- Home
- Entertainment
- 23 ఏళ్ళ హీరోయిన్ వల్ల 57 ఏళ్ళ టాలీవుడ్ స్టార్ కి 100 కోట్లు, అయినా చిన్నచూపు, ఎప్పుడు ఎలా జరిగింది ?
23 ఏళ్ళ హీరోయిన్ వల్ల 57 ఏళ్ళ టాలీవుడ్ స్టార్ కి 100 కోట్లు, అయినా చిన్నచూపు, ఎప్పుడు ఎలా జరిగింది ?
టాలీవుడ్ లో హీరోయిన్లకు క్రెడిట్ దక్కడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. కేవలం కొంతమంది హీరోయిన్లు మాత్రమే హీరోలని డామినేట్ చేసి క్రెడిట్ సొంతం చేసుకుంటారు. సౌత్ లో అలా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు నయనతార, అనుష్కశెట్టి , సమంత లాంటి వారు మాత్రమే ఉన్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్ లో హీరోయిన్లకు క్రెడిట్ దక్కడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. కేవలం కొంతమంది హీరోయిన్లు మాత్రమే హీరోలని డామినేట్ చేసి క్రెడిట్ సొంతం చేసుకుంటారు. సౌత్ లో అలా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు నయనతార, అనుష్కశెట్టి , సమంత లాంటి వారు మాత్రమే ఉన్నారు. మిగిలిన హీరోయిన్లు సినిమాల్లో నాలుగు పాటలు, కొన్ని గ్లామర్ సన్నివేశాలకు మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉంటారు.
ప్రస్తుతం శ్రీలీల పేరు సౌత్ లో బాగా వినిపిస్తోంది. గ్లామర్, డ్యాన్స్ విషయంలో ఆమెకి తిరుగులేదు. ఆమె డ్యాన్స్, అందం ఫ్యాన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ బాబు కూడా ఆమె డ్యాన్స్ కి ఆశ్చర్యపోయారు. శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం అని ప్రశంసించారు. శ్రీలీలకి టాలీవుడ్ లో దక్కిన తొలి బ్లాక్ బస్టర్ మూవీ ధమాకా. ఈ చిత్రంలో శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ని ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు.
ధమాకా చిత్రం 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది అంటే అందుకు కారణం శ్రీలీల పెర్ఫార్మెన్స్ అని చాలా మంది క్రిటిక్స్ అభిప్రాయ పడ్డారు. శ్రీలీల గ్లామర్ గా కనిపిస్తూ మంచి జోష్ తో డ్యాన్స్ చేయడంతో ధమాకా చిత్రానికి రిపీట్ వాల్యూ వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఆమెకి క్రెడిట్ దక్కలేదు అనే అభిప్రాయం కూడా ఉంది.
దీనిపై ధమాకా చిత్రానికి రచయితగా పనిచేసిన ప్రసన్న బెజవాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలీల వల్లే ధమాకా చిత్రానికి 100 కోట్లు వచ్చాయని అంటున్నారు అని ఓ ఇంటర్వ్యూలో ప్రసన్నకి ప్రశ్న ఎదురైంది. దీనితో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలీల వల్లే 100 కోట్లు రావడం ఏంటి ? సినిమా లో పాటలు డ్యాన్సులు మహా అయితే 20 నిమిషాలు ఉంటాయి. మిగిలిన 2 గంటల చిత్రాన్ని నడిపించేది కథే అని ప్రసన్న అన్నారు.
శ్రీలీల చాలా చిత్రాల్లో గ్లామర్ గా కనిపించింది, డ్యాన్సులు చేసింది. మరి ఆ చిత్రాలన్నీ హిట్ అయ్యాయా అని ప్రసన్న బెజవాడ ప్రశ్నించారు. 2 గంటల కథ ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా అనిపించాలి. అప్పుడు పాటలు, డ్యాన్సులు కథకి బోనస్ అవుతాయి. ధమాకా చిత్రంలో కూడా శ్రీలీల బోనస్ అయింది అని ప్రసన్న అన్నారు. ప్రసన్న కామెంట్స్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. శ్రీలీలకి క్రెడిట్ ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల, రవితేజ మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా అప్పట్లో చర్చ జరిగింది. ప్రస్తుతం శ్రీలీల వయసు 23 ఏళ్ళు, రవితేజ వయసు 57 ఏళ్ళు.