స్ లు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. దాంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఈ తీర్మానంతో పాటు మరో ఐదు తీర్మానాలు చేశారు. స్టార్ హీరోల సినిమాలు విడుదలైన 8 వారాలు తర్వాతే వాటిని ఓటీటీలో విడుదల చేయాలని, నటీనటులు, సాంకేతిక కళాకారులు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత చిత్రాన్ని ముందుగా పూర్తిచేసిన తర్వాతే ఇతర చిత్రాల్లో నటించాలని సూచించారు. దీంతో పాటుప్రస్తుతం పలు సినిమాల విడుదలకు థియేటర్లు లభించని పరిస్థితుల్లో రూపొందించిన కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాతే షూటింగ్ పనులు ప్రారంభించాలని తీర్మానించారు.
దీని దృష్ట్యా ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని చిత్రాల షూటింగ్ పనులను అక్టోబరు 30వ తేదీలోపు పూర్తి చేయాలని తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్స్ వేతనాలు, ఇతర ఖర్చుల నియంత్రణ దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్న నేపథ్యంలో నవంబరు 1 నుంచి అన్ని సినిమాల షూటింగ్ లకు సంబంధించిన పనులను నిలిపివేయాలని తీర్మానించారు. భవిష్యత్తులో సినీరంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసినట్టు నిర్మాతల మండలి వెల్లడించింది.
ఇదిలా ఉంటే ధనుష్ ఆ మధ్యన తెలుగులో సార్ సినిమా చేసారు. ఇప్పుడు , నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ముగ్గురూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ పెట్టడం విశేషం.