- Home
- Entertainment
- Devatha: జానకమ్మ కోసం అస్పత్రికి బయలుదేరిన దేవుడమ్మ.. అడ్డంగా దొరికిపోయిన రుక్మిణి!
Devatha: జానకమ్మ కోసం అస్పత్రికి బయలుదేరిన దేవుడమ్మ.. అడ్డంగా దొరికిపోయిన రుక్మిణి!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకమ్మ వాళ్ళ భర్త,ఇప్పుడే స్పృహ లోకి వచ్చి మళ్ళి స్పృహ తప్పిపోవడం ఏంటి అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాద, అమ్మ నాకు ఏదో చెప్పాలనుకున్నది కానీ ఇంతలో ఏమైందో తెలియదు ఒకేసారి మాట పడిపోయి మళ్ళీ మత్తులోకి వెళ్లిపోయింది అని అంటుంది. అప్పుడు మాధవ్ వెనకాతల నుంచి భయపడతాడు. ఆ తర్వాత సీన్లో దేవి, చిన్మయిలు భాగ్యమ్మతో పాటు పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి, నానమ్మ ఎక్కడా? నేను చూడాలి అని ఏడుస్తూ ఉంటారు.
అప్పుడు భాగ్యమ్మ , పిల్లలు చాలా బాధపడుతున్నారమ్మ వాళ్ళ బాధను చూడలేక తెచ్చాను అని అంటుంది. అప్పుడు దేవి, చిన్మయిలు నానమ్మ ఎక్కడా అని అనగా నానమ్మ ఇంకా మంచం మీద ఉన్నారమ్మ స్పృహంలోకి రాలేదు అని అంటారు.అప్పుడు దేవి దేవుడమ్మ కి ఫోన్ చేస్తుంది. ఏడుస్తూ మా నానమ్మ మెట్ల మీద నుంచి పడిపోయారా హాస్పిటల్ లో ఉన్నాది అని అనగా దేవుడమ్మ ఆశ్చర్యపోయి ఎప్పుడు జరిగింది నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని మా ఆదిత్య కి చెప్పి బయలుదేరుదాం రా అని అంటాడు.
అప్పుడు ఆదిత్య, ఇప్పుడు అక్కడ రుక్మిణి ఉంటే అమ్మకు కనిపిస్తే సమస్య అవుతుంది కదా అని భయపడతాడు. ఇంతలో దేవుడమ్మ కంగారు పెట్టి ఆదిత్య అని హాస్పిటల్ కి తీసుకు వస్తుంది.అదే సమయంలో భాగ్యమ్మ, ఇంక ఇంటికి వెళ్దాము అని దేవి,చిన్మయి ల తో అనగా,మేము ఇక్కడే ఉంటాము మేము నానమ్మని వదిలి వెళ్ళము అని వాళ్ళు అంటారు. అమ్మ ఎప్పుడు లెగుస్తుందో తెలియదు కదా అప్పటివరకు హాస్పిటల్లో ఉండడం ఎందుకు చిన్నపిల్లలు కదా అని అనగా, మేము ఉంటాము అని వాళ్ళు అంటారు.
అప్పుడు రాద కూడా ఉండనివ్వండి అని అంటుంది. అప్పుడు భాగ్యము వెళ్తున్నప్పుడు రాధ తన ఫోన్ ఇచ్చి చార్జింగ్ లో పెట్టమని చెప్తుంది. మరోవైపు వాళ్ళు హాస్పిటల్ కు వస్తున్నట్టు ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేయాలనుకున్న ఫోన్ కనెక్ట్ అవ్వదు. ఈలోగా దేవుడమ్మ ఆదిత్యలుపైకి వస్తారు. ఆదిత్య, దేవుడమ్మ అక్కడ ఉండడం చూసి చిన్నయి, అమ్మ దేవుడమ్మ అవ్వ ఆఫీసర్ సారు వచ్చారు అని చెప్తుంది. వాళ్ళని చూసిన రుక్మిణి ఆశ్చర్యపోయి చిన్మయిని తీసుకొని అటువైపు వెళుతుంది.
ఇంతలో దేవి వాళ్ళిద్దర్నీ చూసి రండి అవ్వ, రండి ఆఫీసర్ సారు అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇంతలో జానకమ్మ గారికి ఏం అవ్వదు ఏం భయపడొద్దు అని దేవుడమ్మ వాళ్ళందరికీ ధైర్యం చెప్తుంది.అప్పుడు ఆదిత్య రుక్మిణి అక్కడ లేకపోవడం చూసి ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడు చిన్మయి, అమ్మ దేవుడమ్మ అవ్వకి కనబడకూడదు అనుకుంటుంది అంటే అక్కడికి వెళ్లడం ఇష్టం లేదనే కదా!
అంటే ఇంక నాతోనే ఉంటుందని కదా ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళదు అని అనుకుంటుంది. అప్పుడు దేవి, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి ఆఫీసర్ వచ్చారమ్మా వెళ్లి ఒకసారి పలకరించండి అని అనగా చిన్మయి, నేను వస్తాను దేవి మనిద్దరం ముందు వెళ్దాము తర్వాత అమ్మ వస్తుంది అని అంటుంది. మరోవైపు సత్య జరిగిన విషయమంతా గుర్తుతెచ్చుకొని, ఆదిత్య ఈమధ్య అక్క దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్యని వెంటనే ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకువెళ్లి పోవాలి.
పిల్లలు లేరనే కదా నన్ను పట్టించుకోవట్లేదు అదే పిల్ల కోసమే కదా అక్క వెనుక తిరుగుతున్నాడు. ఇంక ఆదిత్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక్కదాన్నే అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్ లో అందరూ దేవుడమ్మ ఎప్పుడు కళ్ళు తెరస్తుందా అని అందరూ చూస్తారు.ఇంతలో మాధవ్ బయటికి వెళ్లి,అసలు నేనేం చేశాను,అమ్మకి నిజం తెలియకుండా ఉండాల్సింది. లేకపోతే ఇంత జరిగేది కాదు. ఈరోజు ఉదయం నేను అమ్మని చూడకుండా ఉండుంటే ఈపాటికి రాధ నా భార్య అయి ఉండేది.
మంచి అవకాశం కోల్పోయాను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్లు బయటకు వచ్చి,చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నది గాని ప్రస్తుతానికి ఈవిడ మాట పడిపోయింది, కాళ్లు కూడా పనిచేయవు అని అనగా, అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇంక నానమ్మ నడవలేదా, మాట కూడా రాదా అని దేవి,చిన్మయి ఏడుస్తూ ఉండగా, ఆదిత్య, ఇప్పుడు అవ్వదటమ్మా మళ్లీ భవిష్యత్తులో మాట వస్తుంది, నడవగలరు పరవాలేదు మీరు బాధపడొద్దు అని అంటారు. అప్పుడు ఈ విషయం అంతా బయటనుంచి చూస్తున్న రుక్మిణి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!