MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హరికృష్ణ తండ్రితో సమానం, జూ.ఎన్టీఆర్ పై దేవినేని అవినాష్ కామెంట్స్.. అభిమానంతో అలా చేస్తే దారుణంగా ట్రోలింగ్

హరికృష్ణ తండ్రితో సమానం, జూ.ఎన్టీఆర్ పై దేవినేని అవినాష్ కామెంట్స్.. అభిమానంతో అలా చేస్తే దారుణంగా ట్రోలింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే ఇటీవల రాజకీయాల్లో ఆయన పేరు ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. తారక్ ఏం చేసిన పొలిటికల్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని అయితే పదేపదే తారక్ ప్రస్తావన తెస్తుంటారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 06 2023, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే ఇటీవల రాజకీయాల్లో ఆయన పేరు ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. తారక్ ఏం చేసిన పొలిటికల్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని అయితే పదేపదే తారక్ ప్రస్తావన తెస్తుంటారు. తాజాగా మరో వైసిపి యువనేత దేవినేని అవినాష్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసి ట్రోలింగ్ కి గురయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దేవినేని అవినాష్ తారక్ పై అభిమానంతో కామెంట్స్ చేసినప్పటికీ ఆయన్ని కొందరు నందమూరి ఫ్యాన్స్, టిడిపి అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. శుక్రవారం రోజు మే 5న యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి తమ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తారక్, ప్రణతి దంపతులకు పెద్ద ఎత్తున అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 

36

దేవినేని అవినాష్ కూడా ఎన్టీఆర్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా కుటుంబానికి ప్రత్యక్ష దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు , తండ్రి సమానులైన హరికృష్ణ గారి కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో గడపాలని మనసారా కోరుకుంటున్నాను అని అవినాష్ విష్ చేశారు. 

 

46

అయితే అవినాష్ వైసిపి పార్టీ కావడంతో కొందరు టిడిపి మద్దతుదారులు ఆయన్ని టార్గెట్ చేశారు. కేవలం ఎన్టీఆర్ అభిమానుల నుంచి సింపతీ పొందడం కోసమే అవినాష్ ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపారు అని.. నిజంగా అవినాష్ కి నందమూరి ఫ్యామిలీపై ఎలాంటి అభిమానం లేదని అంటున్నారు. 

56

కొందరు అయితే ఇది దేవినేని అవినాష్ పొలిటికల్ జిమ్మిక్కులో భాగం అని ట్రోల్ చేస్తున్నారు. హరికృష్ణ తండ్రి సమానం అంటున్న దేవినేని అవినాష్.. ఆయన బతికున్నప్పుడు ఆ రకమైన అభిమానం చూపించరా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. 

66
Image: Jr NTR/Instagram

Image: Jr NTR/Instagram

అయితే అవినాష్ మద్దతు దారులు ఈ ట్రోలింగ్ ని తిప్పుకోడుతున్నారు. అవినాష్ అభిమానంతో ఎన్టీఆర్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపితే దానిని కూడా ఇలా వివాదం చేయడం సరైంది కాదు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి భార్గవ్ రామ్, అభయ్ రామ్ ఇద్దరు కుమారులు సంతానం. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై
Recommended image2
Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం
Recommended image3
Viswanath & Sons Trailer Review: కొడుకుని చూసుకోమంటే ఐ లవ్యూ చెప్పింది.. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved