- Home
- Entertainment
- Devatha: సూపర్ సీన్.. దేవుడమ్మను కలుసుకున్న రుక్మిణి.. కావాలనే దేవిని ఏడిపించిన మాధవ!
Devatha: సూపర్ సీన్.. దేవుడమ్మను కలుసుకున్న రుక్మిణి.. కావాలనే దేవిని ఏడిపించిన మాధవ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇఈ రోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ (bhagyamma),రాధ ముఖానికి పసుపు పూసి ఎవరు గుర్తుపట్టకుండా బొట్టుపెట్టి అప్పుడు ఊర్లో ఉన్న గుడికి వెళ్ళమని చెబుతుంది. మరొకవైపు దేవుడమ్మ,రామ్మూర్తి కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇంతలో దేవుడమ్మ(devudamma) భోజం సమర్పిస్తూ ఉండగా ఇంతలో అమ్మవారు వచ్చిన ఒక మహిళ ఆగవే అంటూ దేవుడమ్మ మీద అరవడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా భయపడి పోతారు.
ఇంతలోనే దేవుడమ్మ(devudamma)తో అమ్మవారు వచ్చిన మహిళ అన్ని ఇచ్చాను నీకు అన్ని ఇచ్చినా కూడా ఏదో కొదువ ఉంది. నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక తీర్చమనే కదా బోనం ఎత్తావు అని అనడంతో దేవుడమ్మ సంతోషపడుతూ ఉంటుంది. నీ కోరిక నేను తీరుస్తాను అనడంతో దేవుడమ్మ సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు భాగ్యమ్మ(bhagyamma)ఇప్పుడు గుడికి వెళ్ళు అమ్మవారికి బోనం సమర్పించి నా పెనిమిటిని నా బిడ్డను ఒకటి చేయి అని అమ్మవారిని వేడుకో అని చెబుతుంది.
అప్పుడే రాధ(radha),భాగ్యమ్మ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. మరోవైపు అమ్మవారి వచ్చిన మహిళ కళ్ళు తెరిచి చూడు నీ ముందరే ఉంది నువ్వు గుర్తుపట్టాలి అని అనడంతో దేవుడమ్మ ఆశ్చర్య పోతుంది. నీ కోరిన కోరికను నీ దగ్గరికి నడిపిస్తాను నువ్వు గుర్తుపట్టాలి అని చెబుతుంది. మరొకవైపు రాధ బోనం తీసుకొని గుడి దగ్గరకు వస్తుంది. అప్పుడు దేవుడమ్మ(devudamma)ని కోరుతూ నా కోడలిని తొందరగా చూపించు తల్లి అని వేడుకుంటుంది.
మరొకవైపు ఆదిత్య(adithya)జరిగిన విషయాలను తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవి అక్కడికి వచ్చి అమ్మవారికి ఏమని అని ముక్కావు అని అడగగా నీ గురించి మీ అమ్మ గురించి బాగుండాలి అని ముక్కుకున్నాను అని అనగా వెంటనే దేవి మా అమ్మ గురించి ఏమని మొక్కావు అనడంతో వెంటనే ఆదిత్య చెప్పడానికి తన పడుతూ ఉంటాడు. ఇక వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నా మాటలు విన్న మాధవ(madhava) కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
మరొకవైపు భాష, కమల(kamala) ఇద్దరు రుక్మిణి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత రాధ అమ్మవారికి బోనం సమర్పించడానికి అక్కడికి వస్తుంది. అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉండగా ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి ఆగు అమ్మాయి అని అరుస్తుంది. అప్పుడు రాధ(radha) భయపడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడమ్మ రుక్మిణి తలపై ఉన్న బోనం కిందికి దింపుతుంది.
ఆ తరువాత రాధ దేవుడమ్మ(devudamma)కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. మరొకవైపు చిన్మయి అమ్మవారికీ మొక్కుతూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వచ్చి సత్య రావడం గమనించి చిన్మయి తో ఏంటి అమ్మ నువ్వు దేవి(devi) భోనం కలిసి ఎత్తుకుటే చూడాలి అనుకున్నాను అంటూ సత్యకు వినిపించే విధంగా మాట్లాడుతాడు. అప్పుడు సత్య అక్కడికి వెళ్ళగా మాధవ దేవి పై ఎక్కువ ప్రేమ ఉన్నట్టు సత్యతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆ మాటలు దేవి వింటుంది.