MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: దేవి ప్రవర్తనలో మార్పు చూసి ఆనంద పడుతున్న ఆదిత్య..రుక్మిణి గురించి సత్యను నిలదీసిన దేవుడమ్మ..?

Devatha: దేవి ప్రవర్తనలో మార్పు చూసి ఆనంద పడుతున్న ఆదిత్య..రుక్మిణి గురించి సత్యను నిలదీసిన దేవుడమ్మ..?

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Nov 04 2022, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్లో దేవి తన తండ్రి ఆఫీసర్ సారు అని తెలుసుకొని ఆనంద పడుతూ ఉంటుంది. ఇంతలో చిన్మయి అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు దేవి ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఏం లేదులే అక్క అని అనడంతో నేను ఏ విషయమైనా నీతో పంచుకుంటాను కదా అలా నువ్వు నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది చిన్మయి. అప్పుడు దేవి సంతోషంతో ఈరోజు మా నాయన ఎవరో నాకు తెలిసిపోయింది అనటంతో చిన్మయి షాక్ అవుతుంది.
 

28

ఎవరు దేవి మీ నాన్న అని అడగడంతో ఇంకెవరు ఆఫీసర్ సారే అని సంతోషంగా చెబుతుంది దేవి. అప్పుడు చిన్మయి ఆఫీసర్ సారే మీ నాన్న అన్న విషయం నాకు ముందే తెలుసు దేవి అనడంతో దేవి షాక్ అవుతుంది. నీకు ఎలా తెలుసు అక్క నాకు ఎందుకు చెప్పలేదు అనడంతో తెలుసులే దేవి అది ఎలాగో మళ్ళీ చెప్తాలే అని అంటుంది. ఆ తర్వాత ఇంకొక విషయం దేవి సత్య పిన్ని మరెవరో కాదు మన అమ్మ చెల్లెలు అనగా దేవి మరింత షాక్ అవుతుంది.
 

38

సత్యా పిన్ని ఆదిత్య సార్ కి దూరం అవుతుందని అమ్మ వెళ్లకుండా ఇక్కడే ఉంది అని అంటుంది.. ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా ఉండగా ఇంతలోనే అక్కడికి ఆదిత్య రాద ఇద్దరు వస్తారు. అప్పుడు దేవి సంతోషంతో వెళ్లి ఆఫీసర్ సారు అని హత్తుకుంటుంది. అది చూసి రాధ ఆశ్చర్య పోతుంది. ఏంటి ఆఫీసర్ సారు మా ఇంటి దాకా వచ్చి నన్ను మాట్లాడకుండా వెళ్తారా పదండి ఇంట్లోకి వెళ్లి చాయ్ తాగి వెళ్దురు అని చెప్పి ఆదిత్యను  బలవంతంగా లోపలికి పిలుచుకొని వెళుతుంది దేవి.
 

48

 జానకమ్మ ఉండడంతో జానకమ్మ అని ప్రేమగా పలకరిస్తాడు ఆదిత్య. అప్పుడు దేవి రాధకు అమ్మ నువ్వు వెళ్లి ఆఫీసర్ కు టీ తీసుకొని రాపో అని అంటుంది. అప్పుడు దేవి సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఇంకా అక్కడే ఉండగా నువ్వేంది ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్లి చాయ్ తీసుకుని రాపో అంటుంది దేవి. ఇంతలోనే మాధవ అక్కడికి వచ్చి రోజు రోజుకి ఆదిత్య దేవి దగ్గర అవుతున్నాడు అని వాళ్లను చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు.
 

58

అప్పుడు దేవి మాత్రం ఆదిత్యతో సంతోషంగా మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది. ఇంతలోనే రాధా కాఫీ తీసుకొని రాగా దేవి ఇప్పించుకుని ఇస్తుంది. అది చూసి మాధవ కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవి సారు నువ్వు మా అమ్మ కలిసి వచ్చారు కదా మా అమ్మ నిన్ను ఎక్కడ కలిసింది అని అడగడంతో వాళ్లు షాక్ అవుతారు. ఇప్పుడు ఆదిత్య ఏదో ఒకటి చెప్పి నచ్చ చెబుతాడు. దేవి మాటలకు రాధ, ఆదిత్య ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు దేవి మాటలకు మాధవ షాక్ అయ్యి ఈ ఆశ్చర్యపోతూ ఉంటాడు.
 

68

మరొకవైపు సత్య మాధవ అన్న మాటలు తలుచుకొని ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో దేవుడమ్మ అక్కడికి సత్య నేను ఒక విషయం అడుగుతాను నిజం చెబుతావా మీ అక్క ఇక్కడే ఎక్కడో ఉంది కదా అనడంతో సత్య షాక్ అవుతుంది. ఎందుకు ఆంటీ అలా అంటున్నారు ఆ అనుమానం మీకెందుకు వచ్చింది అనడంతో ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని మాట చూసుకోవడం లేదు అంటే అదే కదా అర్థం అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆదిత్య అక్కడికి వస్తాడు.
 

78

 ఏమి పలకరియకుండా వెళుతుండడంతో వెంటనే దేవుడమ్మ ఏంట్రా అలా వెళ్తున్నావ్ కనీసం భోజనం చేసి వెళ్ళు అనడంతో ఆకలిగా లేదు అమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. గదిలోకి వెళ్లిన ఆదిత్య దేవి అన్న మాట తలుచుకొని సంతోష పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి సత్య వస్తుంది. అప్పుడు సత్య ఎంత అరుస్తున్నా కూడా ఆదిత్య వినిపించుకోకుండా దేవి అన్న మాటలు తలుచుకొని ఆ ఊహలో ఉంటాడు.
 

88

అప్పుడు సత్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దేవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చిన్మయి వస్తుంది. మాయమ్మ మా నాయన కలిసి ఉండకపోవడానికి కారణం మా చిన్నమ్మ అని అంటుంది దేవి. అందుకే మా అమ్మను ఆఫీసర్ ఆ ఇంటికి తీసుకొని వెళ్లలేక ఇక్కడే ఉంచాడు అని అంటుంది దేవి. మరొకవైపు ఆదిత్య జీవితం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి నేను నిన్ను ఒక విషయం అడగాలి నీలో వస్తున్న మార్పుకు నాకు ఒక అనుమానం వచ్చింది అని అంటుంది దేవుడమ్మ.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?
Recommended image2
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు ఏమైంది? వరుసగా డైరెక్టర్లు ఎందుకు తప్పుకుంటున్నారు?
Recommended image3
రష్మిక మందన్న చేత స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టించిన విజయ్ దేవరకొండ, ఆమె గురించి అలా అనేసరికి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved