MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: రుక్మిణి కోసం దేవుడమ్మ.. తన తండ్రి కోసం దేవి.. వీళ్ళకు నిజం తెలుస్తుందా?

Devatha: రుక్మిణి కోసం దేవుడమ్మ.. తన తండ్రి కోసం దేవి.. వీళ్ళకు నిజం తెలుస్తుందా?

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

2 Min read
Author : Navya G
Published : Aug 04 2022, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... నువ్వు స్కూల్ దగ్గర ఉంటావు కదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు అవ్వ? అని దేవి, భాగ్యమని అడగగా, నాకు ఉదయం గంట సాయంత్రం గంట అక్కడ పని ఉంటుంది.మిగిలిన రోజంతా ఖాళీగానే ఉంటున్నాను అని ఏమైనా పనుంటే చెప్పమని రాధమ్మని అడిగినాను. అప్పుడు రాధమ్మ ఇక్కడికి వచ్చి పని చేసుకోమని చెప్పింది అని భాగ్యమ్మ అంటుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

అప్పుడు దేవి, మా అమ్మని  జాగ్రత్తగా చూసుకో, మ అమ్మ చాలా మంచిది. నువ్వుంటే అమ్మకి ధైర్యంగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు భాగ్యమ్మ ,అది సరేగాని నువ్వెందుకు ఈ దుస్తులు వేసుకున్నావు అని దేవి వేసుకున్నా కరాటే బట్టలు గురించి అడుగుతుంది. నేను కరాటే నేర్చుకుంటున్నాను. పెద్దయ్యాక మా నాయన కొట్టడానికి అని అంటుంది.మాధవ్ సార్ పసిపాప మనసులో ఇంత విషయాన్ని నాటాడు అని బాధపడుతుంది భగ్యమ్మ.
 

38

ఆరోజు రాత్రి దేవుడమ్మ, రుక్మిణి ఫోటో చూస్తూ నువ్వు బతికే ఉన్నావని నాకు తెలిసినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా?, నా దగ్గరికి చూడడానికి కూడా రాలేదు అని బాధపడుతూ ఉండగా దేవుడమ్మ వాళ్ళ భర్త అక్కడికి వచ్చి ఈ మాటలన్నీ విని దేవుడమ్మని ఓదారుస్తాడు. ఎలాగైనా ఎక్కువ మనుషులను పెట్టి రుక్మిణి కోసం వెతికించండి అని దేవుడమ్మ తన భర్తని ఏడుస్తూ అడుగుతుంది.
 

48

ఏమి భయపడొద్దు తప్పకుండా దొరుకుతుంది అని దేవుడమ్మ వాళ్ళ భర్త దేవుడమ్మకి ధైర్యం చెబుతాడు. తర్వాత రుక్మిణి వంట చేస్తూ ఉండగా దేవి అక్కడికి వచ్చి, అమ్మ నేను నీ పోలిక నాయన పోలిక? అని అడగగా నువ్వు నాయన పోలిక.నిన్ను చూసినప్పుడల్లా నాకు నా పెనిమిటే గుర్తొస్తాడు అని అంటుంది రుక్మిణి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న నీకు వచ్చింది అని దేవిని అడుగుతుంది రుక్మిణి.
 

58

నాకు తెలియాలి. నాయనకు ఏమైనా పుట్టుమచ్చలు ఉంటాయా? ఇంకేమైనా పోలికలు ఉంటాయ? అని అడుగుతుంది దేవి. అప్పుడు రుక్మిణి ఇంకేమీ పోలికలు లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో సత్యా ఇందాక ఆదిత్యతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటూ ఆదిత్య తన దగ్గర ఏదో దాస్తున్నాడని అది ఏంటో అని బాధపడుతూ ఉంటుంది.
 

68

దేవుడమ్మ అక్కడికి వచ్చి ఏమైంది? అని అడుగుతాది. నేను వైద్యం కోసం అమెరికా వెళ్ళనుఅని సత్య  దేవుడమ్మకి చెప్పగా, ఎందుకు వెళ్ళవు? అని అడగగా, పిల్లలు ఇద్దరి మధ్య ఆనందం వల్ల పుడతారు కాని డాక్టర్ ఇచ్చిన మందులు వలన కాదు. ఆదిత్య ఈ మధ్య సరిగ్గా ఇంటికి రావడం లేదు అని చెప్పి బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సత్య. ఆదిత్య ఎందుకిలా తయారవుతున్నాడు అని దేవుడమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది.
 

78

దేవి అలా అడిగేసరికి రుక్మిణి బాధపడుతూ బయటకు వచ్చేస్తుంది.అప్పుడు భాగ్యమ్మ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. ఇక్కడ ఉంటే దేవి మనసులోని తన తండ్రి మీద ద్వేషం పెరిగిపోతుంది ఎలాగైనా దేవిని వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తాను అని రుక్మిణి అంటుంది.ఈ లోగా దేవి అక్కడికి వచ్చి నాకు నిద్ర రావడం లేదు నాకు నాయన గురించి ఏవైనా తెలియాలి అది నువ్వే చెప్పాలి.
 

88

మీ ఇద్దరికీ పెళ్లెప్పుడు అయింది? నాయన ఏ ఊరిలో? ఉంటాడు అని దేవి రుక్మిణి నీ అడుగుతోంది. రుక్మిణి మౌనంగా ఉంటుంది. మనసులో మాత్రం నీ కళ్ళముందే ఉంటున్నా సరే నీ మాటలు విని ప్రతిక్షణం బాధపడుతున్నారు అని  అనుకుంటుంది. ఎప్పుడూ నాయన గురించి అడిగితే ఎందుకు చెప్పవు అని దేవి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Cannes: రాకుమారిలా అలియా భట్.. గ్రీన్ గౌను వేసుకుని కేన్స్‌లో మెరుపులు..
Recommended image2
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image3
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved